సివిల్ సర్వీస్ పరీక్షలపై రూరల్ బ్యాక్‌గ్రౌండ్ ప్రభావం: సాధు నరసింహారెడ్డి, ఐఆర్‌ఎస్
Sakshi Education
భారతదేశంలో సివిల్ సర్వీసెస్ నియామక ప్రక్రియ సంవత్సరాలుగా ఎంతో అభివృద్ధి చెందింది.
ఈ నియామక విధానంలో, ముఖ్యంగా స్వాతంత్య్రానంతరం పరిపాలన అవసరాలకనుగుణంగా ఎప్పటికప్పుడు అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీని సుదీర్ఘ పరిణామక్రమంలో, ముఖ్యంగా ఒక ఉన్నత వర్గం నుంచి అభివృద్ధి చెందిన సివిల్ సర్వీసెస్ విధానం ప్రస్తుత భారతీయ సమాజానికి ప్రతినిధిగా వ్యవహరిస్తోంది. ఇది చాలా సానుకూలమైన అభివృద్ధి. ప్రస్తుతం అనేక మంది గ్రామీణ అభ్యర్ధులు, వెనుకబడిన నేపథ్యమున్నవారు సివిల్ సర్వీసెస్‌లలో ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి నేపధ్యమున్న విధ్యార్ధులకు గ్రామీణ, వెనుకబడిన వర్గాలు ఎదుర్కొనే సమస్యలు, కష్టాలపై మరింత అవగాహన ఉంటుంది. అంతేకాకుండా గ్రామీణ అభ్యర్ధులు సివిల్ సర్వెంట్‌గా నియమితులైతే సామాజిక మార్పు,పరిణామాలలో కీలక పాత్రను పోషిస్తారు. అయితే, 2011 సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చిన సివిల్ సర్వీసెస్ CAST (ప్రిలిమ్స్) పరీక్ష విధానం రూరల్ బ్యాక్‌గ్రౌండ్ అభ్యర్ధులకు విజయావకాశాలను దూరం చేస్తుందనే అపోహ ఉంది. అదేవిధంగా టెక్నికల్, మేనేజ్‌మెంట్, ఇంగ్లీష్ మీడియం, అర్బన్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అభ్యర్ధులు మాత్రమే సివిల్స్ క్లియర్ చేయగలరనీ, లేకుంటే ఆసాధ్యమనే అభిప్రాయంలో ఎంతో మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో రూరల్ (గ్రామీణ) బ్యాక్‌గ్రౌండ్ అభ్యర్ధులు ఎదుర్కొంటున్న ప్రతికూలతలు, వాటిని అధిగమించే మార్గాలను తెలుసుకుందాం...
ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్
మన దేశంలో, ఇప్పటికీ 35 % విద్యార్ధులకు మాత్రమే ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ ఎడ్యుకేషన్ అందుతోంది. దీనితో అనేక మంది పౌరులు ముఖ్యంగా గ్రామీణ నేపథ్యమున్నవారు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్‌లో సమాన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. వీరంతా గ్రామీణప్రాంతాల్లోని పాఠశాలల్లో, ప్రాముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం వల్ల పట్టణాల్లోని ముఖ్యంగా పబ్లిక్ స్కూల్లలో అందించే నాణ్యమైన విద్యకు సమానమైన విద్యను అందుకోలేకపోతున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విధమైన అసమానత నియామకాల్లో పక్షపాతానికి దారి తీస్తుంది. ప్రవేశాలకు నిర్వహించే ప్రఖ్యాత పోటీ పరీక్షలైన ఐఐటీల్లో, నేషనల్ లా స్కూల్లలో, ప్రీమియర్ మెడికల్ స్కూల్లలో, ఇతర సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లలో ఈ పట్టణ పక్షపాతం ఇప్పటికే కనిపిస్తూ ఉంది.
గ్రామీణ నేపథ్యం – వనరుల కొరత
2011లో పరిచయం చేసిన కొత్త పరీక్ష విధానం, కొత్త సిలబస్ గ్రామీణ నేపథ్యమున్న అభ్యర్ధులకు అంత అనుకూలమైనది కాదు. సాధారణంగా మారుమూల గ్రామాల్లోని పాఠశాలల్లో, కాలేజీల్లో ఎథిక్స్ సబ్జెక్ట్ బోధించరు. ఈ విధమైన సబ్జెక్టులను పరిచయం చేయడం ద్వారా పట్టణ ప్రాంత అభ్యర్ధులతో పోలిస్తే గ్రామీణ నేపథ్యమున్న అభ్యర్ధులు వెనుకబడి పోతారు. సిలబస్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తే కంప్యూటర్, ఇంటర్‌నెట్‌లలో లభ్యమయ్యే సమాచారం అభ్యర్ధులకు తప్పనిసరి. గ్రామీణ అభ్యర్ధులకు ఇటువంటి సదుపాయాలు సమకూర్చుకోవడం అంత సులువుకాదు.
అంతేకాకుండా... సిలబస్‌లో భాగంగా ప్రభుత్వ, అంతర్జాతీయ సంస్థల నివేధికలు (రిపోర్టులు), రిఫరెన్స్‌లు కేస్‌స్టడీస్ కోసం అవసరం అవుతాయి. వీటి విషయంలో కూడా గ్రామీణ విద్యార్ధులు వెనుకబడే అవకాశం ఉంది. ఈ విధమైన ధోరణి ఇంటర్‌నెట్ సదుపాయం విషయంలో మాత్రమేకాదు పట్టణ మౌలికసదుపాయాల విషయంలో కూడా కనిపిస్తుంది. కొత్త పరీక్ష విధానం, మారిన సిలబస్ ఇవిరెండూ గ్రామీణ – పట్టణాలను మరింత విభజించాయని చెప్పవచ్చు. నూతన పరీక్షా విధానం గ్రామీణ అభ్యర్ధుల ఆశలను నిరుత్సాహపరిచేలా ఉంది. ప్రభుత్వ సమగ్ర వృద్ధిలో అసమానతలకూ కారణం అవుతుంది. అంతేకాకుండా ఇది మెరుగైన విద్యాసంస్థలు, పోటీ పరీక్షలకు సన్నద్ధమవ్వడానికి మెరుగైన కోచింగ్ తీసుకోగల సామర్థ్యమున్న సంపన్నులు, ఉన్నత వర్గంవారికి మాత్రమే అనుకూలమైనదని చెప్పవచ్చు.
చదవండి: సివిల్ సర్వెంట్ కావాలనే విద్యార్ధులకు ఐఏఎస్ మేఘనాథ్ రెడ్డి సూచనలు – సలహాలు..
ఆర్థిక సమస్యలు – పట్టణాల్లో శిక్షణ
దేశంలోనే కష్టతరమైన, సుదీర్ఘమైన పరీక్ష వ్యవస్థకు ఒక సివిల్ సర్వీసెస్ ఆశావహ అభ్యర్ధి సన్నధమయ్యేటప్పుడు అనేక సమస్యలతో యుద్ధం చేయవలసి ఉంటుంది. పట్టణాల్లో కోచింగ్, ప్రిపరేషన్ కోసం అనేక మంది అభ్యర్ధులు వారి ఇళ్లను వదిలి, అతి తక్కువ సౌకర్యవంతంగా ఉండే గదిలో సర్దుకుని పరీక్షలకు సన్నద్ధమవుతూ ఉంటారు. చాలా మందికి కనీసం ఎలా వండుకోవాలో కూడా తెలియదు. సమయాన్ని ఆదా చేసే క్రమంలో రోడ్డు పక్కన స్టాల్లలో లేదా హోటల్లలో భోజనం చేస్తారు. సరైన భోజనం తినక, అసౌకర్యంగా జీవించడంవల్ల అనేక మంది అభ్యర్ధులు అనారోగ్య సమస్యలగుండా వెళ్తారు. ఒక అభ్యర్ధి ఢిల్లీలో భోజనం, వసతి చార్జీలుకాకుండా కేవలం కోచింగ్‌కు సంవత్సరానికి రూ. 2 లక్షలు ఖర్చు అవుతుందని కనీసపు అంచనా. విఫలమైన ప్రయత్నాలు, ఎక్స్‌ట్రా కోచింగ్‌కు ఎక్స్‌ట్రా ఫీజులు మైదలైనవాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఎంత ఖర్చుఅవుతుందో ఊహించండి.
ఈ ప్రతికూలతలతో విజయం సాధ్యమవుతుందా..?
గ్రామీణ నేపథ్యమున్న అభ్యర్ధులందరూ వారి ఆర్థిక సమస్యలవల్ల, విద్యార్హతలను బట్టి సందేహాలకు లేదా ఆత్మనూన్యతా భావానికి లోనౌతారు. ‘నేను ఢిల్లీకి వెళ్లలేను కాబట్టి నాకు విజయావకాశాలు తక్కువ’ లేదా ‘నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను’ లేదా ‘నేనుపేదవాడిని’ లేదా ‘నాకు గ్రాడ్యుయేషన్‌లో తక్కువ మార్కులు వచ్చాయి, కొన్ని సెమిష్టర్లలో నేను ఫెయిల్ అయ్యాను’ వంటి ఆలోచనా పరంపరలో అనేక మంది అభ్యర్ధులు ఉంటారు.
మీరు ముందుగా ఈ విధమైన ఆలోచనా ధోరణినుంచి బయటపడాలి. అంతేకాకుండా ఇలా ఆలోచించే వారికి కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే వ్యతిరేక «ఆలోచనలు అంటువ్యాధి వంటివి. అవి మీ చదువు, ఆలోచనలపై ప్రభావాన్ని చూపుతాయి. గ్రామీణ నేపథ్యమున్న అనేక మంది అభ్యర్ధులు విజయవంతంగా సివిల్ సర్వీసెస్ పరీక్షలను క్లియర్ చేశారు. అందుకు ఎందరో ఉదాహరణలుగా నిలిచారు. ఎగ్జామినర్ మీ మెయిన్స్ సమాధాన పత్రాలను పరిశీలించేటప్పుడు మీరు గ్రామీణ ప్రాంతానికి చెందిన వ్యక్తి అనీ, మీరు ఢిల్లీలో కోచింగ్ తీసుకోలేదనే విషయం అతనికి తెలియదనేతెలియదని గుర్తుంచుకోండి. అంతేకాకుండా మీ జీవితంలోకి మళ్లీ వెనుకకు వెళ్లి ప్రస్తుతం మీకు నచ్చని అన్ని విషయాలను మార్చుకోలేరు. కాబట్టి మీరు ముందుకు వెళ్లడమే మంచిదనే విషయం గమనించుకోవాలి.
Check Civils Mains Question & Answers Sriram's IAS, New Delhi
విజయం సాధ్యమే!
కోచింగ్ లేకుండా విజయం సాధించడం చాలా సులువు. ఈ కింది అభ్యర్ధులు కోచింగ్ లేకుండానే సివిల్స్‌లో ర్యాంక్ సాధించారు. వీరు మాత్రమే కాదు ఇంకా అనేక మందికి ఇది సాధ్యమైంది.
కోచింగ్, స్టడీ మెటీరియల్లకు కేంద్రాలైన ఢిల్లీ వంటి సిటీలను ఎంతో మంది అభ్యర్ధులు చేరుకోలేకపోయారు. అయినప్పటికీ సీరియస్‌గా ప్రిపేరయ్యే అభ్యర్ధులు మాత్రం వారి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన సివిల్స్ ఆశావహులకు సంప్రదాయ కోచింగ్ మార్గాలు అందుబాటులో లేనప్పటికీ వారు అనేక ఇతర మార్గాలను అన్వేషించి ఎంపికల్లో మార్పులు చేసుకున్నారు.
చదవండి: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సంబంధించిన 31 ముఖ్యమైన సందేహాలు - సమాధానాలు... మీ కోసం
విజయానికి మార్గదర్శకాలు ఇవే...
ఐఏఎస్ పరీక్షలో మీ విజయావకాశాలను నిర్ణయించడంలో అతి ముఖ్యమైన పాత్ర వహించేవి మీలోని అంకిత భావం, నిబద్ధత. మీరు సీరియస్‌గా ప్రిపేర్ అయితే చాలు.. కోచింగ్, మార్కెట్‌ల పట్టింపు అవసరం లేదు. ప్రిపరేషన్‌కు సంప్రదాయ (కోచింగ్) పద్ధతులు అక్కరలేదు. మీకు మార్కెట్ అందుబాటులో లేకపోతే ఆన్‌లైన్ రీసోర్సెస్ రూపంలో వాటన్నింటినీ పొందవచ్చు. స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ విప్లవంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్‌నెట్ సదుపాయానికి కొరత లేదు. మీరు ఇంట్లో ఉండి ప్రిపేరవుతూనే.. ఆందోళన (డిస్‌ట్రెస్), ఉద్రిక్తల సమయంలో మీ కుటుంబ సభ్యుల సహకారంతో వాటిని అధిగమించవచ్చు. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో, న్యూస్ పేపర్లలో లభ్యమయ్యే నాణ్యమైన మెటీరియల్ పై దృష్టి సారించాలి. మీ ప్రాంతంలో లేని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్, బుక్స్ గురించి ఆందోళన పడకండి. ఆన్‌లైన్ మార్కెట్ ఈ సదుపాయాలన్నింటినీ పుష్కలంగా భర్తీ చేస్తుంది.
ఆన్‌లైన్ కోచింగ్, మెటీరియల్ మీకు అందుబాటులోలేకపోయినప్పటికీ ఆందోళన చెందకూడదు. బదులుగా ఏదైనా మంచి ఇన్‌స్టిట్యూట్ అందించే కరస్పాండెంట్ కోర్సులను తీసుకోండి. సివిల్ సర్వీస్ అభ్యర్ధులకు అవసరమైన అన్నిరకాల పుస్తకాలు, మ్యాగజైన్లు లభ్యమయ్యే అద్భుతమైన ప్రదేశం.. పబ్లిక్ లైబ్రరీ.
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ (CSAT) పరీక్ష సెకెండ్ పేపర్ లో అడిగే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ స్కిల్స్‌కు వచ్చే మార్కులు గ్రేడిండ్‌లో కలపరు. ఏదిఏమైనప్పటికీ ఈ గ్లోబలైజ్డ్ వరల్డ్‌లో ఇంగ్లీష్ ప్రాధాన్యాన్ని మనం విస్మరించకూడదు. కాబట్టి ఇంగ్లీష్‌పై మంచిపట్టు ఉండాలి. కనీసం ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించేంతమట్టుకైనా ఇంగ్లీష్ అవసరమే. ఏదైనా ఒక ఇంగ్లీష్ మెటీరియల్ నుంచి 3 లేదా 4 టాపిక్‌లను చదివి, దానిని డిక్షనరీ లేదా గూగుల్ ట్రాన్సలేటర్ ద్వారా మీకు నచ్చిన ప్రాంతీయ భాషలోకి దానిని అనువదించండి. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ కోసం, హిందూ న్యూస్ పేపర్‌లో ప్రచురితమయ్యే ఎడిటోరియల్‌లను ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ ఇంగ్లీష్ రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడమేకాకుండా, కరెంట్ ఈవెంట్స్‌పై కూడా మంచి పట్టు సాధిస్తారు.
సివిల్ సర్వీస్ రాతపరీక్షకు ఏ భారతీయ భాష (మీడియం)ను ఎంచుకుంటారో (హిందీ కాకుండా), ఇంటర్వ్యూకి కూడా అదే భాషను లేదా ఇంగ్లీష్ లేదా హిందీని ఎంపికచేసుకోవచ్చు. మెయిన్స్ పరీక్షలను ఇంగ్లీష్‌లో రాసిన అభ్యర్ధులు కూడా, ఇప్పుడు ఇంగ్లీష్, హిందీ లేదా ఏదైనా ఇతర భారతీయ భాషను ఇంటర్వ్యూకి ఎంపిక చేసుకోవచ్చు. మెయిన్స్ విభాగంలోని కంపల్సరీ ఇండియన్ లాంగ్వేజ్ పేపర్‌లో కూడా అభ్యర్ధులు తమకి నచ్చిన భాషను ఎంపిక చేసుకోవచ్చు. ఇంగ్లీష్‌లో కమ్యునికేషన్ స్కిల్స్ తక్కువగా ఉన్నాయనిభావించే గ్రామీణ అభ్యర్ధులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
చివరిగా, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది మన పరిసరాల గురించి తెలుసుకోవడానికి, దేశాన్ని మెరుగైన మార్గంలో నడిపించడానికి, మన జ్ఞానాన్ని మరింత వృద్ధి చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. ఒకవేళ మీరు సర్వీసులలోకి ప్రవేశించలేకపోయినప్పటికీ, మీరు సంపూర్ణ జ్ఞానం కలిగిన పౌరుడిగా నిలవడమేకాకుండా సమాజాన్ని, కెరీర్‌ను సానుకూలంగా వృద్ధి చేసుకోవడంలో ఈ విధమైన విషయ జ్ఞానం మీకు ఎంతో సహాయకారిగా ఉంటుంది.

- 2010 సివిల్ సర్వీస్ పరీక్షల్లో 102వ ర్యాంక్ సాధించిన సీహెచ్. విజయ రావు ఐపిఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెస్ట్ గోదావరి జిల్లాలో నీలాద్రిపురం గ్రామానికి చెందిన ఒక వ్యవసాయ కూలి కొడుకు.
- అదే సంవత్సరం 834వ ర్యాంక్ సాధించిన ఎన్ బలరాం ఐఆర్‌ఎస్, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కొడుకు. నిజానికి, బలరాం యూజీ, పీజీ ఈ రెండూ డిగ్రీలను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా పూర్తి చేశాడు. అతను కనీసం రెగ్యులర్ కాలేజీకి కూడా వెళ్లలేదు.
- 2007 సివిల్ సర్వీస్ పరీక్షల్లో 48వ ర్యాంక్ సాధించిన గోవింద్ జైష్వాల్ ఐఏఎస్, ఒక రిక్షావాలా కొడుకు. చెవులకు చిళ్లులు పడేంత శబ్ధాలు చేసే విద్యుత్ జనరేటర్లు, ఫ్యాక్టరీ మెషిన్ల మధ్య ప్రిపేరయ్యాడు. అతను తన 8వ తరగతి నుంచే ట్యూషన్లు చెప్పుకుంటూ చదువుకున్నాడు.
- 2019 సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన ప్రదీప్ సింగ్ ఐఆర్‌ఎస్, హర్యానా రాష్ట్రంలోని సోనిపెట్ అనే గ్రామంలో 7 ఎకరాల భూమి కలిగిన రైతు కొడుకు. 7వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో, 12వ తరగతి వరకు షాంభూదయాల్ మోడల్ స్కూల్, దీన్‌బంధు ఛోటురామ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివాడు.
- 2016 సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఫస్ట్ అటెంప్ట్‌లోనే 420 ర్యాంక్ సాధించిన ఉమ్మూల్ ఖేర్, ఢిల్లీలోని నిజాముద్ధీన్ అనే స్లమ్ ఏరియాలో బట్టలు అమ్మే వీధి వ్యాపారి కూతురు. చిన్నతనం నుంచే ఫ్రాజిల్ బోన్ డిసీజ్ (వ్యాధి)తో బాధపడుతున్నప్పటికీ, తన 14వ యేట నుంచే ట్యూషన్లు చెబుతూ చదువుకుంది. 91 శాతం మార్కులతో 12వ తరగతి, సైకాలజీ (హానర్స్)లో డిగ్రీ, జేఎన్‌యూలో ఎమ్‌ఏ ఇంటర్‌నేషన్ స్టడీస్ పూర్తిచేసింది. 2013లో జేఆర్‌ఎఫ్ సాధించి నెలకు రూ. 25,000 సంపాధిస్తూ కుటుంబానికి చేదోడుగా నిలిచింది.
కోచింగ్ లేకుండా విజయం సాధించడం చాలా సులువు. ఈ కింది అభ్యర్ధులు కోచింగ్ లేకుండానే సివిల్స్‌లో ర్యాంక్ సాధించారు. వీరు మాత్రమే కాదు ఇంకా అనేక మందికి ఇది సాధ్యమైంది.
పేరు | ఆల్ ఇండియా ర్యాంక్ | సంవత్సరం |
ప్రియాంక్ కిశోర్ | 274 | 2018 |
షిషిర్ గుప్తా | 50 | 2015 |
అరుణ్‌రాజ్ | 34 | 2014 |
హర్షికా సింగ్ | 8 | 2011 |
ఓమ్ కాసెరా | 17 | 2011 |
జీఆర్ గోకుల్ | 19 | 2010 |
మహ్మద్ షఫీ | 55 | 2009 |
కోచింగ్, స్టడీ మెటీరియల్లకు కేంద్రాలైన ఢిల్లీ వంటి సిటీలను ఎంతో మంది అభ్యర్ధులు చేరుకోలేకపోయారు. అయినప్పటికీ సీరియస్‌గా ప్రిపేరయ్యే అభ్యర్ధులు మాత్రం వారి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన సివిల్స్ ఆశావహులకు సంప్రదాయ కోచింగ్ మార్గాలు అందుబాటులో లేనప్పటికీ వారు అనేక ఇతర మార్గాలను అన్వేషించి ఎంపికల్లో మార్పులు చేసుకున్నారు.
చదవండి: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సంబంధించిన 31 ముఖ్యమైన సందేహాలు - సమాధానాలు... మీ కోసం
విజయానికి మార్గదర్శకాలు ఇవే...
ఐఏఎస్ పరీక్షలో మీ విజయావకాశాలను నిర్ణయించడంలో అతి ముఖ్యమైన పాత్ర వహించేవి మీలోని అంకిత భావం, నిబద్ధత. మీరు సీరియస్‌గా ప్రిపేర్ అయితే చాలు.. కోచింగ్, మార్కెట్‌ల పట్టింపు అవసరం లేదు. ప్రిపరేషన్‌కు సంప్రదాయ (కోచింగ్) పద్ధతులు అక్కరలేదు. మీకు మార్కెట్ అందుబాటులో లేకపోతే ఆన్‌లైన్ రీసోర్సెస్ రూపంలో వాటన్నింటినీ పొందవచ్చు. స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ విప్లవంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్‌నెట్ సదుపాయానికి కొరత లేదు. మీరు ఇంట్లో ఉండి ప్రిపేరవుతూనే.. ఆందోళన (డిస్‌ట్రెస్), ఉద్రిక్తల సమయంలో మీ కుటుంబ సభ్యుల సహకారంతో వాటిని అధిగమించవచ్చు. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో, న్యూస్ పేపర్లలో లభ్యమయ్యే నాణ్యమైన మెటీరియల్ పై దృష్టి సారించాలి. మీ ప్రాంతంలో లేని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్, బుక్స్ గురించి ఆందోళన పడకండి. ఆన్‌లైన్ మార్కెట్ ఈ సదుపాయాలన్నింటినీ పుష్కలంగా భర్తీ చేస్తుంది.
ఆన్‌లైన్ కోచింగ్, మెటీరియల్ మీకు అందుబాటులోలేకపోయినప్పటికీ ఆందోళన చెందకూడదు. బదులుగా ఏదైనా మంచి ఇన్‌స్టిట్యూట్ అందించే కరస్పాండెంట్ కోర్సులను తీసుకోండి. సివిల్ సర్వీస్ అభ్యర్ధులకు అవసరమైన అన్నిరకాల పుస్తకాలు, మ్యాగజైన్లు లభ్యమయ్యే అద్భుతమైన ప్రదేశం.. పబ్లిక్ లైబ్రరీ.
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ (CSAT) పరీక్ష సెకెండ్ పేపర్ లో అడిగే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ స్కిల్స్‌కు వచ్చే మార్కులు గ్రేడిండ్‌లో కలపరు. ఏదిఏమైనప్పటికీ ఈ గ్లోబలైజ్డ్ వరల్డ్‌లో ఇంగ్లీష్ ప్రాధాన్యాన్ని మనం విస్మరించకూడదు. కాబట్టి ఇంగ్లీష్‌పై మంచిపట్టు ఉండాలి. కనీసం ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించేంతమట్టుకైనా ఇంగ్లీష్ అవసరమే. ఏదైనా ఒక ఇంగ్లీష్ మెటీరియల్ నుంచి 3 లేదా 4 టాపిక్‌లను చదివి, దానిని డిక్షనరీ లేదా గూగుల్ ట్రాన్సలేటర్ ద్వారా మీకు నచ్చిన ప్రాంతీయ భాషలోకి దానిని అనువదించండి. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ కోసం, హిందూ న్యూస్ పేపర్‌లో ప్రచురితమయ్యే ఎడిటోరియల్‌లను ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ ఇంగ్లీష్ రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడమేకాకుండా, కరెంట్ ఈవెంట్స్‌పై కూడా మంచి పట్టు సాధిస్తారు.
సివిల్ సర్వీస్ రాతపరీక్షకు ఏ భారతీయ భాష (మీడియం)ను ఎంచుకుంటారో (హిందీ కాకుండా), ఇంటర్వ్యూకి కూడా అదే భాషను లేదా ఇంగ్లీష్ లేదా హిందీని ఎంపికచేసుకోవచ్చు. మెయిన్స్ పరీక్షలను ఇంగ్లీష్‌లో రాసిన అభ్యర్ధులు కూడా, ఇప్పుడు ఇంగ్లీష్, హిందీ లేదా ఏదైనా ఇతర భారతీయ భాషను ఇంటర్వ్యూకి ఎంపిక చేసుకోవచ్చు. మెయిన్స్ విభాగంలోని కంపల్సరీ ఇండియన్ లాంగ్వేజ్ పేపర్‌లో కూడా అభ్యర్ధులు తమకి నచ్చిన భాషను ఎంపిక చేసుకోవచ్చు. ఇంగ్లీష్‌లో కమ్యునికేషన్ స్కిల్స్ తక్కువగా ఉన్నాయనిభావించే గ్రామీణ అభ్యర్ధులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
చివరిగా, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది మన పరిసరాల గురించి తెలుసుకోవడానికి, దేశాన్ని మెరుగైన మార్గంలో నడిపించడానికి, మన జ్ఞానాన్ని మరింత వృద్ధి చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. ఒకవేళ మీరు సర్వీసులలోకి ప్రవేశించలేకపోయినప్పటికీ, మీరు సంపూర్ణ జ్ఞానం కలిగిన పౌరుడిగా నిలవడమేకాకుండా సమాజాన్ని, కెరీర్‌ను సానుకూలంగా వృద్ధి చేసుకోవడంలో ఈ విధమైన విషయ జ్ఞానం మీకు ఎంతో సహాయకారిగా ఉంటుంది.
Published date : 05 May 2021 02:32PM