IAS Success Story : తొలి ప్రయత్నంలోనే.. ఐఏఎస్ ఉద్యోగం సాధించా.. నా విజయానికి స్ఫూర్తి వీరే..
సరిగ్గా ఇదే కోవకు చెందిన వారే పూజారి గౌతమి ఐఏఎస్. ఈమె 2021 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారిణి. ఈమె మొదటి పరీక్షలోనే జాతీయ స్థాయిలో 317 ర్యాంక్ తెచ్చుకొని ఐఎఎస్ సాధించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు పూజారి గౌతమి. ఈమె మంచిర్యాలలో కలెక్టర్ గా ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు.
కుటుంబ నేపథ్యం :
నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. అమ్మ స్టాఫ్ నర్స్, నాన్న వ్యాపారవేత్త. ఐఐటీ నాగ్‌పూర్ నుంచి ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేషన్ చేశాను. చదువుల్లో బంగారు పతకం సాధించాను.
☛ Amrapali IAS Real Story : ఆమ్రపాలి.. ఈమె సక్సెస్ సీక్రెట్ ఇదే.. కుటుంబ నేపథ్యం మాత్రం..
నా పనే నాకు ఆదర్శం..
పత్రికలవాళ్లు నా భవిష్యత్ గురించి అడిగినప్పుడు ‘ఐఏఎస్ అవుతాను’ అని చెప్పాను. ఆ మాట నిజమైంది. తొలి ప్రయత్నంలోనే నా కల నిజం చేసుకున్నాను. నా విజయానికి స్ఫూర్తి అమ్మానాన్నలే. నా మీద నాకు నమ్మకం సన్నగిల్లిన దశలోనూ వాళ్లు నా పట్ల నమ్మకాన్ని కోల్పోలేదు. అందులోనూ అమ్మకు విశ్రాంతి అంటే తెలియదు. పనిలో తననే ఆదర్శంగా తీసుకుంటాను.
ఆమె ట్రైనింగ్ కోసం వచ్చిన యువ ఐఏఎస్ అధికారి. తన శిక్షణేదో తాను పూర్తిచేసుకుని వెళ్లిపోవచ్చు. కానీ మంచిర్యాల సహాయ కలెక్టర్ పూజారి గౌతమి అలా చేయలేదు. పాలన పాఠాలు నేర్పిన ప్రాంతానికి తనవంతుగా ఏదైనా చేయాలనుకున్నారు. ఉన్నతాధికారులు ఏ బాధ్యత అప్పగించినా తనదైన ముద్ర వేశారు. శిక్షణ చివరి అంకంలోనూ మెరుపు మెరిపించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని శివ్వారం అభయారణ్యంలో ఒక ట్రెక్కింగ్ స్పాట్ గుర్తించారు. దాన్ని అందంగా అభివృద్ధి చేశారు.
Uma Harathi: ఎన్నో ఓటములు చూసి గెలుపుగా మార్చుకున్నా.. సివిల్స్‌లో మూడో ర్యాంక్ సాధించానిలా..
ఫ్యామిలీతో సరదాగా గడపడానికి..
ట్రెక్కింగ్‌ను ఒక ప్రాజెక్ట్‌గా తీసుకోవాలనే నా ఆలోచన వెనుక ఓ కారణం ఉంది. మంచిర్యాల అంటే అందరికీ గుర్తుకొచ్చేది కవ్వాల్ టైగర్ రిజర్వ్ మాత్రమే. కానీ మన అటవీప్రాంతం అద్భుతాలకు నెలవు. ఆ అందాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలని అనిపించింది. అందులోనూ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో యువత పచ్చదనంలో సేదతీరాలని అనుకుంటున్నది. ప్రకృతి ఒడిలో వీకెండ్స్ ప్లాన్స్ చేసుకుంటున్నది. రెస్టారెంట్లు, సినిమాలు ఇప్పటికే బోర్ కొట్టేశాయి. అలాంటి వారిని ట్రెక్కింగ్ కచ్చితంగా ఆకట్టుకుంటుంది. మనశ్శాంతి కోసం, మార్పు కోసం ఫ్యామిలీతో సరదాగా గడపడానికి కూడా ఇక్కడికి రావచ్చు. వ్యాయామం చేసినట్టూ అవుతుంది. శివ్వారం, గొల్లవాగు, కవ్వాల్ తదితర ప్రాంతాలను సందర్శించి నప్పుడు.. అన్నిటిలోకి శివ్వారం బాగా నచ్చింది. తిరుగులేని వ్యూ ఉందిక్కడ. పైకి ఎక్కుతున్నకొద్దీ గోదావరి ప్రవాహ దృశ్యం అబ్బురంగా కనిపిస్తుంది. వ్యూ పాయింట్ దగ్గరి నుంచి చూస్తే అడవి అందాలు కట్టిపడేస్తాయి. నేను వెళ్లిన తొలిసారి శివ్వారంలోని చిన్న గుహల వరకు మాత్రమే తీసుకెళ్లారు. అది కూడా పదీ పదిహేను మీటర్ల ఎత్తు ఉంటుంది. అంతకుమించి వెళ్లడానికి లేదని చెప్పారు. నాకెందుకో అసంతృప్తిగా అనిపించింది. ఆ తరువాత నేను వ్యక్తిగత సిబ్బందితో కలిసి నాలుగైదుసార్లు వెళ్లాను.
☛ 22 ఏళ్లకే ఐఏఎస్‌కు ఎంపికై..రెండేళ్లకే ఉద్యోగానికి రాజీనామా..ఆ తర్వాత ఉచితంగా
కొద్దికొద్దిగా దూరం పెంచుకుంటూ..
అక్కడి నుంచి పైకి దారి తయారు చేసుకుంటూ.. కొద్దికొద్దిగా దూరం పెంచుకుంటూ పోయాను. అలా 2.2 కిలోమీటర్ల ట్రాక్ సిద్ధమైంది. అడ్డుగా వచ్చే చిన్నచిన్న రాళ్లను జరుపుకొంటూ ముందుకు సాగామే కానీ.. ఎక్కడా సహజత్వానికి విఘాతం కలిగించలేదు. ఒక్క గడ్డి మొక్కను కూడా ముట్టుకోలేదు. ఈ ట్రాక్ నుంచి అత్యున్నత శిఖరానికి చేరుకుంటే.. అక్కడి నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సుందిళ్ల బ్యారేజ్ బ్యాక్ వాటర్ వ్యూ కనిపిస్తుంది.
☛ Supraja,DSP : వీరిని లెక్కపెట్టకుండా చదివా..గ్రూప్-1 ఉద్యోగం కొట్టా..
అడవిలోకి వెళ్తున్నప్పుడు..
ఈ ట్రాక్ నుంచి సాహస యాత్రికులు అడవిలోకి వెళ్తున్నప్పుడు అక్కడి చెట్ల గురించి, వన్యప్రాణుల గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస కలుగుతుంది. అందుకు సైనరీస్ ఏర్పాటు చేశాం. మొసళ్లు, తాబేళ్లు, నెమళ్లు, గుడ్ల గూబలు, నీటి ఏనుగులు.. ఇలా రకరకాల జంతువుల గురించి వివరంగా చెప్పే బోర్డులు ఏర్పాటు చేశాం. నిర్మల్ చెక్క బొమ్మల తయారీకి వాడే పొనికి చెట్టుతో పాటు ఔషధ గుణాలున్న వివిధ వృక్షాలను పరిచయం చేశాం. బండరాళ్లకు బొమ్మలు వేయించాం. ‘నో మోర్ ప్లాస్టిక్’, ‘పుడమి తల్లిని, అడవి తల్లిని రక్షించాలి’ తదితర నినాదాలతో చిత్రాలు గీయించాం. శిక్షణలో భాగంగా.. ఎంపీడీవో, డీటీడీవో, మున్సిపల్ కమిషనర్ ఇలా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించాను.వివిధ ప్రాజెక్ట్‌లు విజయవంతంగా పూర్తి చేశాను. కానీ ఇది నా మనసుకు నచ్చిన పని. ఏదో ఒకటి సాధించాననే సంతృప్తితో మంచిర్యాల నుంచి వెళ్తున్నాను.
☛ Sirisha, SI : నన్ను ఆఫ్‌ట్రాల్ కానిస్టేబుల్ అన్న ఆ ఎస్పీతోనే..
Tags
- pujari gouthami ias success
- women Ias success stories
- gowthami ias success story in telugu
- Civil Services Success Stories
- Competitive Exams Success Stories
- gowthami ias success story
- UPSC
- UPSC jobs
- civils ranker
- UPSC Civil Exam
- Competitive Examinations
- Success Stories
- Union Public Service Commission
- Sakshi Education Success Stories
- motivational stories
- Inspiring Story