Skip to main content

Andhra Pradesh Jobs: అనంతపుర్‌ డీసీసీబీలో 86 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Anantapur DCCB

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, అనంతపురం జిల్లాలో అనంతపుర్‌ డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌(ఏడీసీసీబీ) ఉద్యోగాల భర్తీకి అర్హులైన స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 86
పోస్టుల వివరాలు: స్టాఫ్‌ అసిస్టెంట్‌లు/క్లర్కులు–66, అసిస్టెంట్‌ మేనేజర్లు–20.

స్టాఫ్‌ అసిస్టెంట్‌లు/క్లర్కులు: 
అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్‌ నాలెడ్జ్‌తోపాటు స్థానిక భాషలో ప్రొఫిషియన్సీ, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. 
వయసు: 45 ఏళ్లు మించకుండా ఉండాలి.

అసిస్టెంట్‌ మేనేజర్లు: 
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఎకనామిక్స్‌/స్టాటిస్టిక్స్‌/తత్సమాన సబ్జెక్టుల్లో పీజీ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. 
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షని ఆన్‌లైన్‌ విధానంలో మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఇంగ్లిష్‌ మాధ్యమంలో ఉంటుంది. దీనికి నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 03.12.2021

వెబ్‌సైట్‌: https://anantapurdccb.com

చ‌ద‌వండి: Andhra Pradesh Govt Jobs: ఏపీలో–896 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ పోస్టులు..

Qualification GRADUATE
Last Date December 03,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories