Skip to main content

SSC CHSL Notification: మరో రెండు వారాలే సమయముంది... అప్లై చేశారా..?

ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌లో 4500 పోస్టుల కోసం ఎస్‌ఎస్‌సీ నోటిఫికేష్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇంటర్‌ అర్హతతోనే కేంద్ర కొలువు సాధించొచ్చు. పోస్టులకు దరఖాస్తు ఆన్‌లైన్‌లోనే చేయాల్సి ఉంటుంది. జనవరి 4 చివరి తేదీ కావడంతో అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేయడం మంచింది.
ssc

సమయముందిలే తర్వాత చేద్దాం అనుకుంటే చివరిలో సర్వర్‌ సమస్యలు తలెత్తితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడే అప్లై చేసేయండి. ఉద్యోగార్హత వివరాలు ఇలా....

అర్హత: ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ఓపెన్ స్కూల్‌ ద్వారా చదివిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

వయసు: జనవరి 1, 2022 నాటికి 18–27 ఏళ్ల మధ్య ఉండాలి. జనవరి 2, 1995 నుంచి జనవరి 1, 2004 మధ్య పుట్టిన‌వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 4, 2023
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు చివరి తేదీ : జనవరి 5, 2023
ఆన్‌లైన్‌లో దరఖాస్తులో సవరణలకు : జనవరి 9, 10 తేదీల్లో చేసుకోవచ్చు

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.వంద. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు. 

టైర్‌1 పరీక్షలు: 2023 ఫిబ్రవరి/మార్చిల్లో నిర్వహిస్తారు. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, రాజమండ్రి, వరంగల్, కాకినాడ, కరీంనగర్, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, చీరాల.

టైర్‌2 పరీక్ష: వివరాలు తర్వాత ప్రకటిస్తారు.

Published date : 21 Dec 2022 03:16PM

Photo Stories