OU Students Protest : ఓయూలో కూడా ఫుడ్ పాయిజన్.. విద్యార్థులకు అస్వస్థత..
సాక్షి ఎడ్యుకేషన్: గత శుక్రవారం రాత్రి హాస్టల్ ఫుడ్ తిన్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల్లో ముగ్గురికి ఫుడ్ పాయిజన్‌తో ఆనారోగ్యం పాలయ్యారు. దీంతో పీజీ విద్యార్థులంతా కళాశాల గేటు వద్దనే దర్నాకు దిగారు. ఈ విషయంపై అధికారులు ముందుకొచ్చి స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారి వెంట మాడిన ఆహారం కలిగిన పాత్రను తెచ్చుకొని, అధికారులకు వారి ఆవేదన, హాస్టల్ ఇబ్బందులు తెలియజేశారు. దీంతో రోడ్డు వద్దనే రాస్తారోకో నిర్వహించారు విద్యార్థులు.
PG Spot Admissions : ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో పీజీ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు..
ఆహారం రుచి సరిగ్గాలేదని, ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికి యూనిర్సిటీ, హాస్టల్ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోవడం లేదని వ్యక్తం చేశారు. ఇటువంటి భోజనం ఎలా తినాలంటూ ఆవేదన చెందారు. భోజనం సరిగ్గా లేకుండా విద్యార్థులంతా ఎలా తింటారు, ఎలా చదువుతారని ప్రశ్నించారు విద్యార్థులు. తమకు న్యాయం చేయాలని, వసతి గృహంలో మెరుగైన భోజన సేవలు అందించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు పీజీ విద్యార్థులు.
ఇక ఎట్టకేలకు అధికారులు స్పందించి, విద్యార్థుల వద్దకు వచ్చి వారితో చర్చించారు. దీంతో వారి ధర్నాను విరమింపజేశారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)