UPSC Exam: యూపీఎస్సీ పరీక్షకు 1,872 మంది అభ్యర్థులు.. కేంద్రాల్లో ఏర్పాట్లు ఇలా..
కృష్ణ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. 1,872 మంది అభ్యర్థులకు ఐదు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ కళాశాల, బిషప్ అజరయ్య జూనియర్ కళాశాల, కేబీఎన్ కళాశాలలోని రెండు పరీక్ష కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ పరీక్షను నిర్వహించారు.
TS Inter Results 2024 : 24న తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఈసారి ఇలా..
ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వివిధ సెషన్లలో జరిగే పరీక్షలను ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అధికారులు విజయవంతంగా నిర్వహించారు. ఎన్డీఏ, ఎన్‌ఏ ఎగ్జామినేషన్‌కి సంబంధించి 1,127 మంది అభ్యర్థులకు గాను సెషన్–1కు 751మంది (66.64 శాతం), సెషన్–2కు 725 మంది (64.33), సీడీ ఎస్‌కు సంబంధించి 745 మంది అభ్యర్థులకు గాను సెషన్–1కు 263 మంది (35.30), సెషన్–2కు 264 మంది (35.44 శాతం) హాజరయ్యరు.
World Record: స్వీడన్ పోల్‌వాల్ట్ స్టార్ డుప్లాంటిస్ ప్రపంచ రికార్డు