Grandhi Anil Success Story: కష్టాల కడలిలో ఈదుతూ.... సూపర్ సీఈఓగా ఎదిగిన అనిల్ ప్రస్థానం తెలుసా..
ట్యాక్స్ ప్లానింగ్ అండ్ సీఈఓ సేవలపై వ్యాపార యజమానులకు అందించిన వినూత్న సేవలను గుర్తించి 2022లో టాప్ 20 సీఈఓలలో ఒకరుగా సీఈఓ పబ్లికేషన్ ఆయనను గుర్తించింది. ఆయనే రాజాం పట్టణానికి చెందిన గ్రంధి అనిల్. బాల్యంలోని ఆయన చదువు నుంచి అంతర్జాతీయ గుర్తింపు పొందినంత వరకు ఆయన ప్రస్థానం ఆయన మాటల్లోనే..
చదవండి: అమూల్ అంటే అర్థం తెలుసా... దీని చరిత్ర తప్పక తెలుసుకోవాల్సిందే
రాజాంలో ప్రాథమిక విద్య చదువుతున్న నేను నాలుగో తరగతి నుంచే వ్యాపారంపై మక్కువ పెంచుకున్నా. రాజాంలోని భారతీయ విద్యాభవన్ లో 5వ తరగతి, 6వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో, 7 నుంచి 10వ తరగతి వరకు ఏజేసీ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకున్నా. ఇంటర్‌లో ఎంపీసీ చదివి ఇంజనీర్ కావాలని స్నేహితులు, కుటుంబ సభ్యులు సలహాలు ఇచ్చినప్పటికీ డాక్టర్ కావాలనే బలమైన కోరికతో బైపీసీలో జాయిన్ అయ్యా. ఇంటర్ మొదటి సంవత్సరం గరివిడి శ్రీరామ్ జూనియర్ కళాశాలలో, ద్వితీయ సంవత్సరం దాకమర్రిలోని రఘు కళాశాలలో పూర్తిచేశా.
చదవండి: ఎనిమిదో తరగతికే పెళ్లి... ఇప్పుడు ఆ యువతి ఏం సాధించిందో తెలుసా....
ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించా.. ఆర్థిక ఇబ్బందులతో ఎంబీబీఎస్ చదవలేకపోయా. అదే సమయంలో కుటుంబాన్ని చూసుకుంటూ చదువు కొనసాగించాలని నిశ్చయించుకున్నా. దీంతో జీసీఎస్‌ఆర్ కళాశాలలో బీకాం డిగ్రీలో చేరా. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా ఎదురీది డిగ్రీ పూర్తిచేసి బీకాంలో సిల్వర్ మెడల్ సాధించా.
ఓ వైపు డిగ్రీ చదువుతుండగానే మరో వైపు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తుండేవాడిని. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఒడిదొడుకుల మధ్య డిగ్రీ పూర్తిచేశా. తరువాత ఎంబీఏ చేయాలనుకున్నప్పటికీ అధ్యాపకుల సలహాతో సీఏ చేశాను. 2008లో ఐసీఏఐ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్) చెన్నై క్యాంపస్ నిర్వహించిన ఇంటర్వ్యూలో మంచి జీతంతో ఎంపికయ్యా.
చదవండి: డిగ్రీ కూడా లేని మేధావి... రామానుజన్ జీవిత విశేషాలు తెలుసా
తరువాత శివ గ్రూపులో ఫైనాన్స్ కంట్రోలర్‌గా మూడేళ్లు పనిచేశా. తరువాత తారస్ క్వస్ట్ కంపెనీలో ఫైనాన్స్ హెడ్‌గా ఉద్యోగం, యూఎస్‌ఏకు చెందిన సన్ ఎడిషన్ ఫైనాన్స్ కంట్రోలర్‌గా రెండేళ్లు పనిచేశాను. అక్కడ నా ప్రతిభ ఆధారంగా యూఎస్ హెడ్ ఆఫీస్ నుంచి పిలుపురావడంతో వెళ్లి ట్రెజరీ ఆపరేషన్స్ దిగ్విజయంగా పూర్తిచేయగలిగాను. ఆ తరువాత అమెజాన్ లో ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం లభించింది. దీంతో నా స్కిల్స్ మరింత డెవలప్ చేసుకోగలిగాను. తరువాత స్టార్‌బక్స్ కంపెనీలో చేరి ఖాళీ సమయంలో ట్యాక్స్ బిజినెస్ డెవలప్ చేసుకోగలిగాను.
కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న కంపెనీలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పించింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని బిజినెస్ యజమానులకు హెల్ప్ చేయగలిగాను. దాంతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ హెల్పింగ్ నేచరే అమెరికాలో గుర్తింపు తీసుకువచ్చింది. ఆ తరువాత ఏజీ ఫిన్ టాక్స్ అనే ట్యాక్స్ ప్లానింగ్ సర్వీస్ ప్రారంభించాను. ట్యాక్స్ ప్లానింగ్ అండ్ సీఈఓ సేవలపై వ్యాపార యజమానులకు అందించిన వినూత్న సేవలను గుర్తించిన సీఈఓ పబ్లికేషన్ 2022లో టాప్ 20 సీఈఓలలో ఒకరిగా గుర్తించిందని గ్రంధి అనిల్ తన ప్రస్థానం గురించి వివరిస్తారు.