Skip to main content

Get together in OU: జనవరి 2, 3 తేదీల్లో గ్లోబల్‌ ఓయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని జనవరి 3, 4 తేదీల్లో నిర్వహించనున్నారు. ఓయూ క్యాంపస్‌ ఠాగూర్‌ ఆడిటోరియంలో జరిగే ఉస్మానియా గ్లోబల్‌ అలుమ్నీ మీట్‌23లో హాజరయ్యేందుకు ఇప్పటికే వెయ్యి మంది పూర్వ విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
OU

విశ్వవిద్యాలయం చరిత్రలో విభాగాల వారీగా పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. 
రెండు రోజుల పాటు సమ్మేళనం ఇలా.. 
గ్లోబల్‌ అలుమ్ని మీట్‌  జనవరి 3న మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయ అభివృద్ధి, ఇతర అంశాలపై విశిష్ట పూర్వ విద్యార్థులతో పలు బృందాలతో చర్చలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌లోని లాన్‌ లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండో రోజైన జనవరి 3వ తేదీ పూర్వ విద్యార్థులు ఆయా విభాగాలను సందర్శించి, అధ్యాపకులు, విద్యార్థులతో  కలిసి చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకోనున్నారు. తర్వాత వివిధ అంశాలపై ఉపన్యాసాలతో సమ్మేళనం ముగియనుంది.

Published date : 30 Dec 2022 03:48PM

Photo Stories