Skip to main content

National Mathematics Day: డిగ్రీ కూడా లేని మేధావి... రామానుజన్‌ జీవిత విశేషాలు తెలుసా

పువ్వు పుట్టగానే ... పరిమళిస్తుందన్నట్లు, 13 సంవత్సరాలకే గణితంలో అత్యంత ప్రతిభ చూపిన రామానుజం ఆ శాస్త్రంలో అతిక్లిష్టమైన బెర్లోలీ నెంబర్లు, యూలర్‌ స్థిరాంకాలపై సొంతంగా పరిశోధనలు చేసాడు. తర్వాత రోజుల్లో ఆ ప్రతిభకు ఫలితంగా లభించిన స్కాలర్‌షిప్‌తో కుంభకోణంలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్‌లో చేరాడు.
ramanujan

గణితశాస్త్ర పరిశోధనల్లో మునిగిపోయిన రామానుజం ఇంటర్మీడియట్‌ ఫైనల్‌ పరీక్షల్లో మిగతా సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారు. దీంతో డిగ్రీ చదవలేకపోయారాయన. 33 ఏళ్లే జీవించిన ఆయన గణితంలో ఎవరికీ సాధ్యంకాని సూత్రాలను సైతం నిరూపించారు. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గణిత మేధావుల్లో ఒకరిగా పేరు సంపాదించిన భారతీయుడు రామానుజన్‌. డిసెంబర్‌ 22 ఆయన  జయంతిని పురస్కరించుకుని 2012 నుంచి ‘నేషనల్‌ మ్యాథమెటిక్స్‌ డే’ గా నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలు మీకోసం...   
రామానుజన్‌ పూర్తిపేరు శ్రీనివాస రామానుజన్‌ అయ్యంగార్‌. ఆయన 1887 డిసెంబర్‌ 22న తమిళనాడులోని ఈరోడ్‌లో తమిళ బ్రాహ్మణ అయ్యంగార్‌ కుటుంబంలో జన్మించారు. 1903లో కుంభకోణంలోని ప్రభుత్వ కళాశాలలో చదివారు. కళాశాలలో గణితం తప్ప ఇతర సబ్జెక్టులపై దృష్టి పెట్టకపోవడం వల్ల పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యారు. దీంతో డిగ్రీ వరకు కూడా వెళ్లలేకపోయారు.

చ‌ద‌వండి: రెండు వారాలే టైం... ఎస్ఎస్‌సీ నోటిఫికేష‌న్... వివ‌రాలు
చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను ప్రదర్శించి ఆయిలర్‌ నియమాలు, త్రికోణమితికి చెందిన సమస్యలను సాధించారు.
జీఎస్‌ కార్‌ రచించిన సినాప్సిస్‌ ఆఫ్‌ ప్యూర్‌ మ్యాథ్‌మెటిక్స్‌ అనే పుస్తకం శ్రీనివాస రామానుజన్‌ లోని ప్రతిభను బయటకు తీసుకొచ్చింది. ఆ పుస్తకంలో ఆల్‌జీబ్రా, అనలిటికల్‌ జామెట్రీ లాంటి విషయాలకు సంబంధించిన 6165 సిద్ధాంతాలను నిరూపించడానికి పెద్ద పెద్ద ప్రొఫెసర్‌లు సైతం నానా తంటాలు పడేవారు. అయితే వారు అర్థం చేసుకోలేకపోయిన సూత్రాలకు రామానుజన్‌ ఎలాంటి పుస్తకాల సహాయం లేకుండా అలవోకగా పరిష్కరించేవాడు.
1909లో జానకి అమ్మాళ్‌ను రామానుజన్‌ వివాహం చేసుకున్నారు. వివాహం నాటికి రామానుజం వయసు 22.. అమ్మాళ్‌కి 11 ఏళ్లు.

చ‌ద‌వండి: ఎస్ఎస్‌సీ ఎగ్జామ్ కు ఈ అంశాల్లో నుంచే ప్ర‌శ్న‌లు...
మ్యాజిక్‌ స్క్వేర్స్, కంటిన్యూడ్‌ ఫ్రాక్షన్స్‌, ప్రధాన సంఖ్యలు, పార్టిషన్‌ ఆఫ్‌ నంబర్స్, ఎలిప్టిక్‌ ఇంటిగ్రల్స్‌ లాంటి విషయాలపై రామానుజన్‌ పరిశోధనలు కొనసాగించారు. 1913లో రామానుజన్‌ కనుగొన్న 120 పరిశోధన సిద్ధాంతాలను ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త డాక్టర్‌ వాకర్‌ కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్‌ గాడ్‌ ఫ్రెహెరాల్డ్‌ హార్టీకి పంపాడు.
మహా మేధావులకు మాత్రమే సాధ్యమయ్యే పరిశోధన ఫలితాలను చూసిన హార్టీ రామానుజన్‌ ను కేంబ్రిడ్జి యూనివర్సిటీకి ఆహ్వానించారు. 1914 మార్చిలో లండన్‌కు వెళ్లిన రామానుజన్‌ అక్కడ నిరంతరం గణితంపై పరిశోధనలు చేసి కొత్త సిద్ధాంతాలను కనిపెట్టారు. ఫెలో ఆఫ్‌ ద ట్రినిటీ కాలేజి గౌరవం పొందిన తొలి భారతీయుడిగానూ, ఫెలో ఆఫ్‌ ద రాయల్‌ సొసైటీ గౌరవం పొందిన రెండవ భారతీయుడిగానూ ఆయన చరిత్రకెక్కారు. బ్రిటన్‌ నుంచి 1919 మార్చిలో భారతదేశానికి తిరిగి వచ్చారు.

చ‌ద‌వండి: 19 ఏళ్ల‌కే ఫిఫా ఎంట్రీ... ఎంబాపె గురించి మీకు ఈ విషయాలు తెలుసా
మనదేశ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన చెప్పిన రామానుజన్‌ అనారోగ్యంతో తన 33 వ ఏట కన్నుమూశారు. బ్రిటన్‌ లో ఉన్నప్పుడు ఆరోగ్యం గురించి ఏమాత్రం లెక్కచేయకుండా గణిత పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన ఇండియాకు వచ్చిన ఏడాది తర్వాత 1920 ఏప్రిల్‌ 26న అస్తమించారు. జీవిత చరమాంకంలో రామానుజన్‌ రాసిన మ్యాజిక్‌ స్క్వేర్, ప్యూర్‌ మాథ్స్‌కు చెందిన నెంబర్‌ థియరీ, మాక్‌ తీటా ఫంక్షన్స్‌ చాలా ప్రసిద్ధి పొందాయి.
వీటిని ఆధారంగా చేసుకుని కనుగొన్న స్వింగ్‌ థియరీ, క్యాన్సర్‌పై పరిశోధనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. గణితశాస్త్రంలో రామానుజన్‌ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించింది. 
శ్రీనివాస రామానుజన్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘ది మ్యాన్‌ హూ నో ఇన్ఫినిటీ’ సినిమా 2015లో విడుదలైంది. రాబర్ట్‌ క్నైగెల్‌ రామానుజన్‌ బయోగ్రఫీని తెరకెక్కించారు. ప్రఖ్యాత గణిత సిద్ధాంతాలను ప్రతిపాదించే క్రమంలో రామానుజన్‌ కు ఎదురైన సవాళ్లు, ఆయన జీవిత విశేషాలను ఈ సినిమాలో చూపించారు.
రామానుజన్‌ కు గణితంలో ఎనలేని ప్రతిభ ఉంది. ఆయన సొంతంగా కొన్ని సిద్ధాంతాలను కనుగొన్నారు. స్వతంత్రంగా 3900 ఫలితాలను సంకలనం చేశాడు.
ప్రొఫెసర్‌ ఎఏ హార్డీ ఒకసారి రామానుజన్‌ని పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడుతూ తాను 1729 నంబర్‌ ఉన్న ట్యాక్సీలో వచ్చినట్లు చెప్పారు. అది సాధారణ నంబర్‌గా అనిపించిందన్నారు. దీనికి రామానుజన్‌ స్పందిస్తూ, ఇది మామూలు సంఖ్య కాదని, దీనికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పారు. రెండు సంఖ్యల ఘనాల మొత్తాన్ని రెండు వేర్వేరు విధాలుగా చెప్పగలిగే సంఖ్యల్లో ఇది అన్నిటికంటే చిన్నదని రామానుజన్ వివరించారు. ఇది విన్న హార్డీ ఆశ్చర్యపోయారు. అనంతరం 1729 నంబర్‌ను ‘హార్డీరామానుజన్‌ నంబర్‌’గా వ్యవహరిస్తున్నారు.

Published date : 22 Dec 2022 02:11PM

Photo Stories