Skip to main content

Agniveer Notification : అగ్నివీర్‌ వాయు నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల.. వీరే అర్హులు..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌.. అగ్నిపథ్‌ స్కీమ్‌లో భాగంగా అగ్నివీర్‌ వాయు (02/2025) నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Indian Airforce Agniveer Vayu Intake notification for unmarried men and women

»    అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ (10+2)/ఇంటర్మీడియట్‌ (సైన్స్‌ కాకుండా ఇతర సబ్జెక్టులు) లేదా మూడేళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమా (మెకానికల్‌/ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌/ఆటోమొబైల్‌/కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ)/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. నిర్దిష్ట శారీరక దారుఢ్యం/వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
»    వయసు: 03.07.2004 నుంచి 03.01.2008 మధ్య జన్మించి ఉండాలి.
»    ఎత్తు: పురుషులు 152.5 సెం.మీ., మహిళలు 152 సెం.మీ. ఉండాలి.
»    ఎంపిక విధానం: ఫేజ్‌–1 (ఆన్‌లైన్‌ రాతపరీక్ష), ఫేజ్‌–2 (ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్‌–1, అడాప్టబిలిటీ టెస్ట్‌–2), ఫేజ్‌–3 (మెడికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌), ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభ తేది: 08.07.2024
»    ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరి తేది: 28.07.2024.
»    ఆన్‌లైన్‌ పరీక్షలు ప్రారంభం: 18.10.2024.
»    వెబ్‌సైట్‌: https://agnipathvayu.cdac.in

SCCL Recruitment 2024: సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. 134 ఏళ్లలో ఇలా తొలిసారి..

Published date : 26 Jun 2024 01:25PM

Photo Stories