Skip to main content

Uma Harathi: ఎన్నో ఓటములు చూసి గెలుపుగా మార్చుకున్నా.. సివిల్స్‌లో మూడో ర్యాంక్ సాధించానిలా..

ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగు సార్లు యూపీఎస్సీ రాసినా నూకల ఉమాహారతికి ర్యాంకు రాలేదు. అయినా ఆమె నిరాశ చెందలేదు.
Uma Harathi,  Nookala Umaharathi's UPSC success  journey,

ఐదోసారి సైతం పట్టుదలతో ప్రయత్నించి ఏకంగా ఆలిండియా 3వ ర్యాంకు సాధించింది. ఆమె నారాయణపేట జిల్లా ఎస్పీ ఎన్‌.వెంకటేశ్వర్లు, శ్రీదేవిల కుమార్తె. 
హైదరాబాద్‌లో 2010లో 9.8 జీపీఏతో టెన్త్‌లో ఉత్తీర్ణత సాధించిన ఆమె 2012లో ఇంటర్‌ ఎంపీసీలో 955 మార్కులు సాధించారు. ఆపై 2017లో ఐఐటీ హైదరాబాద్‌ నుంచి సివిల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. 


ఎస్పీ ఎన్‌.వెంకటేశ్వర్లు సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందినవారు. యూపీఎస్సీ 2020లో నిర్వహించిన ఐఈఎస్‌లో ఆమె తమ్ముడు సాయి వికాస్‌ 12వ ర్యాంకు సాధించారు. రెండేళ్ల శిక్షణ అనంతరం ముంబైలోని సీపీడబ్ల్యూడీలో ఐఈఎస్‌గా విధుల్లో చేరిన వెంట‌నే అక్క ఉమాహారతి సివిల్స్‌లో ఆలిండియా 3వ ర్యాంకు సాధించి ఐఏఎస్ అయ్యింది. సివిల్స్‌లో ర్యాంకు సాధించిన ఉమాహారతి విష‌యాలు.. 

Business Woman Success Story : వీటి మీద పట్టు సాధించా.. రూ.1000 కోట్ల సంపాదించా..

గత సివిల్స్‌ పేపర్లూ చదివా.. 
సివిల్‌ ఇంజనీరింగ్‌ తర్వాత ఉద్యోగం బదులు సివిల్స్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఢిల్లీలోని వాజీరావు కోచింగ్‌ సెంటర్‌లో 2018–19లో శిక్షణ పొందినప్పటికీ అక్కడి కోచింగ్‌ నచ్చలేదు. ఇంటికొచ్చి ఆప్షనల్‌ సబ్జెక్టు అంథ్రోపాలజీతోపాటు కామన్‌ సబ్జెక్టులకు సంబంధించిన అంశాలపై ఇంటర్నెట్‌లో స్టడీ మెటీరియల్‌ సెర్చ్‌ చేశా. గత సివిల్‌ పేపర్లనూ చదివా. దేశ, అంతర్జాతీయ ఆంశాలు, సంఘటనలపై నిత్యం ఆంగ్ల దినపత్రికలు చదివేదాన్ని ఈ ఏడాదంతా నాన్న, అమ్మతో నారాయణపేటలో ఉండి చదివా. సివిల్స్‌ సాధించా. ఈసారి 2,500 ర్యాంకుల్లో ఏదో ఒకటి వస్తుందనుకున్నా. మూడో ర్యాంకు వస్తుందని ఊహించలేదు. 

 Success Story : చ‌దువులో ఫెయిల‌య్యా.. కానీ రూ.1,843 కోట్లు సంపాదించానిలా.. ఎలా అంటే..?

విఫలమైనా తమ్ముడు వెన్నుతట్టాడు..  
ఐపీఎస్‌ అధికారి అయిన మా నాన్న వెంకటేశ్వర్లు నుంచే స్ఫూర్తి పొందా. తమ్ముడు సాయి వికాస్‌ను ఆదర్శంగా తీసుకున్నా. గత ప్రయత్నాల్లో నాలుగుసార్లు విఫలమైనా బాధపడొద్దని తమ్ముడు అండగా నిలిచాడు. స్నేహితులు నిఖిల్, అంకితల సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడ్డాయి.

➤ నాడు ఎంద‌రో తిరస్కరించారు.. నేడు రూ.65,000 కోట్ల కంటే ఎక్కువ సంపాదించానిలా.. నా స‌క్సెస్ ప్లాన్ ఇదే..!

Published date : 29 Nov 2023 01:03PM

Photo Stories