Skip to main content

Engineer & Officer Jobs: సీసీఐ, న్యూఢిల్లీలో 46 ఉద్యోగాలు.. నెలకు రూ.40,000

Cement Corporation of India Limited

న్యూఢిల్లీలోని సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(సీసీఐ)..నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 46
పోస్టుల వివరాలు: ఇంజనీర్లు–27, ఆఫీసర్లు–19.

ఇంజనీర్లు: 
విభాగాలు: ప్రొడక్షన్, మెకానికల్, సివిల్, మైనింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ(బీఈ/బీటెక్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: 35ఏళ్లు మించకుండా ఉండాలి. 
జీతం: నెలకు రూ.40,000 చెల్లిస్తారు.

ఆఫీసర్లు: 
విభాగాలు: మెటీరియల్‌ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్, హ్యూమన్‌ రిసోర్స్‌ తదితరాలు.
అర్హత: గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ/ఐసీడబ్ల్యూఏ, ఐసీఎస్‌ఐ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 
వయసు: 35ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.40,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మేనేజర్‌(హెచ్‌ఆర్‌), సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్, లోధీ రోడ్, న్యూఢిల్లీ–110003 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 31.05.2022

వెబ్‌సైట్‌: http://www.cciltd.in/
 

చదవండి:  Manager Jobs: ఎన్‌బీసీసీ, న్యూఢిల్లీలో మేనేజర్‌ పోస్టులు.. నెలకు రూ.2.40 ల‌క్షల‌ వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 31,2022
Experience 5 year
For more details, Click here

Photo Stories