Skip to main content

Success Story: ఎంబీబీఎస్‌లో గోల్డ్‌ మెడలిస్ట్‌... యూపీఎస్సీలో ఫెయిల్‌... చివరికి విజయం సాధించాడిలా...

యూపీఎస్సీలో విజయం సాధించేందుకు ఆయన.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు సార్లు ప్రయత్నించాడు. 2016 నుండి 2020 వరకు వరుసగా ఐదు ప్రయత్నాలు చేశారు. తొలి ప్రయత్నంలోనే ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు.
Rajdeep Singh Khaira

కానీ మెరిట్‌ లిస్టులో అతని పేరు లేదు. కానీ అతను ధైర్యం కోల్పోలేదు. విజయం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఐదో ప్రయత్నంలో 495వ ర్యాంకు సాధించి తన కల సాకారం చేసుకున్నాడు. అతడే డాక్టర్‌ రాజ్‌ దీప్‌ సింగ్‌ ఖైరా.
రాజ్‌దీప్‌ తన ప్రాథమిక విద్యను శరభలోని సీక్రెట్‌ హార్ట్‌ కాన్వెంట్‌ స్కూల్‌లో చదివాడు. ఇంటర్‌ తర్వాత ఎంబీబీఎస్‌ సీటు రావడంతో పటియాలా రాజేంద్ర హాస్పిటల్‌ కాలేజీలో చేరాడు. 2017లో మెడికల్‌ ఆఫీసర్‌గా జాబ్‌లో జాయినయ్యాడు. ఎంబీబీఎస్‌ చదువుతున్నప్పుడే యూపీఎస్సీ పరీక్షకు హాజరు కావాలని నిర్ణయించుకున్నాడు. 2016 నుంచి యూపీఎస్సీ రాయడం ప్రారంభించాడు. 

పాఠాలు నేర్పిన యూ ట్యూబ్‌.... 60 లక్షలతో అదరగొట్టిన గుంటూరమ్మాయి
అయితే డా.ఖైరాను విజయం దోబూచులాడింది. మొదటి ప్రయత్నంలోనే విజయం వరకు వెళ్లి చివరగా వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. ఫస్ట్‌ అటెంప్ట్‌లో ఇంటర్వ్యూ వరకు వెళ్లినా తుది జాబితాలో ఎంపికకాలేదు. ఇలా రెండు, మూడు, నాలుగు సార్లు రాసినా అనుభవం మాత్రం వస్తోంది... కానీ, ర్యాంకు దక్కట్లేదు. దీంతో విసిగిపోయిన ఖైరా తన గత తప్పులపై ఫోకస్‌ పెట్టాడు.

ప్రజల చేతికి ప్రభుత్వమే తుపాకులు ఇస్తోంది.... ఇప్ప‌టికే 5 వేల మంది రిజిస్ట్రేష‌న్‌
నాలుగు ప్రయత్నాల్లో ఎందుకు సక్సెస్‌ కాలేకపోయాడో బేరీజు వేసుకున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఐదోసారి విజయం దక్కించుకోవాలనుకుని ఫిక్స్‌ అయ్యాడు. గత తప్పుల్ని పునరావృతమవకుండా చూసుకుంటూ ముందుకు కదిలాడు. ఖైరా ప్రయత్నం ఫలిచింది. ఐదో ప్రయత్నంలో 495వ ర్యాంకు సాధించి శభాష్‌ అనిపించుకున్నాడు. 

బార్బర్‌గా స్టార్ట్‌ చేసి... నేడు కోట్లకు అధిపతి... అచ్చం రాజా సినిమా స్టోరీలాగే...
10వ తరగతిలో ఖైరా 91 శాతం మార్కులు సాధించాడు. ఇంటర్‌లో 94 శాతంతో జిల్లా టాపర్‌గా నిలిచాడు. ఎంబీబీఎస్‌లో గోల్డ్‌ మెడలిస్ట్‌ సాధించాడు. డా.ఖైరా మాట్లాడుతూ... ఓటమిని ఎన్నటికీ ఒప్పుకోకూడదంటాడు. ఎంబీబీఎస్‌ అయిపోగానే తన ఫ్రెండ్స్‌ మంచిగా సంపాదిస్తుంటే తాను మాత్రం ఉద్యోగానికి ప్రిపేరయ్యానని, ఆ సమయంలో చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు చెబుతాడు. బంధువులు పెళ్లి ఎప్పుడు అంటు ఎగతాళి చేసేవారని, ఇంటి చుట్టుపక్కల వాళ్లు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటూ వెటకారంగా మాట్లాడేవారని గుర్తు చేసుకుంటాడు. ఇలాంటి ఆటంకాలు ఎన్ని ఎదురైనా ధైర్యంగా ముందడుగు వేస్తేనే విజయం దక్కుతుందని డా.ఖైరా అంటాడు.

Published date : 09 Jan 2023 03:34PM

Photo Stories