Skip to main content

SSC Exam Syllabus and Pattern:ఇవి చదివేస్తే... ఎస్‌ఎస్‌సీ జాబ్‌ సొంతమైనట్లే...!

ఇంటర్‌ తోనే ప్రభుత్వ కొలువు కొట్టాలనుకునే అభ్యర్థులకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ తాజా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ పరీక్షకు సంబంధించి ఈ విభాగాల్లోనే ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వీటిపై పట్టు సాధిస్తే ఉద్యోగాన్ని ఈజీగా కొట్టొచ్చు.
ssc

జనరల్‌ ఇంగ్లిష్‌...
అభ్యర్థి ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరిశీలిస్తారు. ఇంగ్లిష్‌ ఎలా అర్థం చేసుకుంటున్నారో గమనిస్తారు. ఖాళీలు పూరించడం, వాక్యంలో తప్పును గుర్తించడం, సమానార్థాలు, వ్యతిరేక పదాలు, తప్పుగా ఉన్న పదాన్ని గుర్తించడం, జాతీయాలు, సామెతలు, ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలుగా మార్చడం, కాంప్రహెన్షన్‌ ... తదితర విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. ఎక్కువ మార్కులు పొందడానికి 8,9,10 తరగతుల ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలు బాగా చదువుకోవాలి. వీలైనన్ని నమూనా ప్రశ్నలు సాధన చేయాలి.

చ‌ద‌వండి: రెండు వారాలే టైం... ఎస్ఎస్‌సీ నోటిఫికేష‌న్... వివ‌రాలు

జనరల్‌ ఇంటలిజెన్స్‌....
ఈ విభాగంలో వెర్బల్, నాన్‌ వెర్బల్‌ ప్రశ్నలుంటాయి. సెమాంటిక్‌ ఎనాలజీ, సింబాలిక్‌ ఆపరేషన్స్‌, నంబర్‌ ఎనాలజీ, ట్రెండ్స్, ఫిగర్‌ ఎనాలజీ, వెన్‌  డయాగ్రమ్స్, నంబర్‌ క్లాసిఫికేషన్, సిరీస్, కోడింగ్‌ – డీకోడింగ్, వర్డ్‌ బిల్డింగ్‌... తదితర విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. గణితంలోని ప్రాథమికాంశాలపై పట్టు పెంచుకుని, వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయడం ద్వారా తక్కువ సమయంలో జవాబు గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. 

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌....
ఈ విభాగంలో నంబర్‌ సిస్టమ్, ఫండమెంటల్‌ అర్త్‌మెటికల్‌ ఆపరేషన్స్‌, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, త్రికోణమితి, స్టాటిస్టికల్‌ చార్ట్స్‌ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. అర్త్‌మెటిక్‌ ఆపరేషన్స్‌లో భాగంగా.. శాతాలు, నిష్పత్తి, సరాసరి, చక్రవడ్డీ, బారువడ్డీ, లాభనష్టాలు, కాలం–పని, కాలం–దూరం, డిస్కౌంట్‌.. మొదలైన అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. ముఖ్యమైన సూత్రాలు, వాటిని ఉపయోగించే విధానం తెలుసుకుని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే ఎక్కువ స్కోరు సాధించొచ్చు.  

చ‌ద‌వండి: ఎస్ఎస్‌సీ ఎగ్జామ్ కు ఈ అంశాల్లో నుంచే ప్ర‌శ్న‌లు...

జనరల్‌ అవేర్‌నెస్‌...
డైలీ అప్‌డేటెడ్‌ అంశాలపై ప్రశ్నలుంటాయి. పర్యావరణాంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. కరెంట్‌ అఫైర్స్‌పై పట్టు సాధించాలి. అలాగే దేశ చరిత్ర, సంస్కృతి, భూగోళం, ఆర్థిక వ్యవహారాలు, పాలిటీ, సైన్స్‌ అంశాల నుంచీ ప్రశ్నలుంటాయి. 8,9,10 తరగతుల సైన్స్‌, సోషల్‌ పుస్తకాలు బాగా చదివి ముఖ్యమైన విషయాలు నోట్సు రాసుకోవాలి. నియామకాలు, అవార్డులు, విజేతలు, ఎన్నికలు, పుస్తకాలు–రచయితలు, ప్రముఖుల పర్యటనలు, మరణాలు.. ఈ అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. 

టైర్‌2: ఇందులోనూ టైర్‌1 అంశాల నుంచే ప్రశ్నలు వస్తాయి. అయితే వాటి స్థాయి ఎక్కువ. అందువల్ల లోతైన అధ్యయనం తప్పనిసరి. ఇందులో అదనంగా కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ చేర్చారు. కంప్యూటర్‌ ప్రాథమికాంశాలు, సాఫ్ట్‌వేర్, ఇంటర్నెట్, ఈ మెయిల్, నెట్‌ వర్కింగ్, సైబర్‌ సెక్యూరిటీ అంశాల్లో తేలికపాటి ప్రశ్నలే వస్తాయి. వీటికి ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతుల కంప్యూటర్ సైన్స్‌ పుస్తకాల్లో ముఖ్యాంశాలు చదివితేచాలు. కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీలో అర్హత సాధిస్తే సరిపోతుంది. 
ఇవీ మార్పులు....
సీహెచ్‌ఎస్‌ఎల్‌ పరీక్షలో గతంతో పోలిస్తే టైర్‌ 2లో మార్పులు చేశారు. లెటర్‌ రైటింగ్, ఎస్సే/అప్లికేషన్‌ రైటింగ్‌ స్థానంలో ఆబ్జెక్టివ్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష టైర్‌ 1కి కొనసాగింపుగా ఉంటుంది. అదనంగా కంప్యూటర్‌ అవేర్‌నెస్‌ విభాగాన్నీ చేర్చారు. ఇంగ్లిష్‌లో వ్యాసాలు/ఉత్తరాలు రాయడానికి ఇబ్బంది పడేవారికి ఈ మార్పు సానుకూలాంశమే. 

Published date : 21 Dec 2022 07:13PM

Photo Stories