Bank of Baroda Recruitment: బీవోబీ, ముంబైలో 105 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడాలో వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 105
పోస్టుల వివరాలు: వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్–58, అగ్రి బ్యాంకింగ్ విభాగం: 47.
వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్:
పోస్టులు: హెడ్–వెల్త్ స్ట్రాటజిస్ట్, ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ మేనేజర్, పోర్ట్‌ఫోలియో రీసెర్చ్ అనలిస్ట్, ప్రొడక్ట్ మేనేజర్, ట్రేడ్ రెగ్యులేషన్, గ్రూప్ సేల్స్ హెడ్, ప్రొడక్ట్ హెడ్, ప్రైవేట్ బ్యాంకర్.
అర్హత: ఏదైనా డిగ్రీ(గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 22 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
అగ్రి బ్యాంకింగ్ విభాగం:
పోస్టులు: అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్లు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో నాలుగేళ్ల డిగ్రీ(గ్రాడ్యుయేషన్)తోపాటు రెండేళ్ల ఫుల్‌టైం పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం:షార్ట్‌లిస్టింగ్,పర్సనల్ ఇంటర్వ్యూ /గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.01.2022
వెబ్‌సైట్: https://www.bankofbaroda.in/
చదవండి: Bank Jobs: విశాఖపట్నం కో–ఆపరేటివ్ బ్యాంక్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 27,2022 |
Experience | 1 year |
For more details, | Click here |