Visa Free Entry: ఈ దేశానికి వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఇక వీసా అక్కర్లేదు
Sakshi Education
భారత పౌరులకు ఆరు నెలలపాటు వీసారహిత ప్రవేశాన్ని కల్పించాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది.
భారత్‌తో పాటు మరో 35 దేశాలకు ఈ సౌకర్యాన్ని కల్పించడానికి శ్రీలంక మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి వీసారహిత ప్రయాణం అందుబాటులోకి వస్తుందని పర్యాటక శాఖ సలహాదారు హరిన్ ఫెర్నాండో వెల్లడించారు.
జాబితాలోని దేశాలు ఇవే..
భారతదేశం, యుకే, చైనా, యూఎస్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, స్పెయిన్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, పోలాండ్, కజకస్తాన్, సౌదీ అరేబియా, యూఏఈ, నేపాల్, ఇండోనేషియా, రష్యా, థాయిలాండ్, మలేషియా, జపాన్, ఫ్రాన్స్, కెనడా, చెక్ రిపబ్లిక్, ఇటలీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, ఇజ్రాయెల్, బెలారస్, ఇరాన్, స్వీడన్, దక్షిణ కొరియా, కతార్, ఒమన్, బహ్రైన్ న్యూజిలాండ్ ఉన్నాయి.
Passport: అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో వెనకబడ్డ భారత్.. మొదటి స్థానంలో ఉన్న దేశం ఇదే!
Published date : 22 Aug 2024 01:22PM