Skip to main content

World Record: స్వీడన్ పోల్‌వాల్ట్ స్టార్ డుప్లాంటిస్ ప్రపంచ రికార్డు

స్వీడన్‌కు చెందిన పోల్‌వాల్ట్ స్టార్ ఆర్మాండ్ డుప్లాంటిస్ అద్భుత ప్రదర్శనతో మరోసారి ప్రపంచ రికార్డు సృష్టించాడు.
Athlete Armand Duplantis breaking pole vault world record

డైమండ్‌ లీగ్‌ తొలి అంచె టోర్నీ ఫైనల్లో 6.24 మీటర్లు ఎగురుతూ.. గత సెప్టెంబర్‌లో తన పేరిట నమోదైన 6.23 మీటర్ల రికార్డును ఛేదించాడు.

ఈ విజయంతో డుప్లాంటిస్ తన ప్రపంచ రికార్డుల సంఖ్యను ఎనిమిదికి పెంచుకున్నాడు. రెండో స్థానంలో నిలిచిన అమెరికన్ క్రీడాకారుడు సామ్ కెండ్రిక్స్ 5.82 మీటర్ల ఎత్తు మాత్రమే అధిగమించగలిగాడు.

ఈమె 200 మీటర్ల పరుగులో విజయం..
ఆస్ట్రేలియాకు చెందిన టీనేజ్ క్రీడాకారిణి టోరీ లూయిస్ 22.96 సెకన్ల అద్భుత సమయంతో మహిళల 200 మీటర్ల పరుగులో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫేవరెట్‌గా పరిగణించబడిన అమెరికన్ స్ప్రింటర్ షకారి రిచర్డ్‌సన్ (22.99 సెకన్లు) ను ఓడించి టోరీ ఈ విజయాన్ని అందుకుంది.

Wrestler Sakshi: ‘టైమ్‌’ టాప్‌–100 జాబితాలో రెజ్లర్‌ సాక్షి మలిక్‌

Published date : 22 Apr 2024 03:14PM

Photo Stories