UPSC Civils Interview 2022 : సివిల్స్ ఇంటర్వ్యూలో ‘సక్సెస్’ కావాలంటే.. ఇవే కీలకం..
మరికొద్ది రోజుల్లో పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) షెడ్యూల్ విడుదల చేస్తామని పేర్కొంది. 2023 జనవరి/ఫిబ్రవరిలో సివిల్స్–2022 ఇంటర్వ్యూలు మొదలయ్యే అవకాశముంది! ఈ నేపథ్యంలో.. మెయిన్ పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులు.. పర్సనాలిటీ టెస్ట్‌లోనూ విజేతలుగా నిలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు మీకోసం..
2,529 : సివిల్స్ మెయిన్‌లోనూ విజయం సాధించి.. చివరి దశ పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ)కు ఎంపికైన అభ్యర్థుల సంఖ్య. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 80 మంది వరకు ఇంటర్వ్యూకు అర్హత సాధించి ఉంటారని అంచనా.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియ మొత్తం 2025 మార్కులకు జరుగుతుంది. చివర దశలో నిర్వహించే ఇంటర్వ్యూకు 275 మార్కులు కేటాయించారు. ఇందులో సాధించే ప్రతి మార్కు ఎంపిక ప్రక్రియలో విజయానికి అత్యంత కీలకం. కాబట్టి అభ్యర్థులు ఇంటర్వ్యూలో రాణించేందుకు వ్యూహాత్మకంగా కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
మొత్తం పోస్టులు 1,011.. ఒక్కో పోస్ట్‌కు..
గత రెండేళ్లతో పోల్చితే ఈ ఏడాది సివిల్ సర్వీసెస్ పోస్ట్‌ల సంఖ్య పెరిగింది. వాస్తవానికి నోటిఫికేషన్ సమయంలో 861 ఖాళీలు అని పేర్కొన్నప్పటికీ.. పోస్ట్‌ల సంఖ్య 1,011కి పెరిగిందని యూపీఎస్సీ ఈ ఏడాది ఫిబ్రవరిలో చేసిన ప్రకటనలో తెలిపింది. ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ పేరుతో కొత్త సర్వీసుకు సంబంధించి 150 ఖాళీలను పేర్కొనడంతో.. మొత్తం పోస్ట్‌ల సంఖ్య 1,011కు పెరిగింది. ఒక్కో పోస్ట్‌కు దాదాపు 2.5 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేశారు.
చదవండి: Competitive Exams Preparation Tips: కోచింగ్ లేకుండానే... సివిల్స్, గ్రూప్స్!
డీఏఎఫ్‌కు చివరి తేదీ ఇదే..
సివిల్స్–2022 మెయిన్స్ ఫలితాలను వెల్ల డించిన యూపీఎస్సీ..త్వరలోనే ఇంటర్వ్యూ షెడ్యూల్ ప్రకటిస్తామని పేర్కొంది. డిటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్(డీఏఎఫ్)ను డిసెంబర్ 8 నుంచి డిసెంబర్ 14 వరకు అందుబాటులో ఉంచుతామని తెలిపింది. అభ్యర్థులు ప్రాథామ్యతా క్రమంలో.. జోన్లు, సర్వీసులను ఆన్‌లైన్ విధానంలో డిటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్‌లో తెలియజేయాలని సూచించింది. వీటన్నిం టినీ పరిగణనలోకి తీసుకుంటే.. ఇంటర్వ్యూలను జనవరి మూడో వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించే అవకాశముందని పేర్కొంటున్నారు. అభ్యర్థులు సన్నద్ధత పొందడానికి కొంత తక్కువ సమయమే ఉందని చెప్పచ్చు.
సివిల్ సర్వీస్ పరీక్షలపై రూరల్ బ్యాక్‌గ్రౌండ్ ప్రభావం: సాధు నరసింహారెడ్డి, ఐఆర్‌ఎస్
వ్యక్తిగత అంశాలపై ప్రత్యేకంగా ..
సివిల్స్ ఇంటర్వ్యూకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు.. అకడమిక్స్, ఉద్యోగం చేస్తున్నట్లయితే ప్రొఫెషన్, కుటుంబ నేపథ్యం తదితర వ్యక్తిగత అంశాల పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దీంతో పాటు మెయిన్స్ పరీక్షకు ముందు అందించిన డీఏఎఫ్–1, ఇంటర్వ్యూకు ముందు ఇవ్వాల్సిన డీఏఎఫ్–2లలో పొందుపరిచిన వివరాలపై సమగ్ర అవగాహన ఉండాలి.
మీ గురించి చెప్పమంటే..?
సివిల్స్ ఇంటర్వ్యూలలో ముందుగా మీ గురించి చెప్పండి అంటూ ప్రారం భిస్తారు. తర్వాత క్రమంగా డీఏఎఫ్‌లో పేర్కొన్న అంశాలు, సర్వీస్ ప్రాథామ్యతలు, సమకాలీన అంశాల వైపు ఇంటర్వ్యూ కొనసాగుతుంది. సివిల్ సర్వీసెస్‌నే ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటి? అనే ప్రశ్న ఎదురయ్యే అవకాశ ముంది. దీనికి సమాధానం ఇచ్చే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చాలా మంది ఈ ప్రశ్నకు సామాజిక సేవ లక్ష్యం అనే సమాధానం చెబుతారు. ఈ సమాధానాన్ని సమర్థించుకునేందుకు బలమైన కారణాలు, వ్యక్తీకరణ నైపుణ్యం పొందాలి. ముఖ్యంగా టెక్నికల్, మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్స్.. ‘సోషల్ సర్వీస్ లక్ష్యంగా సివిల్స్ ఎంపిక’ అనే సమాధానం చెప్పే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
ఇలాంటి ప్రశ్నలు కూడా..
అభ్యర్థుల వ్యక్తిగత నేపథ్యం, ఆసక్తులు తెలుసు కునేందుకు సంధించే తొలి ప్రశ్నలతో మొదలయ్యే ఇంటర్వ్యూ.. నిర్దిష్టంగా ఇంటర్వ్యూ తేదీ రోజు వరకు జరిగిన సమకాలీన అంశాలవైపు కూడా మళ్లుతుంది. ఉదాహరణకు... ‘ఈ రోజు పేపర్ చదివారా? అందులో మీకు బాగా ఆకట్టున్న వార్త ఏంటి?’ వంటి ప్రశ్నలు లేదా ఈ రోజు వార్తల్లో నిలిచిన ము ఖ్యాంశాలు ఏంటి? వంటి ప్రశ్నలు సైతం ఎదురవు తాయి. కాబట్టి అభ్యర్థులు ఇంటర్వ్యూ రోజున ప్రామాణిక దినపత్రికలు కనీసం రెండు చదవాలి. వాటిలో ముఖ్యమైన అంశాలకు సంబంధించిన వివరాలు గ్రహించాలి.
FAQ-UPSC: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సంబంధించిన 28 ముఖ్యమైన సందేహాలు - సమాధానాలు... మీ కోసం
కరెంట్ ఇష్యూస్‌పై ప్రత్యేకంగా..
సివిల్స్ ఇంటర్వ్యూ అభ్యర్థులు సమకాలీన అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. ఉక్రెయిన్– రష్యా యుద్ధం, అణ్వాయుధ ప్రయోగాల వల్ల ఏర్పడే పరిణామాలు? రష్యా విషయంలో మన దేశం అనుసరిస్తున్న వైఖరి, దీనిపై ఇతర దేశాల నుంచి ఎదురవుతున్న విమర్శలు వంటి వాటి గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. వాటికి సంబంధించి మన దేశ విధానంపై స్పష్టమైన అభిప్రాయం ఏర్పర చుకోవాలి. జాతీయ స్థాయిలో ఇటీవల చర్చనీయాంశంగా మారుతున్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీ కరణ, ఎల్‌ఐసీ ఐపీఓ, బ్యాంకింగ్ రంగంలో సంస్క రణలు తదితరాల గురించి కూడా తెలుసుకోవాలి.
ముఖ్యంగా ‘స్థానిక’ పరిస్థితుల గురించి..
సివిల్స్ ఇంటర్వ్యూకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు తమ స్వస్థలానికి సంబంధించిన సామాజిక, చారిత్రక నేపథ్యంపై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా ప్రస్తుతం స్థానికంగా ప్రాధాన్యత సంతరిం చుకున్న సమస్యలు, వాటి పరిష్కారానికి అనుసరించాల్సిన విధానాల గురించి తెలుసుకోవాలి.
సివిల్స్, గ్రూప్స్‌కు ఏకకాలంలో సన్నద్ధతకు మార్గాలు..
వీటిలో అప్రమత్తంగా ఉండాల్సిందే..
సివిల్స్ ఇంటర్వ్యూ అభ్యర్థులు.. తాము అప్లికే షన్‌లో పేర్కొన్న హాబీలపై ఇప్పటి నుంచే కసరత్తు చేయాలి. చాలామంది బుక్ రీడింగ్, వాచింగ్ టీవీ, వాచింగ్ మూవీస్, సింగింగ్, ప్లేయింగ్ వంటి వాటిని పేర్కొంటారు. ఇంటర్వ్యూలో వీటిపైనా ప్రశ్నలు అడుగుతారనే విషయాన్ని గమనించాలి. బుక్ రీడింగ్ హాబీకి సంబంధించి నిర్దిష్టంగా ఒక రచయిత పేరును పేర్కొన్న అభ్యర్థులు.. మరింత శ్రద్ధగా వ్యవహరించాలి. సదరు రచయిత ప్రచురణల్లో ముఖ్యమైనవి, వాటిలో పేర్కొన్న ముఖ్యమైన కొటేషన్లు, వాటి అర్థాలు, సదరు రచన సారాంశం లేదా ఉద్దేశం వంటి వాటి గురించి తెలుసుకోవాలి. బోర్డ్‌లో పలు నేపథ్యాల వ్యక్తులు ఉంటారు. వారు సదరు రచయిత రాసిన ఫలానా పుస్తకం చదివారా? అందులో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి? లేదా అందులో వివాదాస్పదమైన అంశం ఏంటి? వంటి ప్రశ్నలు అడిగే అవకాశముంది.
బలాలు, బలహీనతల విషయంలో మాత్రం..
సివిల్ సర్వీస్ ఆఫీసర్ అంటే.. ఒక విభాగానికి, లేదా ఒక ప్రాంతానికి పూర్తి స్థాయి అధికార పర్యవేక్షణ చేయాల్సిన హోదా. అందుకే వ్యక్తిగత లక్షణాలు కూడా కీలకంగా నిలుస్తాయి. ఇటీవల కాలంలో అభ్య ర్థుల వ్యక్తిగత బలాలు, బలహీనతలపైనా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అభ్యర్థులు తమ బలహీనతల గురించి చెప్పే విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. ‘అగ్రెసివ్‌నెస్’, ‘సహనం తక్కువ’ వంటివి అస్సలు చెప్పకూడదని గుర్తించాలి.
సూటిగా.. స్పష్టంగా
➤ ఇంటర్వ్యూలో అభ్యర్థుల వ్యక్తిగత వ్యవహార శైలి సైతం విజయాన్ని నిర్దేశిస్తుంది. ప్రధానంగా అభ్యర్థులు తమ అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా చెప్పగలిగే సామర్థ్యం అలవర్చుకోవాలి. సానుకూ ల లేదా ప్రతికూల.. అభిప్రాయం ఏదైనా సరే ఎదుటి వారిని మెప్పించే రీతిలో చెప్పాలి.
➤ ఇంటర్వ్యూ అంటే ప్రశ్న, సమాధానం అనే కోణంలోనే కాకుండా.. ఒక చర్చా వేదికగానూ భావించి ముందడుగు వేయాలి. కారణం.. 20 నుంచి 25 నిమిషాల వ్యవధిలో నిర్వహించే ఇంటర్వ్యూలో..ఆ వ్యవధి మొత్తం ఒకే అంశంపై చిన్న వాటి చర్చ మాదిరిగా ప్రశ్న–సమాధానాలు ఎదురవుతున్నాయి. కాబట్టి అభ్యర్థులు ముఖ్య మైన టాపిక్స్ కూలంకషంగా తెలుసుకోవడం ఎంతో అవసరం. అప్పుడే చర్చలో సమర్థంగా మాట్లాడే వీలుంటుంది.
Inspiring Success Story : ముగ్గురు కూతుళ్లు.. ఒకేసారి పోలీసు ఉద్యోగం రావడంతో..
తక్షణ పరిష్కారం లాంటి ప్రశ్నలు కూడా..
సివిల్స్ అభ్యర్థులు సమయస్ఫూర్తి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ను అలవరచుకోవాలి. గత రెండు, మూడేళ్లుగా ఇంటర్వ్యూల శైలిని పరిగణనలోకి తీసుకుంటే.. బోర్డ్ సభ్యులు.. అభ్యర్థుల్లోని ఈ స్కిల్స్‌ను పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఉదాహరణకు.. ‘మీరు ఐఏఎస్ అధికారిగా ఉన్నారు. ఆ ప్రాంతంలో ఫలానా సమస్య ఎదురైంది? దీనికి తక్షణ పరిష్కారంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?’ వంటి ప్రశ్నలు ఎదురవుతాయి. ఇలాంటి వాటికి సమాధానం చెప్పేటప్పుడు చాలా జాగ్ర త్తగా వ్యవహరించాలి. ఎదుటి వారిని మెప్పించే విదంగా సమాధానం చెప్పాలి. ప్రభుత్వ విధానాలను గౌరవిస్తూనే.. వాటికి అనుగుణంగా పరిష్కార చర్యలు చేపడతామనే విధంగా సమాధానాలు చెప్పాలి.
ఆహార్యం.. ఎంతో ముఖ్యం
ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు వ్యక్తిగత ఆహార్యంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలి. హుందాగా ఉండేలా వ్యవహరించాలి. పురుష అభ్యర్థులు లైట్ కలర్ షర్ట్స్ ధరించడం హుందాగా ఉంటుంది. అదే విధంగా మహిళా అభ్యర్థులు శారీ, లేదా సల్వార్ కమీజ్‌లను ధరించి ఇంటర్వ్యూకు హాజరవడం ఎదుటి వారిలో సదభి్ర΄ాయం కలుగజేస్తుంది. ఇంటర్వ్యూలో సమాధానాలిచ్చేటప్పుడు బాడీ లాంగ్వేజ్ కూడా ఎంతో ముఖ్యం. భావోద్వేగాలను, హావ భావాలను నియంత్రించుకోవాలి.
Inspiring Success Story : ఒకే జిల్లా. ఒకే బ్యాచ్.. ఎస్సై జాబులు కొట్టారిలా.. సొంత ఊరు కోసం..
ఈ మార్కులే.. విజయానికి కీలకం..
వాస్తవానికి మొత్తం 2025 మార్కులకు నిర్వహించే మూడంచెల సివిల్స్ ఎంపిక ప్రక్రియలో.. ఇం టర్వ్యూకు కేటాయించింది 275 మార్కులే. కాని ఇవే తుది జాబితాలో నిలపడంలో కీలకంగా మారుతున్నాయి. కారణం.. ఇంటర్వ్యూ అంతా ముఖాముఖి విధానంలో ఉండడం, బోర్డ్ సభ్యులు అడిగిన ప్రశ్నలు లేదా ఆయా అంశాలపై అవగాహనను, వ్యక్తిత్వ లక్షణాలను పరిశీలించే విధంగా ఇంటర్వ్యూ జరగడమే. ఈ విషయంలో ఏ మాత్రం తడబాటుకు గురైనా.. కొద్ది మార్కుల తేడాతో విజయం చేజారే ప్రమాదం ఉంది. లేదా కోరుకున్న సర్వీసు రాకపోయే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులు సమకాలీన పరిణామాలపై పట్టుతో పాటు సమయ స్ఫూర్తి, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు మెరుగుపరచుకునేందుకు కృషి చేయాలి.
Gandrathi Satish, SI: ఇంటర్, డిగ్రీలో ఫెయిల్..ఈ కసితోనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా..