Wrestler Sakshi: ‘టైమ్’ టాప్–100 జాబితాలో రెజ్లర్ సాక్షి మలిక్
Sakshi Education
ప్రఖ్యాత ‘టైమ్’ మేగజీన్ ప్రకటించిన అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత మహిళా రెజ్లర్ సాక్షి మలిక్‌కు చోటు దక్కింది.
2024 సంవత్సరానికి ‘టైమ్’ ఈ జాబితాను ప్రకటించింది. లైంగిక వేధింపులకు సంబంధించిన వివాదంలో మహిళా రెజ్లర్ల పక్షాన బలంగా నిలబడి ఆమె చేసిన పోరాటానికి ఈ గుర్తింపు లభించింది.
ఈ అంశంలో భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు ఎదురొడ్డి సాక్షి మలిక్ గట్టిగా తన వాణిని వినిపిస్తూ నిరసనల్లో పాల్గొంది. వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియాలతో కలిసి ఆమె చేసిన ఈ పోరాటం దేశవిదేశాల్లో వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో బ్రిజ్‌భూషణ్ తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
Paris Olympics: చెఫ్ డి మిషన్‌గా వైదొలగిన మేరీకోమ్.. కారణం ఇదేనా..
Published date : 19 Apr 2024 10:43AM