Skip to main content

InterMediate: ఇంటర్‌ విద్యార్థులకోసం ఫ్రీగా 4 వేల వీడియోలు

ఇంటర్‌ పరీక్షలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే పలు కళాశాలలు సిలబస్‌ పూర్తి చేసి, మళ్లీ రివిజన్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇంటర్‌మీడియట్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫ్రీగా వీడియో కంటెంట్‌ను అందుబాటులో ఉంచింది.

దాదాపు 4 వేల వీడియోస్‌ను ఉచితంగా అందిస్తోంది. జనరల్‌ విద్యార్థులతో పాటు వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న వారికి ఉపయోగకరంగా వీడియోస్‌ను అందుబాటులో ఉంచినట్లు బోర్డు కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ తెలిపారు. అలాగే సైన్స్‌ విద్యార్థుల కోసం ప్రాక్టికల్‌కు సంబంధించి అనుమానాల నివృత్తితో పాటు పరీక్షల్లో పాటించాల్సిన మెలకువలు, స్ఫూర్తివంతమైన ప్రసంగాలను కూడా పొందుపరిచారు. ‘‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇంటర్‌మీడియట్‌ ఈ లర్నింగ్‌ తెలంగాణ’’ అనే యూ ట్యూబ్‌ చానల్‌లో వీడియోస్‌ అందుబాటులో ఉంచినట్లు మిట్టల్‌ తెలిపారు. ఎన్నిసార్లయినా ఫ్రీగా చూసుకోవచ్చని ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు.

Published date : 07 Feb 2023 06:48PM

Photo Stories