MakeMyTrip Report: గణనీయంగా పెరుగుతున్న.. విదేశాల్లో పర్యటించే భారతీయుల సంఖ్య
ఏటా రెండుసార్లు లేదా అంతకు మించి పర్యటిస్తున్న వారి సంఖ్య 32 శాతం పెరిగింది. ఇక అంతర్జాతీయంగా ప్రయాణాలకు సంబంధించి ఎక్కువగా సెర్చ్‌లు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ టాప్‌లో ఉన్నాయి. 2023 జూన్ నుంచి 2024 మే మధ్య కాలానికి సంబంధించి ట్రావెల్ బుకింగ్ ప్లాట్‌ఫాం మేక్‌మైట్రిప్ రూపొందించిన 'హౌ ఇండియా ట్రావెల్స్ ఎబ్రాడ్' నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
దీని ప్రకారం విదేశాలకు వెళ్లే భారతీయులకు యూఏఈ, థాయ్‌లాండ్, అమెరికా టాప్ గమ్యస్థానాలుగా ఉంటున్నాయి. ఇప్పుడిప్పుడే కజకిస్తాన్, అజర్‌బైజాన్, భూటాన్‌లపై కూడా ఆసక్తి పెరుగుతోంది.
Visa Free Entry: ఈ దేశానికి వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఇక వీసా అక్కర్లేదు
నివేదికలోని మరిన్ని విశేషాలు..
➣ టాప్ 10 వర్ధమాన గమ్యస్థానాలకు సంబంధించి సెర్చ్ చేయడం 70 శాతం పెరిగింది. అజర్‌బైజాన్‌లోని అల్మటీ, బకూ కోసం సెర్చ్‌లు వరుసగా 527 శాతం, 395 శాతం పెరిగాయి.
➣ విలాసవంతమైన ప్రయాణాలపై కూడా భారతీయుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇంటర్నేషనల్ సెగ్మెంట్‌లో బిజినెస్ తరగతి ఫ్లయిట్స్ కోసం చేసే సెర్చ్‌లు 10 శాతం పెరగడం ఇందుకు నిదర్శనం.
➣ సెర్చ్‌లలో 131 శాతం వృద్ధితో హాంకాంగ్ టాప్‌లో ఉంది. శ్రీలంక, జపాన్, సౌదీ అరేబియా, మలేషియా తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
➣ ఇంటర్నేషనల్ హోటల్ బుకింగ్స్‌లో దాదాపు సగం బుకింగ్స్ టారిఫ్ రోజుకు రూ.7,000 పైనే ఉంటున్నాయి. హోటళ్ల విషయంలో న్యూయార్క్ అత్యంత ఖరీదైన నగరంగా ఉంది. ఈ విషయంలో బడ్జెట్‌కు అనుకూలంగా ఉండే టాప్ గమ్యస్థానాల జాబితాలో దక్షిణాసియాలోని పోఖారా, పట్టాయా, కౌలాలంపూర్ మొదలైనవి ఉన్నాయి.
➣ సీజన్‌లతో పనిలేకుండా విదేశీ ప్రయాణాలకు సంబంధించి సెర్చ్‌ల పరిమాణం అన్ని కాలాల్లోనూ స్థిరంగా ఉంటోంది. డిసెంబర్‌లో మాత్రం అత్యధికంగా సెర్చ్‌లు నమోదవుతున్నాయి.
Electric Airliner: త్వరలో అందుబాటులోకి రానున్న విద్యుత్ విమానం..