Akrit Jaswal Became World Youngest Surgeon: ఏడేళ్ల వయస్సులోనే అతిపిన్న సర్జన్‌గా రికార్డు, ఈ పిల్లాడి టాలెంట్‌కు షాక్ అవ్వాల్సిందే

సాధారణంగా చిన్న పిల్లలు ఐదారేళ్ల వయస్సులో ఏం చేస్తారు? సరదాగా ఆడుకుంటూ గడిపేస్తుంటారు. కానీ ఈ ప్లిలాడు మాత్రం ఏడేళ్ల వయసులో శస్త్రచికిత్స చేసి ప్రపంచంలోనే అతిపిన్న సర్జన్‌గా రికార్డుల్లో నిలిచాడు. తన అసాధారణ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఎవరీ పిల్లాడు? ఇతని టాలెంట్ ఏంటన్నది ఈ కథనంలో తెలుసుకుందాం.
హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన అక్రీత్ ప్రాణ్ జస్వాల్ చిన్నప్పటి నుంచే అసాధారణ ప్రతిభ కనబర్చేవాడు. 10 నెలల వయసులోనే నడవడం, మాట్లాడటం వంటివి చేసేవాడు. ఇక రెండేళ్లు వచ్చేసరికి చదవడం, రాయడం కూడా నేర్చుకున్నాడు. అక్రిత్ టాలెంట్‌ను గుర్తించిన తల్లిదండ్రులు ఆ దిశగా ప్రోత్సహించేవారు. ఇక 5ఏళ్ల వయసులో ఇంగ్లీష్ క్లాసిక్స్ చదవడం, సైన్స్, మ్యాథ్స్ వంటి సబ్జెక్ట్స్‌పై కూడా ఇంట్రెస్ట్ చూపించేవాడు.

ఇదిలా ఉంటే అతనికి ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు హిమాచల్ ప్రదేశ్‌లోని నూర్‌పూర్‌కు చెందిన అక్రిత్ ప్రాణ్ జస్వాల్ 8 ఏళ్ల బాలుడి కాలిన చేతులకు ఆపరేషన్ చేసి వార్తల్లో నిలిచాడు. అద్భుతమైన ఐక్యూతో కేవలం 12 సంవత్సరాల వయసులో చండీగడ్ విశ్విద్యాలయంలో చేరి దేశంలోనే అత్యంత పిన్నవయస్సు యూనివర్సిటీ స్టూడెంట్‌గా నిలిచాడు.

అక్రిత్ జస్వాల్ టాలెంట్‌తో ప్రపంచం దృష్టిన ఆకర్షించాడు. లెజెండరీ ఓప్రా విన్‌ఫ్రే హోస్ట్ చేసిన ప్రపంచ ప్రఖ్యాత టాక్ షోలో పాల్గొని అబ్బురపరిచాడు. చిన్నప్పటి నుంచి తన అసాధారణ టాలెంట్‌తో ఆశ్చర్యపరుస్తున్న అక్రిత్ ప్రస్తుతం ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్‌లో రసాయన శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని అభ్యసిస్తున్నాడు.