Skip to main content

DAE-DCSEM Recruitment: డీఏఈ–డీసీఎస్‌ఈఎంలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

DAE-DCSEM Recruitment

ముంబైలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ సర్వీసెస్‌ అండ్‌ ఎస్టేట్‌ మేనేజ్‌మెంట్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 33
పోస్టుల వివరాలు: టెక్నికల్‌ ఆఫీసర్‌–03, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌లు–10, టెక్నీషియన్‌ బి–20.

టెక్నికల్‌ ఆఫీసర్‌: 
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో మెకానికల్, సివిల్‌లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

సైంటిఫిక్‌ అసిస్టెంట్‌లు:
విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం:స్క్రీనింగ్‌ టెస్ట్,పర్సనల్‌ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపికచేస్తారు.

టెక్నీషియన్‌ బి: ట్రేడులు: ప్లంబింగ్, కార్పెంట్రీ, మాసన్రీ, ఫిట్టర్, ఎయిర్‌ కండిషనింగ్, ఎలక్ట్రికల్‌. 
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ట్రేడ్‌ సర్టిఫికేట్‌ ఉండాలి.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్‌ టెస్ట్, ట్రేడ్‌/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అసిస్టెంట్‌ పర్సనల్‌ ఆఫీసర్, రిక్రూట్‌మెంట్‌ సెక్షన్, డైరెక్టరేట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ సర్వీసెస్‌ అండ్‌ ఎస్టేట్‌ మేనేజ్‌మెంట్,విక్రమ్‌ సారాభాయ్‌ భవన్, అణుశక్తి నగర్, ముంబై–400094 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 29.04.2022

వెబ్‌సైట్‌: http://dcsem.gov.in/
 

చదవండి:  Goa Shipyard Recruitment: గోవా షిప్‌యార్డ్‌లో మేనేజర్ పోస్టులు.. నెలకు రూ.1.60 ల‌క్షల‌ వ‌ర‌కు వేతనం..​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date April 29,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories