Indian Naval Academy : ఇండియన్ నేవల్ అకాడమీలో ఎస్‌ఎస్‌సీ పోస్టులు.. దరఖాస్తులకు వీరే అర్హులు..
» మొత్తం పోస్టుల సంఖ్య: 250.
» పోస్టుల వివరాలు: జనరల్ సర్వీస్(జీఎస్–ఎక్స్/హైడ్రో క్యాడర్)–56,పైలట్–24,నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్(ఎయిర్ క్రూ)–21, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్–20,లాజిస్టిక్స్–20,నావల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టరేట్ కేడర్–16, ఎడ్యుకేషన్–15, ఇంజనీరింగ్ బ్రాంచ్(జనరల్ సర్వీస్)–36, ఎలక్ట్రికల్ బ్రాంచ్(జనరల్ సర్వీస్)–42.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీకాం, బీఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక/వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
» ప్రారంభ వేతనం: నెలకు రూ.56,100, ఇతర అలవెన్సులు.
» ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు,ఇంటర్వ్యూ,డాక్యుమెంట్ వెరిఫికేషన్,మె డికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 29.09.2024.
» వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in