Skip to main content

Business Woman Success Story : వీటి మీద పట్టు సాధించా.. రూ.1000 కోట్ల సంపాదించా..

కొందరికి వ్యాపారాలు వారసత్వ వస్తే.. మరి కొందరు జీరో నుంచి ప్రారంభించి కోట్ల‌కు అధిప‌తి అవుతారు. అలాగే ఉన్నత చదువులు చదివి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ.. చాలా మంది సొంతంగా ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో ప్రయత్నాలు చేస్తారు.. సక్సెస్ సాధిస్తారు.
 Devita Saraf business woman success story,  Self-Made Success , A Journey from Employee to Business Head

ఈ కోవకు చెందిన వారిలో ఒకరు దేవిత సరఫ్. ఈ నేప‌థ్యంలో దేవిత సరఫ్ స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం

24 సంవత్సరాల వయసులోనే..
1981 జూన్ 25న ముంబైలో జన్మించిన 'దేవిత సరఫ్' క్వీన్ మేరీ స్కూల్‌లో చదివింది, ఆ తరువాత హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్, యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బీఏ పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచే బిజినెస్ మీద పట్టు సాధించిన దేవిత చదువు పూర్తయిన తరువాత కేవలం 24 సంవత్సరాల వయసులోనే.. టీవీలను తయారు చేయడానికి ఒక కంపెనీని ప్రారంభించింది.

 Success Story : చ‌దువులో ఫెయిల‌య్యా.. కానీ రూ.1,843 కోట్లు సంపాదించానిలా.. ఎలా అంటే..?

కుటుంబ నేప‌థ్యం :
దేవిత సరఫ్ తండ్రి రాజ్‌కుమార్ సరఫ్.. జెనిత్ కంప్యూటర్స్ బిజినెస్ ప్రారంభించారు. తండ్రి వ్యాపారంలో చిన్నప్పటి నుంచి సహాయం చేయడం అలవాటు చేసుకున్న దేవితా.. టెక్నాలజీ వ్యాపారంలో కొంత నైపుణ్యం సంపాదించింది. అంతే కాకుండా ఈమె తన అన్నయ్యతో కలిసి ఆఫీసులు, ఫ్యాక్టరీలు, ఇతర సమావేశాలకు వెళ్లడం వల్ల వ్యాపారంలోని చిక్కులను గురించి తెలుసుకుంది.

 Inspirational Success Story : ఊహించని విజ‌యం.. ఆఫీసు బాయ్ నుంచి రెండు కంపెనీలకు సీఈవో స్థాయికి వ‌చ్చానిలా.. కానీ..

అతి తక్కువ కాలంలోనే..

business woman success story Devita Saraf in telugu

కాలిఫోర్నియాలో చదువు పూర్తి చేసిన తరువాత ఇండియాకు తిరిగి వచ్చి.. 'వియు' (VU) గ్రూప్ పేరుతో టీవీలను తయారు చేసే కంపెనీ ప్రారంభించింది. ప్రారంభంలో వ్యాపారం కొంత నెమ్మదిగా ఉన్నప్పటికీ, అతి తక్కువ కాలంలోనే బాగా పుంజుకుంది. నేడు ఈ సంస్థ విలువ ఏకంగా రూ. 1000 కోట్లకు చేరింది. వియు కంపెనీ టీవీలను కంపెనీ కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని దాదాపు 60 దేశాల్లో విక్రయిస్తోంది. అయితే మనదేశంలో ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో అత్యధికంగా అమ్ముడవుతున్న టీవీ బ్రాండ్‌గా వియు అవతరించింది. కంపెనీ అభివృద్ధి విశేషమైన కృషి చేసిన దేవితను ఫార్చ్యూన్ ఇండియా (2019) భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళల జాబితాలో ఒకరుగా ప్రకటించింది.

➤ నాడు ఎంద‌రో తిరస్కరించారు.. నేడు రూ.65,000 కోట్ల కంటే ఎక్కువ సంపాదించానిలా.. నా స‌క్సెస్ ప్లాన్ ఇదే..!

Published date : 28 Nov 2023 12:51PM

Photo Stories