Skip to main content

Max Woosey Inspirational Story: రెండేళ్లు టెంట్లలో పడుకుని ఏడు కోట్లు సాధించాడు... అతని వయసు కేవలం పదేళ్లే... ఆ బాలుడు ఎందుకు అలా చేశాడో తెలుసా..?

ఆడుతూ పాడుతూ.. ఆహ్లాదంగా గడపాల్సిన చిరుప్రాయంలోనే ఆ పిల్లాడి మదిలో ఓ ఆలోచన మెదిలింది. తనకు అన్ని సౌకర్యాలు ఉండడంతో హాయిగా ఇంట్లో బెడ్‌ మీద నిద్రపోతున్నాడు. అదే పేదలు రోగాల బారిన పడితే... వారిని ఎవరు చూసుకుంటారు.. ఎక్కడ పడుకుంటారు... ఇదే ఆ 10 ఏళ్ల పిల్లాడిని ఆలోచింపజేసింది.
Max Woosey

తన వంతుగా వారి కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. ఎలాంటి సౌకర్యాలు లేని ఓ సాధారణ టెంట్‌లో రెండేళ్ల పాటు నిద్రింది... దాని ద్వారా ఫండ్‌ రైజింగ్‌ స్టార్‌ చేశాడు. ఆ పిల్లాడి పేరు మ్యాక్స్‌ వూసీ... ఆ పిల్లాడి స్ఫూర్తిదాయక ఆలోచనను అందరూ మెచ్చుకోవాల్సిందే. 

Max Woosey

చ‌ద‌వండి: అదానీకి జాక్‌పాట్‌ ఇయర్‌... ఆయన ఆస్తి ఎంత పెరిగిందో తెలుసా.. ముకేశ్‌ డౌన్‌
మనం ఏదైనా పర్యాటక ప్రదేశానికి వెళ్తే... అక్కడ క్యాంప్‌ఫైర్, టెంట్స్‌ ఉంటే... ఒకట్రెండు రోజులు ఆ టెంట్లలో ఉండేందుకు ఇష్టపడతాం. కానీ, రోజూ అందులోనే పడుకోవాలంటే అస్సలు ఇష్టపడం. ఎలాంటి సదుపాయాలూ లేకుండా టెంట్లలో నిద్రపోవడం మాటలు కాదు. అలాంటి సాహసాన్ని బ్రిటన్‌కు చెందిన మ్యాక్స్‌ చేసి చూపించాడు. అనారోగ్యంతో ఉండే రోగుల కోసం ఓ కేర్‌ హోమ్‌ నిర్మించాలనే సదుద్దేశంతో ఆ పిల్లాడు ఇది చేపట్టాడు. ఇది ప్రజలకు బాగా నచ్చి...   రెండేళ్లలో రూ.7 కోట్ల విరాళాలు అందజేశారు.

చ‌ద‌వండి: జనవరి 2, 3 తేదీల్లో గ్లోబల్‌ ఓయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
దీవన్‌ కి చెందిన మాక్స్‌ వూసీ... 2020 మార్చిలో ఈ క్యాంపెయిన్‌ ప్రారంభించే సమాయానికి అతిడికి పదేళ్లే. లండన్‌ జూ, డౌనింగ్‌ స్ట్రీట్, ట్వికెన్‌ హామ్‌ రగ్బీ స్టేడియం వంటి హైప్రొఫైల్‌ లొకేషన్లలో ఆ పిల్లాడు రాత్రి వేళ టెంట్లలో పడుకున్నాడు. అసలే అక్కడ చలి ఎక్కువ. రాత్రిళ్లు మైనస్‌ డిగ్రీల్లో ఉంటుంది. అలాంటి చోట ఇలాంటి సాహసం చేశాడు. తాను అనుకున్న మేరకు విరాళాలు రాగానే క్యాంపెయిన్‌ ముగించాలని ముందుగానే నిర్ణయించుకున్నాడు. అలా వచ్చిన రూ.7కోట్లతో రోగులకు ఆరోగ్య కేంద్రంతో పాటు 20 మంది నర్సులకు ఏటా శాలరీలు కూడా ఇవ్వొచ్చని చెబుతున్నాడు ఆ పిల్లాడు. 

చ‌ద‌వండి: ఐదువేల స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
తన క్యాంపెయిన్‌ లో భాగంగా మ్యాక్స్‌... చాలా అవుట్‌డోర్‌ టెంట్లలో పడుకున్నాడు. అక్కడ ఏ బెడ్డూ ఉండదు. అయినా అలాగే నిద్రించేవాడు. ఓ మంచి పనికోసం ఇదంతా చెయ్యడంతో అతనికి బ్రిటీష్‌ ఎంపైర్‌ మెడల్‌ దక్కింది. మాక్స్‌ ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు అతని కుటుంబం అస్సలు ఒప్పుకోలేదు. చాలాసార్లు ఇంటికి రప్పించేందుకు ప్రయత్నించారు. ఆరు నెలల తర్వాత పిల్లాడి ఆరోగ్యం కోసం క్యాంపెయిన్‌ ఆపేయమని ఒత్తిడి చేశారు. కానీ మ్యాక్స్‌ పట్టుదలతో ప్రయత్నించి ఆ పిల్లాడు అనుకున్నది సాధించాడు. పదేళ్ల వయసులో సమాజం గురించి ఆలోచించడం, పట్టుదలతో ప్రయత్నించడం గొప్ప విషయం అని అంతా మెచ్చుకుంటున్నారు.

Published date : 31 Dec 2022 03:06PM

Photo Stories