Skip to main content

Indian Air Force: అగ్నివీర్ వాయు పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోండి

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌.. అగ్నిపథ్‌ స్కీమ్‌లో భాగంగా అగ్నివీర్‌ వాయు నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
Indian Air Force Agniveer Vayu Recruitment 2024

చిల‌క‌ల‌పూడి(మ‌చిలీప‌ట్నం): అగ్నివీర్ ప‌థ‌కంలో భాగంగా ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని జిల్లా ఉపాధి క‌ల్ప‌నాధికారి డి.విక్ట‌ర్‌బాబు జూలై 5వ తేదీ ఓ ప్ర‌క‌ట‌నలో తెలిపారు.

ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌లో ప‌నిచేసేందుకు క‌నీసం 50 శాతం మార్కుల‌తో మ్యాథ‌మెటిక్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్ స‌బ్జెక్ట్‌ల‌తో ఇంట‌ర్మిడియెట్‌, మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా, త‌త్స‌మాన విద్యార్హ‌త‌లు క‌లిగి ఉండాల‌న్నారు. ఆన్‌లైన్‌లో జూలై 8 నుంచి 28వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశం ఉంది.

అర్హ‌త క‌లిగిన అవివాహిత పురుషుల‌తో పాటు మ‌హిళా అభ్య‌ర్థులు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఎంపిక ప్ర‌క్రియ మూడు విఇధాలుగా ఉంటుంది. అనంత‌రం ధ్రువీక‌ర‌ణ పత్రాల ప‌రిశీల‌న చేసి పోస్టింగ్ ఇస్తారు.

Agniveer Notification : పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

Published date : 06 Jul 2024 03:49PM

Photo Stories