Skip to main content

SSC CHSL Jobs Details and Syllabus: ఇంటర్‌తోనే సెంట్రల్‌ జాబ్‌.. ప్రారంభంలోనే 40వేల జీతం ... ఇలా సిద్ధమవ్వండి

ప్రణాళికతో చదువు సాగిస్తే ఇంటర్‌తోనే లైఫ్‌ సెటిల్‌ చేసుకోవచ్చు. కేవలం 18 ఏళ్లకే కేంద్ర ప్రభుత్వ కొలువు కొట్టొచ్చు. ప్రారంభ వేతనమే రూ.40 వేలు. దీనికి కావాల్సిందిల్లా కేవలం ఓ ప్రణాళికతో చదవడమే. జాబ్‌కి అవసరమైన సిలబస్‌పై అవగాహన ఉంటే చాలు. ఖాళీల వివరాలు ఇలా...

స్టాఫ్‌ సెలక్షన్‌  కమిషన్‌ కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ (ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌)2022  ప్రకటన వెలువడింది. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే కేంద్ర శాఖల్లో..  ఎల్‌డీసీ/ జూనియర్‌ సెక్రటేరియట్, అసిస్టెంట్‌/ డేటా ఎంట్రీ ఆపరేటర్‌  హోదాతో విధులు నిర్వర్తించవచ్చు. బ్యాంకులు, రైల్వే, ఇతర పోటీ పరీక్షలు రాస్తున్నవారు సీహెచ్‌ఎస్‌ఎల్‌ను ఎదుర్కోవచ్చు. కొద్ది మార్పులు తప్ప సిలబస్‌ ఇంచుమించు ఒకేలా ఉండటమే అందుకు కారణం. మొత్తం 4500 ఖాళీలు ఉన్నాయి. శాఖలు/ విభాగాలవారీ పోస్టుల వివరాలు తర్వాత ప్రకటిస్తారు. రెండు దశల్లో నిర్వహించే పరీక్షలు, స్కిల్‌/టైప్‌ టెస్టులతో నియామకాలు చేపడతారు. 

చ‌ద‌వండి: మరో రెండు వారాలే సమయముంది... అప్లై చేశారా..?

లోయర్‌ డివిజన్‌  క్లర్క్‌ (ఎల్‌డీసీ), జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (జేఎస్‌ఏ) ఉద్యోగాలకు లెవెల్‌ 2 మూలవేతనం రూ.19,900 అందుతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులకు లెవెల్‌ 4 రూ.25,500 మూలవేతనం దక్కుతుంది. కొన్ని విభాగాలకు చెందిన డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులకు మాత్రం లెవెల్‌ 5 మూలవేతనం రూ.29,200 చెల్లిస్తారు. డీఏ, హెచ్‌ఆర్‌ఎ, ఇతర అలవెన్సులు మూలవేతనానికి అదనం. లెవెల్‌2 ఉద్యోగాలకు సుమారు రూ.35 వేలు, లెవెల్‌4కు ఇంచుమించు రూ.45 వేలు, లెవెల్‌5 కొలువైతే రూ.55 వేల వేతనం పొందవచ్చు.
పరీక్ష ఇలా...

చ‌ద‌వండి: విద్యార్థులకు రూ.686 కోట్ల విలువ చేసే ట్యాబ్‌ల పంపిణీ : సీఎం జగన్‌


టైర్‌1: పరీక్షను 200 మార్కులకు నిర్వహిస్తారు. వంద ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి గంట. ప్రతి ప్రశ్నకూ 2 మార్కులు. తప్పు జవాబుకు అర మార్కు తగ్గిస్తారు. పరీక్షలో 4 భాగాలుంటాయి. ఇంగ్లిష్‌ భాషలో ప్రాథమిక స్థాయిలో 25, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ 25, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (బేసిక్‌ అరిథ్‌మెటిక్‌ స్కిల్‌) 25, జనరల్‌ అవేర్‌నెస్‌ 25 ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్‌ విభాగం తప్ప మిగిలిన ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి.  
టైర్‌2: ఈ పరీక్షను మూడు సెషన్లలో నిర్వహిస్తారు. మొదటి సెషన్‌లో 3 సెక్షన్లు ఉంటాయి. అన్ని సెక్షన్లలోనూ వ్రాంగ్ ఆన్స‌ర్‌కు ఒక మార్కు తగ్గిస్తారు. 

సెక్షన్‌ 1లో.. మ్యాథమెటికల్‌ ఎబిలిటీస్, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్ ఒక్కో విభాగంలో 30 మొత్తం 60 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు. 180 మార్కుల ప్రశ్నపత్రాన్ని గంటలో పూర్తి చేయాలి.  

సెక్షన్‌ 2లో.. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌  40, జనరల్‌ అవేర్‌నెస్‌ 20 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 3 చొప్పున 180 మార్కులకు ఈ ప్రశ్నపత్రం ఉంటుంది. గంట వ్యవధిలో పూర్తి చేయాలి.

సెక్షన్‌ 3లో.. కంప్యూటర్‌ పరిజ్ఞానంపై 15 ప్రశ్నలు 45 మార్కులకు ఉంటాయి. వ్యవధి 15 నిమిషాలు. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు. సెక్షన్‌  3 రెండో సెషన్‌లో.. స్కిల్‌/ టైప్‌ టెస్టు నిర్వహిస్తారు. 

డేటా ఎంట్రీ పోస్టులకు 15 నిమిషాల వ్యవధిలో స్కిల్‌ టెస్టు ఉంటుంది. ఎల్‌డీసీ/జేఎస్‌ఏ పోస్టులకు 10 నిమిషాల వ్యవధిలో టైప్‌ టెస్టు నిర్వహిస్తారు. డేటా ఎంట్రీ పోస్టులకు కంప్యూటర్‌పై 15 నిమిషాలకు 2000 – 2200 కీ డిప్రిషన్స్‌ ఇవ్వాలి. ఏదైనా అంశంలో ముద్రించిన సమాచార పత్రం ఇచ్చి దాన్ని కంప్యూటర్‌లో పొందుపర్చమంటారు. టైప్‌ టెస్టులో భాగంగా ఇంగ్లిష్‌ లేదా హిందీ ఎంచుకోవచ్చు. ఆంగ్లం అయితే నిమిషానికి 35, హిందీ 30 పదాల చొప్పున టైప్‌ చేయాలి. పది నిమిషాల వ్యవధితో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆంగ్లంలో అయితే 1750, హిందీలో 1500 కీ డిప్రిష‌న్స్ ఇవ్వగలగాలి.  

టైర్‌ 1లో అర్హత సాధిస్తేనే టైర్‌ 2కి అనుమతిస్తారు. ఈ రెండు దశల్లోనూ అన్‌  రిజర్వ్‌డ్‌ అభ్యర్థులు 30, ఓబీసీ, ఈబీసీలు 25, మిగిలిన విభాగాలవారు 20 శాతం చొప్పున ప్రతి సెక్షన్‌ లోనూ మార్కులు పొందితేనే అర్హులవుతారు. కంప్యూటర్‌ అవేర్‌నెస్, స్కిల్‌/ టైప్‌ టెస్టులో అర్హత సాధిస్తే సరిపోతుంది. ఈ మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. తుది నియామకాలు టైర్‌ 2 మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం ఉంటాయి.

Published date : 21 Dec 2022 05:40PM

Photo Stories