Skip to main content

UPSC Civil Services Interview Dates : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2023 ఇంటర్వ్యూ తేదీలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (UPSC) సివిల్‌ సర్వీసెస్‌-2023 ఇంటర్వ్యూల షెడ్యూల్‌ను డిసెంబ‌ర్ 19వ తేదీన (మంగ‌ళ‌వారం) విడుద‌ల చేసింది. ఇటీవ‌లే యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌-2023 మెయిన్స్‌ పరీక్షల ఫలితాలను విడుదల చేసిన విష‌యం తెల్సిందే.
UPSC Civil Services 2023 Mains Exam Result UPSC  CSE 2023 Mains Result and Interview Dates Announced  Latest UPSC Civil Services Updates   upsc civil services interview dates news   UPSC Civil Services 2023 Interview Schedule

సివిల్స్ మెయిన్‌ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు వచ్చే ఏడాది జనవరి 2 నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అభ్యర్థుల రోల్‌ నంబర్‌, ఇంటర్వ్యూ తేదీ, సమయంతో ప్రత్యేక షెడ్యూల్‌ను రూపొందించింది. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 90 మంది వరకు అభ్యర్థులు ఇంటర్వ్యూకు అర్హత సాధించారు.

త్వరలోనే..

ఇంటర్వ్యూలకు మొత్తంగా 2,844 మంది అర్హత సాధించగా.. తొలుత 1026 మంది అభ్యర్థులకు సంబంధించి ఇంటర్వ్యూ షెడ్యూల్‌ను విడుదల చేసింది. మిగతా అభ్యర్థుల షెడ్యూల్‌ను తర్వాత విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఇంటర్వ్యూలకు సంబంధించి 1026 మంది అభ్యర్థులకు త్వరలోనే ఈ-కాల్‌ లెటర్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు UPSC ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం నిర్ణయించిన తేదీలు, సమయంలో మార్పు చేయాలన్న అభ్యర్థనలు స్వీకరించబోమని స్పష్టంచేసింది.

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2023 ఇంటర్వ్యూ తేదీల పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 19 Dec 2023 06:09PM
PDF

Photo Stories