Dream 11 Success Story : నాడు ఎందరో తిరస్కరించారు.. నేడు రూ.65,000 కోట్ల కంటే ఎక్కువ సంపాదించానిలా.. నా సక్సెస్ ప్లాన్ ఇదే..!
నా పేరు హర్ష్ జైన్. నేను డ్రీమ్ 11 సంస్థకు అధిపతిని. నాడు నేను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్ని.. నేడు రూ. 65వేల కోట్ల వ్యాపారంకు అధిపతి అయ్యానంటున్నాడు హర్ష్ జైన్. ఈ నేపథ్యంలో డ్రీమ్ 11 చైర్మన్ హర్ష్ జైన్ సక్సెస్ స్టోరీ మీకోసం..
Success Story : నాడు క్లాసురూమ్ నుంచి బయటికి వచ్చా.. నేడు వేల కోట్లు సంపాదించా..!
ఎడ్యుకేషన్ :
నేను 1986లో ముంబైలో జన్మించాను. నా ప్రాథమిక విద్యను గ్రీన్‌లాస్ హైస్కూల్లో, ఆ తరువాత ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ చేయడానికి ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీలో చదివాను. చదువుకునే రోజుల్లోనే ఉపెన్ క్రికెట్ క్లబ్, ఇంట్రామ్యూరల్ ఫుట్‌బాల్ వంటి వాటిలో పాల్గొనేవాడిని.
కుటుంబ నేపథ్యం :
నేను 2013లో డెంటిస్ట్ అయిన రచనా షాను వివాహం చేసుకున్నాడు. మాకు క్రిష్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం మేము దక్షిణ ముంబైలోని పెద్దార్ రోడ్‌లో రూ.72 కోట్ల విలువైన లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాము. నేను 2010 జులైలో ముంబైలో రెడ్ డిజిటల్ అనే సోషల్ మీడియా ఏజెన్సీ స్థాపించాను. ఈ సంస్థను 2013లో ముంబైలోని మార్కెటింగ్ ఏజెన్సీ గోజూప్ కొనుగోలు చేసింది.
అతి తక్కువ కాలంలోనే గొప్ప స్థాయికి..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కొంతమంది డ్రీమ్ 11 యాప్ ఉపయోగించి క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ, బాస్కెట్‌బాల్ వంటి ఫాంటసీ ఆటలను ఆడుతుంటారు. 2019 ఏప్రిల్‌లో డ్రీమ్11 "యునికార్న్ క్లబ్" లోకి ప్రవేశించిన మొదటి ఇండియన్ గేమింగ్ కంపెనీగా అవతరించింది. అతి తక్కువ కాలంలోనే గొప్ప స్థాయికి చేరుకున్న డ్రీమ్11 వెనుక చాలా పెద్ద కథ ఉంది.
☛ IAS Success Story: 16 ఏళ్లకే వినికిడి శక్తి కోల్పోయా... కేవలం నాలుగు నెలల్లోనే ఐఏఎస్ సాధించానిలా...
నిజానికి IPL మొదటిసారి ప్రారంభమైనప్పుడు, హర్ష్ జైన్ అతని కాలేజీ ఫ్రెండ్ భవిత్ డ్రీమ్11 ప్రారంభించాలనే ఆలోచనను కలిగి ఉన్నట్లు, నిధుల కోసం రెండు సంవత్సరాలు సుమారు 150 మంది వెంచర్ క్యాపిటలిస్ట్‌లను సంప్రదించామని, అయితే తన ఆలోచనలను వీరందరూ తిరస్కరించారని హర్ష్ తెలిపారు. డ్రీమ్11 ప్రారంభ రోజులలో ఇద్దరూ కష్టాలను ఎదుర్కొన్నారు, కానీ చివరికి విజయం సాధించారు.
2017లో హర్ష్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ అధ్యక్షుడయ్యాడు. నేడు డ్రీమ్11 ఏకంగా 8 బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ. 65,000 కోట్లకంటే ఎక్కువ. ఈ ప్లాట్‌ఫామ్‌లో సుమారు 150 మిలియన్స్ యాక్టివేట్ యూజర్స్ ఉన్నారు. ప్రస్తుతం భారతదేశంలోని అత్యంత ధనవంతులైన యువ బిలియనీర్లలో హర్ష్ జైన్ ఒకరుగా ఉన్నారు.
☛ ఇలాంటి మరిన్ని సక్సెస్ స్టోరీల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి
Tags
- dream11 harsh jain success story
- dream11 harsh jain inspire story
- dream11 harsh jain family
- dream11 harsh jain education
- IPL 2023
- IPL 2023 Dream 11
- Success Story
- dream 11 owner
- dream 11 owner story
- dream 11 owner news
- Success Story
- Persistence
- how to get victory
- Goals
- sakshi education success story
- motivational story
- Inspiration]