Lord Hanuman: అమెరికాలో 90 అడుగుల ఎత్తయిన హనుమాన్ విగ్రహం
Sakshi Education
అమెరికా దేశంలోని టెక్సాస్ రాష్ట్రంలోని హోస్టన్ నగరంలో తాజాగా 90 అడుగుల ఎత్తయిన హనుమంతుని విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ భారీ విగ్రహం అమెరికాలోని మూడవ ఎత్తయిన విగ్రహంగా పేరు తెచ్చుకుంది. ఈ విగ్రహానికి ‘స్టాట్యూ ఆఫ్ యూనియన్’ అని పేరు పెట్టారు. టెక్సాస్‌లోని షుగర్ ల్యాండ్ ప్రాంతంలోని అష్టలక్ష్మి ఆలయ ప్రాంగణంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ప్రతిష్ఠాపన వెనుక చినజీయర్ స్వామి సూచనలు, సలహాలు ఉన్నాయి.
‘స్టాట్యూ ఆఫ్ యూనియన్’ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం ఈ విగ్రహం యునైటెడ్ స్టేట్స్‌లోని మూడవ అతి ఎత్తయిన విగ్రహం. అలాగే హనుమంతునికి సంబంధించిన 10 ఎత్తయిన విగ్రహాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా హెలికాప్టర్ నుంచి స్వామివారి విగ్రహంపై పూలవర్షం కురిపించారు. జై వీర హనుమాన్ అంటూ నగరంలోని అనేక ప్రాంతాలు మార్మోగాయి.
Published date : 21 Aug 2024 03:15PM