Skip to main content

Inspirational Story: బార్బర్‌గా స్టార్ట్‌ చేసి... నేడు కోట్లకు అధిపతి... అచ్చం రాజా సినిమా స్టోరీలాగే...

రాజా సినిమా తెలుసుకదా. విక్టరీ వెంకటేశ్, సౌందర్య నటించిన మూవీ. ఇందులో సౌందర్యను చదివించేందుకు, ఆమెను ఓ ప్రతిభావంతురాలిని చేయడానికి వెంకటేశ్‌ రేయింబవళ్లు కష్టపడతాడు. పాల పాకెట్ల దగ్గరినుంచి ఆటో డ్రైవర్‌ వరకు ఏది దొరికితే ఆ పని చేసి, సౌందర్యను తాను అనుకున్నట్లు పైకి తెస్తాడు.
Rameshbabu

సేమ్‌ అలాంటి కథే నిజజీవితంలో జరిగిందంటే మీరు నమ్ముతారా. కానీ, ఇక్కడ అతని విజయం కోసం కష్టపడి విజయపథంలో నడుస్తున్నాడు. 

చ‌ద‌వండి: నోట్ల రద్దు నిర్ణయం సరైనదే: సుప్రీం... అప్పట్లో 115 మంది మృతి...
పదో తరగతి వరకు చదివిన ఆ కుర్రాడి పేరు రమేష్‌. బెంగళూరులో జన్మించాడు. ఆయన తండ్రి పి.గోపాల్‌.. బార్బర్‌ షాప్‌ నడిపేవారు. రమేష్‌కు ఏడేళ్ల వయసులో తండ్రి మృతి చెందారు. దీంతో చిన్న వయసులోనే రమేష్‌ను కష్టాలు చుట్టుముట్టాయి. రెక్కాడితే కాని డొక్కాడని జీవితం వారిది. దీంతో తన తల్లి చిన్నచితకా పనులు చేస్తూ రమేష్‌ను చదివించింది. తను చదువుకుంటూనే కుటుంబానికి చేయూతగా నిలవాలనుకున్నాడు. ఎనిమిదో తరగతి నుంచి ఉదయాన్నే పేపర్, పాలు డోర్‌ డెలివరీ చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలవడం మొదలు పెట్టాడు. 
పదో తరగతి పూర్తయిన తర్వాత తన దగ్గరున్న డబ్బులతో తన తండ్రి బార్బర్‌ షాపునే రీమోడలింగ్‌ చేయించి, తాను బార్బర్‌గా మారాడు. అలా మొదలైన రమేష్‌ జీవితం అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్లింది. బార్బర్‌గా సంపాదించిన డబ్బులకు ఇంకొంత డబ్బులను అప్పుగా చేసి జత చేశాడు. ఆ బార్బర్‌ షాపునే మళ్లీ రీమోడలింగ్‌ చేసి ఇన్నర్‌ స్పేస్‌ పేరుతో లాంచ్‌∙చేశాడు. 

చ‌ద‌వండి: మళ్లీ తెరపైకి యోయో... యోయోలో టాప్‌ స్కోరర్‌ ఎవరో తెలుసా..?
1993లో మరింత ఎదగాలని రమేశ్‌ నిర్ణయించుకున్నారు. వేరే వ్యాపారంలో కూడా అడుగుపెట్టాలని భావించారు. దీంతో తాను దాచిన డబ్బుతో పాటు తన బంధువు వద్ద డబ్బు తీసుకొని ఓ మారుతీ ఓమ్నీ వ్యాన్‌ను కొని దాన్ని అద్దెకు ఇవ్వడం ప్రారంభించారు. తనకు వ్యాన్‌ నడిపే సమయం లేకపోవడంతో రెంట్‌కు ఇచ్చే వారు. ఇదే రమేశ్‌ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ వ్యాపారం రమేశ్‌ టూర్స్‌ అండ్స్‌ ట్రావెల్స్‌గా మారిపోయింది. 2004లో ఆయన రూ.38 లక్షలు ఖర్చు చేసి మెర్సెడెజ్‌ బెంజ్‌ను కొని అద్దెకు ఇవ్వడం మొదలు పెట్టారు. దీంతో ఒక్కసారిగా తలరాత మారిపోయింది. వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు లగ్జరీ కార్లు, బస్సులు మొత్తం కలిపి 400 వరకు రమేశ్‌ వద్ద ఉన్నాయి. బీఎండబ్ల్యూ, రోల్స్‌ రాయిస్, మెర్సెడెజ్‌ నుంచి ఇన్నోవా కార్ల వరకు అందులో ఉన్నాయి. ఇండియ‌న్ బిలియ‌నీర్ల‌లో తాను ఒక‌డిగా ఖ్యాతి సంపాదించాడు.
ఇన్ని కోట్లు సంపాదించినా ఇప్పటికీ రోజూ రమేష్‌ సెలూన్‌లో పని చేస్తారు. బార్బర్‌ నుంచి బిలినియర్‌గా ఎదగడంతో పాటు.. జీవితంలో పైకి ఎదుగుతామా లేదా అని సందేహిస్తున్న ఎంతో మందికి రమేశ్‌ బాబు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.

Published date : 02 Jan 2023 06:48PM

Photo Stories