Skip to main content

TS Staff Nurse Notification: ఐదువేల స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణలో ఉద్యోగ నియామకాల్లో భాగంగా.. మరో భారీ నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. ఐదు వేల స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు శుక్రవారం నోటిఫికేషన్‌ ను జారీ చేసింది తెలంగాణ సర్కార్‌. మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా ఈ నియామకాలు చేపట్టనుంది.
Nurse

మొత్తం 5,204 స్టాఫ్‌ నర్సు పోస్టులను భర్తీ చేయనున్నారు. జనవరి 25వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. 
ఖాళీల వివరాలు....
డీఎంఈ, డీహెచ్‌ పరిధిలో 3,823 పోస్టులు, వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టులతో పాటు వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ఖాళీలకు బీఎస్సీ(నర్సింగ్‌) కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంఎన్‌జేఐవో ఆర్‌సీసీ 81, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్‌ విద్యా సంస్థల్లో 127, మహాత్మాజ్యోతిబాపూలే విద్యా సంస్థల్లో 197, తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ విద్యాసంస్థల్లో 74, తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌లో 124, తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ లో 13 పోస్టులు భర్తీ చేయనున్నారు. జనవరి 25 నుంచి ఫిభ్రవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.

Published date : 30 Dec 2022 06:18PM
PDF

Photo Stories