SSC 1600 Jobs Notification 2023 : ఇంటర్ అర్హతతోనే.. 1600 ఉద్యోగాలకు ఎస్ఎస్‌సీ నోటిఫికేషన్.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఈమేరకు SSC కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్ జారీ అయింది.
పోస్టుల వివరాలు ఇవే..
మొత్తం ఖాళీలు: 1,600
☛ లోయర్ డివిజన్ క్లర్క్(ఎల్డీసీ)
☛ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
☛ డేటా ఎంట్రీ ఆపరేటర్(డీఈవో)
☛ డేటా ఎంట్రీ ఆపరేటర్(గ్రేడ్-ఎ)
అర్హతలు ఇవే :
ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ఓపెన్ స్కూల్ ద్వారా చదివినవారూ
దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాలో డేటా ఎంట్రీ పోస్టులకు ఇంటర్ లో సైన్స్ గ్రూప్ తో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి వుండాలి.
వయస్సు : 01-08-2023 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.
చదవండి: SSC Exam Syllabus
ఎంపిక విధానం ఇలా :
టైర్-1, టైర్-2 పరీక్షల మార్కుల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు వారు దరఖాస్తు చేసుకున్న పోస్టును బట్టి మూడో దశలో కంప్యూటర్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ధ్రువపత్రాల పరిశీలన, వైద్య
పరీక్షల అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
చదవండి: SSC Exam Guidance
➤ దరఖాస్తు ఫీజు : 100/- (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించనక్కర్లేదు.)
➤ దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానం ద్వారా
➤ దరఖాస్తుకు చివరి తేదీ : జూన్ 8, 2023
➤ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ : జూన్ 10, 2023.
చదవండి: SSC పరీక్షల స్టడీ మెటీరియల్
పరీక్ష తేదీలు ఇవే :
టైర్-1(కంప్యూటర్ ఆధారిత పరీక్ష): ఆగస్టులో
టైర్-2 (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) నిర్వహణ తేదీలు: తర్వాత ప్రకటిస్తారు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : https://ssc.nic.in/
1,600 ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..