Question in UPSC: యూపీఎస్‌సీ సివిల్స్ ఇంటర్య్వూలో ఈ ప్రశ్న.. దీనికి మీ సమాధానం?
ప్రతి ఏడాది యూపీఎస్సీ పరీక్షలకు వేలల్లో పోటీ పడుతారు. ఏ కొందరో దాన్ని సాధిస్తారు. కొద్దిమందే గమ్యాన్ని చేరుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి ప్రశ్నలుంటాయో. రాత పరీక్ష దాటిన తర్వాత అసలైన పరీక్ష ఇంటర్వూ. ఇందులో నిర్వహకులు చాలా వింతైన ప్రశ్నలను అడుగుతారు. అభ్యర్థి స్థితిప్రజ్ఞతను పరీక్షిస్తారు. విభిన్న పరిస్థితులకు ఎలా స్పందిస్తున్నారో గమనిస్తారు. ఇలానే ఈ సారి ఓ ర్యాంకర్‌కు ఇంటర్వూలో ఎదురైన ప్రశ్నను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది కాస్తా వైరల్‌గా మారింది. మరి.. ఆ ప్రశ్నకు మీరైతే ఏం జవాబు చెబుతారో?
IAS Success Story : తొలి ప్రయత్నంలోనే.. ఐఏఎస్ ఉద్యోగం సాధించా.. నా విజయానికి స్ఫూర్తి వీరే..
ప్రవీణ్ కశ్వాన్ అనే అభ్యర్థి ఈ సారి ఐఎఫ్ఎస్‌కు ఎంపికయ‍్యారు. తనకు ఎదురైన ప్రశ్నను పంచుక్నున్నారు. ' దేశంలో ఇంత పేదరికం ఉన్నప్పటికీ స్పేస్ మిషన్‌ల పేరిట ఎందుకు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వాలు వెచ్చిస్తున్నాయి.? మీరు దీన్ని ఎలా భావిస్తారు' అనే ప్రశ్నను ఇంటర్వూ బోర్డులోని మూడో వ‍్యక్తి ప్రవీణ్‌ను అడిగారట.
UPSC Civil Services Interview Dates : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2023 ఇంటర్వ్యూ తేదీలు ఇవే..
అందుకు ప్రవీణ్...' రెండు అంశాలకు పోల్చాల్సినవి కావు. 1928లో సీవీ రామన్.. రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నారు. కానీ రామన్ ప్రభావం నేడు పరిశోధనల్లో ముఖ్యంగా మెడికల్ సైన్స్‌లో ఎంతో ఉపయోగపడుతోంది. సమయం పడుతుంది కానీ కచ్చితంగా ఫలాలు ఉంటాయి. కొత్తవాటిని కనుగొనడానికి తగ్గిస్తే.. పేదరికాన్ని దూరం చేయలేము. ప్రజల వద్ద నైపుణ్యం లేని కారణంగా సంపాదించడం లేదు. అందుకు మన విద్యా వ్యవస్థలో లోపాలున్నాయి. మనం వాటిపై పనిచేయాలి.'అని ప్రవీణ్ సమాధానమిచ్చారట. ఈ ట్వీట్‌పై నెటిజన్లు సైతం తమ అభిప్రాయాలను పంచుకున్నారు.