Skip to main content

Success Story: పాఠాలు నేర్పిన యూ ట్యూబ్‌.... 60 లక్షలతో అదరగొట్టిన గుంటూరమ్మాయి

లాక్‌డౌన్‌... ఈ పేరు వింటే చాలు చాలా మంది గుండెళ్లో రైళ్లు పరిగెడతాయి. అనుకోని విపత్తు కోవిడ్‌ ముంచుకురావడంతో అప్పటివరకు ఎప్పుడూ వినని లాక్‌డౌన్‌ను దేశమంతా వినాల్సి వచ్చింది. విద్యార్థులకు పాఠాలు కుంటుపడ్డాయి. ఉద్యోగులు ఇంటికే పరిమితమయ్యారు.
pujitha Ravuri

ఇక కూలీనాలీ చేసుకుని బతికే వారి ఇబ్బందులు చెప్పనవసరం లేదు. కానీ, ఈ లాక్‌డౌన్‌ను కూడా తమకు అనుకూలంగా మలుచుకుని సక్సెస్‌ సాధించారు చాలామంది. అలాంటి వారిలో ఒకరే గుంటూరుకు చెందిన రావూరి పూజిత. రూ.60 లక్షల ప్యాకేజీతో అదరగొట్టిన ఆమె సక్సెస్‌ సీక్రెట్‌ ఆమెనె అడిగి తెలుసుకుందామా..!

చ‌ద‌వండి: 50 లక్షల ప్యాకేజీతో శభాష్‌ అనిపించుకున్న మధుర్‌... ఎలా సాధించాడో తెలుసా
బీటెక్‌ మొదటి సంవత్సరంలో ఉండగా కొవిడ్‌–19 మొదలైంది. అప్పుడే లాక్‌డౌన్‌  పెట్టారు. దాంతో చాలామందిలాగే నాకూ కాలేజీకి వెళ్లి చదువుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో కాలేజీ వాళ్లు ఆన్‌లైన్లో చెప్పే పాఠాలని శ్రద్ధగా వినేదాన్ని. నా సందేహాలు, సమస్యలను వీలున్నంత వరకూ అధ్యాపకులనో, సీనియర్లనో అడిగేదాన్ని. వీలుకానప్పుడు ఆన్‌లైన్‌ లో వెతికేదాన్ని. 

చ‌దవండి: ప్రజల చేతికి ప్రభుత్వమే తుపాకులు ఇస్తోంది.... ఇప్ప‌టికే 5 వేల మంది రిజిస్ట్రేష‌న్‌
నాన్న ప్రైవేటు బ్యాంకులో అధికారి. ఇద్దరం అమ్మాయిలమే. చెల్లి ఏడో తరగతి. ఏం చదవాలి... ఎలా చదవాలి అని సరైన మార్గనిర్దేశం చేసేవాళ్లు లేరు. దాంతో నేనే సొంతంగా ఆ ప్రయత్నం చేసేదాన్ని. జేఈఈలో ఝార్ఖండ్‌ బిట్స్‌లో సీటు వస్తే అమ్మానాన్నలు అంత దూరం ఎందుకన్నారు. దాంతో గుంటూరులోని కేఎల్‌ వర్సిటీలో బీటెక్‌లో చేరా.
ఫస్టియర్‌ మొదటి సెమ్‌లో ఉండగా కేఎల్‌ వర్సిటీ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ కోర్సు ప్రవేశపెట్టింది. అలా నా కోడింగ్‌ ప్రయాణం ప్రారంభమైంది.

చ‌దవండి:  సార్‌... గ్రూప్‌–1 ఫలితాలు ఎప్పుడో చెప్పండి

రెండో సెమిస్టర్‌ ముగిసే సమయానికి లాక్‌డౌన్‌. ఆన్‌లైన్‌ క్లాసులు అర్థం కాకపోతే యూట్యూబ్‌ వీడియోలను చూసి కోడింగ్‌పై పట్టు సాధించా. అలాగే ఉద్యోగం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలను నేర్చుకున్నా.
రోజులో సగం సమయం ఆన్‌లైన్‌ క్లాసులు వింటే తక్కిన సమయంలో ఆన్‌లైన్‌ లో సొంతంగా నేర్చుకొనేదాన్ని. లీట్‌కోడ్, కోడ్‌ షెఫ్, ప్రెప్‌బైట్స్, బైనరీ సెర్చ్‌డాట్‌కాం వంటి సైట్లలో కోడింగ్, ఇతర అంశాలు బాగా ఉండేవి. టైం మేనేజ్‌మెంట్‌ నేర్చుకొని.. ఆన్‌లైన్‌  అసెస్‌మెంట్లు, ఇంటర్వ్యూలు సాధన చేశా. అమెజాన్, అడోబ్‌ కంపెనీల్లో వార్షిక ప్యాకేజీ రూ.45 లక్షలతో ఆఫర్‌ వచ్చింది. గూగుల్‌ రూ.60 లక్షల ప్యాకేజీతో ఆఫర్‌ రావడంతో గూగుల్‌ను ఎంచుకున్నా. మరో వారంలో ఇంటర్న్‌షిప్‌కు వెళ్తున్నా. ఉద్యోగంలో బాగా గుర్తింపు, పట్టు తెచ్చుకున్నాక ప్రజలకు ఉపయోగపడే ప్రొడక్ట్స్‌కు రూపకల్పన చేయాలనేది నా లక్ష్యం.

Published date : 09 Jan 2023 01:57PM

Photo Stories