Skip to main content

PNB Recruitment: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో ఆఫీసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Punjab National Bank

న్యూఢిల్లీలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: చీఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌(సీఆర్‌ఓ), చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌ఓ), చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌(సీటీఓ), చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌(సీఐఎస్‌ఓ) తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌తోపాటు ఫైనాన్షియల్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌లో ప్రొఫెషనల్‌ సర్టిఫికేషన్, బీఈ/బీటెక్, ఇంజనీరింగ్‌/ఎంసీఏ, మాస్టర్స్‌/ఇంజనీరింగ్‌ డిగ్రీ, చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 45 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జనరల్‌ మేనేజర్‌–హెచ్‌ఆర్‌ఎండీ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, హ్యూమన్‌ రిసోర్స్‌ డివిజన్, ఫస్ట్‌ ఫ్లోర్, వెస్ట్‌ వింగ్, కార్పొరేట్‌ ఆఫీస్‌ సెక్టార్‌–10, ద్వారకా, న్యూఢిల్లీ–110075 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 10.01.2022

వెబ్‌సైట్‌: https://www.pnbindia.in

చ‌ద‌వండి: UBI Recruitment: యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 10,2022
Experience 5 year
For more details, Click here

Photo Stories