సివిల్స్ ఇంటర్వ్యూకు ‘అనుదీప్’ సలహాలు...
Sakshi Education
తుది జాబితాలో విజేతగా నిలవాలన్నా.. కోరుకున్న సర్వీసును సొంతం చేసుకోవాలన్నా.. ఇంటర్వ్యూలో సాధించే మార్కులు చాలా కీలకం..
విజేతగా మారేందుకు మరో అడుగుదూరం మాత్రమే! కానీ, ఈ అడుగు ఎంతో నిర్ణయాత్మకం. సివిల్స్‌ను సాధించడమే లక్ష్యంగా.. ఏళ్లుగా రేయింబవళ్లు నిర్విరామంగా శ్రమిస్తూ.. చివరి దశ ఇంటర్వ్యూ దాకా వచ్చిన అభ్యర్థులు.. తుది జాబితాలో విజేతగా నిలవాలన్నా.. కోరుకున్న సర్వీసును సొంతం చేసుకోవాలన్నా.. ఇంటర్వ్యూలో సాధించే మార్కులు చాలా కీలకం! 275 మార్కులకు నిర్వహించే ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్టు) అభ్యర్థుల తలరాతను నిర్దేశిస్తుంది. 2017లో ఆల్ ఇండియా టాపర్, తెలుగు తేజం ‘అనుదీప్ దురిశెట్టి’.. సూచనలు, సలహాలు ఆయన మాటల్లోనే..!!.
మెండైన ఆత్మవిశ్వాసం..
2017 సివిల్స్ ఇంటర్వ్యూ నాకు రెండో పర్సనాలిటీ టెస్టు. మొదట 2014లో ఇంటర్వ్యూకు హాజరయ్యాను. అప్పుడు వచ్చిన 204 మార్కులు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతోనే 2017 పర్సనాలిటీ టెస్టుకు వెళ్లాను. ఎలాంటి ఆత్రుత, ఆందోళన లేకుండా యూపీఎస్సీ ఆఫీసు మెట్లు ఎక్కాను. ఎలాంటి ప్రశ్నలు అడిగినా, లోతుగా ప్రశ్నలు సంధించినా.. ఆ సమయానికి నాకు బెస్ట్ అనిపించే సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నాను.
ఇంటర్వ్యూ రోజున :
ఇంటర్వ్యూ రోజున... అప్పటికే నేను రాసుకున్న నోట్స్‌ను రెండు గంటల పాటు రివిజన్ చేసుకున్నా. అలాగే నా ప్రొఫైల్, నా విజయాల గురించి బోర్డు సభ్యులకు సరిగా చెప్పే విధంగా సన్నద్ధమయ్యాను. ఆ రోజు దినపత్రికలు చదివి యూపీఎస్సీ ఆఫీసుకు బయల్దేరాను. అక్కడికి చేరాక సెక్యూరిటీ చెక్ అనంతరం వెయిటింగ్‌లో కూర్చున్నాం. అప్పుడు ఒక ఆఫీసర్ వచ్చి ఇంటర్వ్యూకు సంబంధించిన మార్గదర్శకాల గురించి చిరునవ్వుతో వివరించారు. ఇంటర్వ్యూకు వచ్చిన అభ్యర్థుల్లో ఒత్తిడిని దూరంచేసే విధంగా ఆ అధికారి కాసేపు మాట్లాడారు. అప్పటివరకు చాలా మందికి యూపీఎస్సీ గురించి పెద్దగా అవగాహన ఉండదు. వేర్వేరు ప్రతికూల ఆలోచనలతో ఉంటారు. ఆ అధికారి సంభాషణతో అక్కడ ఉన్న అభ్యర్థులు కాస్త ప్రశాంతంగా కనిపించారు.
నా ఇంటర్వ్యూ.. వీటిపైనే
సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఇతర పేపర్ వర్క్ ముగిసిన తర్వాత రిటైర్డ్ ఎయిర్ మార్షల్ అజిత్ భోంస్లే ప్యానెల్ ఇంటర్వ్యూ చేస్తారని చెప్పారు. నా ఇంటర్వ్యూ 3 గంటలకు ప్రారంభమైంది. సుమారు 35 నిమిషాల పాటు జరిగింది. బోర్డు సభ్యులు భిన్న అంశాలపై ప్రశ్నలు అడిగారు. ఆర్యుల వలస, ద్వేషపూరిత నేరాలు(హేట్ క్రైమ్స్), ధ్యానం, కృతిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), స్వచ్ఛభారత్, ఐఏఎస్ ఎందుకు కావాలనుకుంటున్నావు?.. మొదలైన అంశాలపై ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటిలో కొన్ని ముందుగా ఊహించి, సన్నద్ధమైనవే కాబట్టి సమాధానాలు బాగా చెప్పాను. నా వరకు బెస్ట్ అనిపించే సమాధానాలు ఇచ్చాను.
సమాధానాల్లో పరిజ్ఞానం ప్రధానం..
ఆత్మన్యూనత, అభద్రతాభావం వీడాలి..
ముఖ్యంగా అభ్యర్థులు ఆత్మన్యూనత, అభద్రతాభావాన్ని వదిలిపెట్టాలి. పేరున్న కాలేజీలో చదవలేదనో.. ఎంఎన్‌సీ కంపెనీల్లో పనిచేసిన అనుభవం లేదనో.. వయసు 30 కంటే ఎక్కువ వంటి అపోహలను దూరం పెట్టాలి. నాకు తెలిసిన చాలామంది ఐఐటీల నుంచి పట్టాలు పొంది, బహుళజాతి కంపెనీల్లో పని అనుభవమున్నా.. ఇంటర్వ్యూలో మంచి స్కోరు చేయడంలో విఫలమయ్యారు. బోర్డు ఇంటర్వ్యూ సాగే అర్ధగంటలో మనతో మాట్లాడి మన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి నేపథ్యంతో సంబంధం లేకుండా.. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూను ఎదుర్కోవాలి. మనం ఒక సినిమాకు వెళ్లినప్పుడు అందులోని పాత్రల పేర్లు, డైలాగులు, లొకేషన్లు గుర్తించుకోం.. కానీ, బయటికి వచ్చేటప్పుడు ఆ సినిమా డీసెంట్‌గా ఉందా, ఎక్స్‌లెంట్‌గా ఉందా, భయంకరంగా ఉందా.. అనే ఒక నిర్దిష్ట అభిప్రాయానికి వస్తాం. ఇంటర్వ్యూ ప్యానల్ కూడా అంతే..! మనం చెప్పే ప్రతి సమాధానాన్ని వారు గుర్తుంచుకోరు. మొత్తంగా జరిగిన సంభాషణ మేరకు ఒక నిశ్చిత అభిప్రాయానికి వస్తారు. బోర్డుకు, మీకు మధ్య అర్థవంతమైన మేధో సంభాషణ జరిగి, ఉద్యోగానికి మీరు సరైన అభ్యర్థి అని నమ్మించగలిగితే చాలు కచ్చితంగా మీరు మంచి స్కోరు చేస్తారు.
ప్రతికూల భావన కూడదు :
ఫ్లాట్ ప్రశ్నలు :
‘బ్యాలెన్స్’ తప్పొద్దు:
బోర్డు సభ్యులు కొన్నిసార్లు సరదాగా ఉన్నా, ప్రశంసించినా, విభేదించినా.. వాటితో సంబంధం లేకుండా ప్రశాంతంగా ‘బ్యాలెన్స్‌డ్’గా నడుచుకోవాలి. మీరు చెప్పే సమాధానాల్లోనూ అది ప్రతిబింబించాలి. ఉదాహరణకు వారు ‘ఆధార్ చర్చ’ మీద ప్రశ్న అడిగినప్పుడు నా సమాధానం.. ‘సర్ ఆధార్-గోప్యత... గెలుపు-ఓటమి (జీరో సమ్ గేమ్) చర్చ కాదు. మనకు ఆధార్, వ్యక్తిగత సమాచార గోప్యత రెండూ అవసరమే. ప్రస్తుతం చర్చ ఆధారా లేకా గోప్యతా.. అనే కోణంలో పూర్తిగా వక్రీకరణకు గురైంది. కానీ మనకు ఆ రెండింటి మధ్య ఉన్న స్వల్ప భేదం తెలియాల్సి ఉంది.’ సభ్యులకు ఈ సమాధానం చెప్పినప్పుడు వారి నుంచి ఆధార్ వల్ల ప్రయోజనాలు, ప్రైవసీ చట్టం, ఉల్లంఘనలు మొదలైన ప్రశ్నలు రావచ్చు. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఇటీవల వార్తల్లో నిలిచిన అంశాలను లోతుగా అధ్యయనం చేసి బ్యాలెన్స్‌డ్ అభిప్రాయాలు ఏర్పరచుకోవాలి.
బయోడేటా లోతుగా..
అభ్యర్థులు తమ బయోడేటా(డీఏఎఫ్)లో పేర్కొన్న అంశాలపై ఎలాంటి ప్రశ్న ఎదురైనా చెప్పేలా సిద్ధమై వెళ్లాలి. డీఏఎఫ్‌లో పేర్కొన్న అంశాల్లో నుంచి మీరే ప్రశ్నలు సిద్ధం చేసుకొని..వాటి సమాధానాల కోసం కసరత్తు చేసి నాణ్యమైన సమాధానాలు రాసుకోవాలి. ఊహించిన ప్రశ్నలకు సిద్ధమైతే.. ఊహించని ప్రశ్నలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో సమాధానాలు చెప్పొచ్చు. అలాగే ఒకవేళ ఏదైనా ప్రశ్నకు సమాధానం తెలియకుంటే.. తెలియదని నిజాయితీగా చెప్పడం మేలు. కానీ, డీఏఎఫ్‌లో పేర్కొన్న అంశాలపై అడిగిన ప్రశ్నలకు తెలియదు అని సమాధానం చెప్పడం వల్ల మీరు డీఏఎఫ్‌లో అబద్ధాలు రాసారనే అభిప్రాయం బోర్డు సభ్యుల్లో కలుగుతుంది. అది అంతిమంగా మీ మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి డీఏఎఫ్‌లో పేర్కొన్న, వాటికి సంబంధించిన ప్రశ్నలను ప్రిపేరై వెళ్లాలి.
ఇవెంతో ప్రధానం..
భాష సరళంగా..
అభ్యర్థులు ఇంటర్వ్యూలో సరళమైన పదాల్లో సమాధానాలు చెప్పాలి. ఉదాహరణకు లింగవివక్ష మీద సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు.. మహిళా సాధికారత, సమ్మిళిత వృద్ధి, భాగస్వామ్య విధానం.. వంటి పదాలు కాకుండా... ‘అమ్మాయిలకు మంచి విద్య అందించడం.. మహిళా భద్రతకు విధానాలు పటిష్టం చేయడం.. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకూ.. రాజకీయాల్లో మహిళలను ప్రోత్సాహించడం.. మహిళల స్వయం సహాయక బృందాలకు పెద్ద ఎత్తున మద్ధతు తెలపడం వంటి చర్యల వల్ల లింగ వివక్షలేని సమాజాన్ని నిర్మించవచ్చు’ అని సులువుగా సమాధానాలు చెప్పాలి. వీటిల్లో నుంచి సబ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది.
సివిల్స్‌కు ఎందుకు?!
సివిల్ సర్వీసులోకి ఎందుకు రావాలనుకుంటున్నారు..? అనే ప్రశ్న ఎదురైనప్పుడు.. ఉద్యోగంలో వైవిధ్యం, పనిలో సంతృప్తి, ప్రజాసేవ, సవాళ్లతో కూడిన ఉద్యోగం వంటి అలవాటుపడిన పదబంధాలు కాకుండా.. మీ లైఫ్ స్టోరీ, నమ్మకాలు, కోర్ వాల్యూస్ గురించి చెప్పాలి. నిజాయితీగా చెప్పే సమాధానాలతో సభ్యుల మన్ననలు పొందవచ్చు. ఇప్పటికే సివిల్స్ సర్వీసులకు ఎంపికైన వారైతే .. సర్వీసులో చూసిన సానుకూల అంశాలను వివరించాలి. నెగిటివ్‌గా మాట్లాడకూడదు.
బెస్ట్ ఇచ్చామా అన్నదే ముఖ్యం..
మీకున్న సమయాన్ని బట్టి కనీసం 4-5 మాక్ ఇంటర్వ్యూలకు హాజరవ్వాలి. వీటిలో వచ్చే ఫీడ్‌బ్యాక్ సరిగా లేకుంటే మరోసారి హాజరవ్వచ్చు. వేర్వేరు మాక్‌టెస్టుల్లో భిన్నమైన ఫీడ్‌బ్యాక్ వస్తే తికమక పడకుండా.. మీకు విశ్వాసం గల సరైన దాన్ని అనుసరించండి. అంతిమంగా సివిల్స్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మన గురించి మనం పూర్తిగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలానే అత్యున్నత మేధోసంపత్తి వర్గాలతో సంభాషించే చక్కటి అవకాశం యూపీఎస్సీ ఇంటర్వ్యూ ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కొన్నిసార్లు మార్కుల విషయంలో మనం ఊహించిన ఫలితాలు రాకపోవచ్చు. మార్కుల గురించి ఎక్కువ ఆలోచించకుండా మన బెస్ట్ ఇచ్చామా లేదా అన్నదే ముఖ్యం!!

- మాక్ ఇంటర్వ్యూల్లో వేషధారణ, దుస్తులు, నడక మొదలైనవి ముఖ్యం అని చెబుతారు. కానీ, వాస్తవంగా ఇంటర్వ్యూ హాల్‌లో వీటికంటే.. మీరు చెప్పే సమాధానాల్లో ఉన్న విషయ పరిజ్ఞానానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మనం చెప్పే సమాధానాలే మన వ్యక్తిత్వాన్ని బోర్డు సభ్యులకు తెలియజేస్తాయి. నప్పే వేషధారణలో ఇంటర్వ్యూకు వెళితే సరిపోతుంది.
- బోర్డు సభ్యులు మన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి వారి నుంచి ఎదురయ్యే ప్రతి ప్రశ్నను ఒక అవకాశంగా భావించి నిర్భయంగా మన గురించి తెలిసేలా మాట్లాడాలి. మన సమాధానాల్లో తార్కికత ఉండాలి. మాటల్లో ఆత్మవిశ్వాసం ఉట్టిపడాలి. ఉదాహరణకు బోర్డు నుంచి.. ‘మన దేశంలో సుపరిపాలన కోసం చిన్న రాష్ట్రాల అవసరం ఉందని మీరు భావిస్తున్నారా?’ అనే ప్రశ్న ఎదురైనప్పుడు.. ‘అవును’, ‘కాదు’ అనే సూటి సమాధానాలు చెప్పడం వల్ల మీ గురించి తెలుసుకోవడానికి బోర్డుకు అవకాశం లభించదు. ‘అవును’, ‘కాదు’ అని చెప్పడానికి దారితీసిన కారణాలు వివరించాలి.
- పై ప్రశ్నకు నా సమాధానం అవును అయితే... ‘ఎస్ సార్, చిన్న రాష్ట్రాల వల్ల పరిపాలన సులువుగా ప్రజలకు చేరువ అవుతుందని నేను భావిస్తున్నా. ఉదాహరణకు నా సొంత రాష్ట్రం తెలంగాణలో గతంలో జిల్లాలు, మండలాలు విస్తీర్ణం పరంగా పెద్దవి. కలెక్టర్ నేరుగా ఆయా ప్రాంతాలను చూసే సమయం ఉండేది కాదు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించడం కష్టతరంగా ఉండేది. కానీ, ఇప్పుడు చిన్న రాష్ట్రం, చిన్న జిల్లాల వల్ల ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తవుతున్నాయి. కలెక్టరు, ఇతర అధికారులకు నిత్యం పనులను పర్యవేక్షించే సమయం అందుబాటులో ఉంటుంది. సమస్యలను అక్కడికక్కడే వేగంగా పరిష్కరించవచ్చు. నా అభిప్రాయం మేరకు చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాలు దేశానికి మేలే’ అని ముగిస్తాను.
- ఈ సమాధానంలో బోర్డు సభ్యులు చాలా అంశాలను పరిశీలిస్తారు. మొదట మన తార్కిక అభిప్రాయం, రెండోది.. స్థానికంగా పరిపాలన తీరుతెన్నులపై మనకు అవగాహన ఉందనే విషయాన్ని బోర్డు గుర్తిస్తుంది. మెయిన్స్‌కి, ఇంటర్వ్యూకు ఉన్న మౌలిక భేదం ఇదే. మెయిన్స్‌లో కమిటీలు ఏఆర్‌సీ, నిపుణుల అభిప్రాయాల్ని రాస్తాం. కానీ, ఇంటర్వ్యూలో మన సమాధానాలు పర్సనల్‌గా ఉండాలి. మన అభిప్రాయాలను తార్కికంగా చెప్పాలి.
ఆత్మన్యూనత, అభద్రతాభావం వీడాలి..
ముఖ్యంగా అభ్యర్థులు ఆత్మన్యూనత, అభద్రతాభావాన్ని వదిలిపెట్టాలి. పేరున్న కాలేజీలో చదవలేదనో.. ఎంఎన్‌సీ కంపెనీల్లో పనిచేసిన అనుభవం లేదనో.. వయసు 30 కంటే ఎక్కువ వంటి అపోహలను దూరం పెట్టాలి. నాకు తెలిసిన చాలామంది ఐఐటీల నుంచి పట్టాలు పొంది, బహుళజాతి కంపెనీల్లో పని అనుభవమున్నా.. ఇంటర్వ్యూలో మంచి స్కోరు చేయడంలో విఫలమయ్యారు. బోర్డు ఇంటర్వ్యూ సాగే అర్ధగంటలో మనతో మాట్లాడి మన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి నేపథ్యంతో సంబంధం లేకుండా.. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూను ఎదుర్కోవాలి. మనం ఒక సినిమాకు వెళ్లినప్పుడు అందులోని పాత్రల పేర్లు, డైలాగులు, లొకేషన్లు గుర్తించుకోం.. కానీ, బయటికి వచ్చేటప్పుడు ఆ సినిమా డీసెంట్‌గా ఉందా, ఎక్స్‌లెంట్‌గా ఉందా, భయంకరంగా ఉందా.. అనే ఒక నిర్దిష్ట అభిప్రాయానికి వస్తాం. ఇంటర్వ్యూ ప్యానల్ కూడా అంతే..! మనం చెప్పే ప్రతి సమాధానాన్ని వారు గుర్తుంచుకోరు. మొత్తంగా జరిగిన సంభాషణ మేరకు ఒక నిశ్చిత అభిప్రాయానికి వస్తారు. బోర్డుకు, మీకు మధ్య అర్థవంతమైన మేధో సంభాషణ జరిగి, ఉద్యోగానికి మీరు సరైన అభ్యర్థి అని నమ్మించగలిగితే చాలు కచ్చితంగా మీరు మంచి స్కోరు చేస్తారు.
ప్రతికూల భావన కూడదు :
- ఇంటర్వ్యూ బోర్డు మీద ముందుగానే ప్రతికూల భావనకు రాకూడదు. గతంలో ఈ బోర్డు ఇచ్చిన సగటు స్కోరు గణాంకాలు చూసి ఆందోళన అవసరం లేదు. అసలు బోర్డు గురించి పట్టించుకోనవసరం లేదు. బోర్డుతో సంబంధం లేకుండా వారిని మెప్పించే రీతిలో సమాధానాలు ఇవ్వాలి.
- మనిషిలో ఉండే హైపర్ కాన్సియస్ మన మాటలను, మనం ఏం సమాధానాలు చెబుతున్నామో నిరంతరం ‘సెల్ఫ్ ఎవాల్యూషన్’ చేస్తూ ఉంటుంది. కాబట్టి అతిగా ‘కాన్సియస్’లో ఉండకుండా సహజంగా సమాధానాలు చెప్పండి.
- అభిప్రాయాన్ని తెలుసుకునే విధంగా ప్రశ్నలు అడిగినప్పుడు మరీ షార్ట్‌గా కాకుండా, మరీ సుదీర్ఘంగా పొడిగించకుండా సమాధానాలు చెప్పాలి. మీ అభిప్రాయాన్ని నిజాయితీగా చెప్పి.. అందుకు గల కారణాలు వివరించాలి.
ఫ్లాట్ ప్రశ్నలు :
- కొన్ని సందర్భాల్లో బోర్డు సభ్యులు ‘ఫ్లాట్’ ప్రశ్నలు అడుగుతుంటారు. ఉదాహరణకు ‘దేశంలో రాజకీయాల వల్ల సమస్యలు ఏంటి’ అని అడిగినప్పుడు.. మెయిన్స్‌లో రాసిన విధంగా.. రాజకీయాలు నేరమయం కావడం... ధన బలం.. మొదలైన సమాధానాలతోనే సరిపెట్టకుండా వాటిని కొంత విపులంగా చర్చించాలి. -’Sir the problem with Indian politics is that capturing power has become an end in itself, rather than a means to do greater good.’ అనే సమాధానం చెప్పినప్పుడు... ఎథిక్స్, పాలిటిక్స్ మీద చర్చకు దారితీస్తుంది. ఫ్లాట్ ప్రశ్నలు అడిగినప్పుడు ఆ సందర్భాన్ని తెలివిగా ఉపయోగించుకొని అర్థవంతమైన చర్చకు దారితీసేలా వ్యవహరించాలి.
- బోర్డు సభ్యుల నుంచి ప్రశ్న ఎదురైనప్పుడు కాసేపు ఆలోచించి, ప్రశాంతంగా సమాధానాలు చెప్పేంత సమయం బోర్డు సభ్యులు ఇస్తారు. వారు చాలా ఓపికతో ఉంటారు. అనవసర విషయాలు చెబుతుంటే తప్ప మిగతా సందర్భాల్లో అభ్యర్థులకు సమయం ఇస్తారు. కొన్ని ప్రశ్నలకైతే పెన్సిల్‌తో సమాధానాలు రాసుకునే వీలు కూడా ఉంటుంది.
‘బ్యాలెన్స్’ తప్పొద్దు:
బోర్డు సభ్యులు కొన్నిసార్లు సరదాగా ఉన్నా, ప్రశంసించినా, విభేదించినా.. వాటితో సంబంధం లేకుండా ప్రశాంతంగా ‘బ్యాలెన్స్‌డ్’గా నడుచుకోవాలి. మీరు చెప్పే సమాధానాల్లోనూ అది ప్రతిబింబించాలి. ఉదాహరణకు వారు ‘ఆధార్ చర్చ’ మీద ప్రశ్న అడిగినప్పుడు నా సమాధానం.. ‘సర్ ఆధార్-గోప్యత... గెలుపు-ఓటమి (జీరో సమ్ గేమ్) చర్చ కాదు. మనకు ఆధార్, వ్యక్తిగత సమాచార గోప్యత రెండూ అవసరమే. ప్రస్తుతం చర్చ ఆధారా లేకా గోప్యతా.. అనే కోణంలో పూర్తిగా వక్రీకరణకు గురైంది. కానీ మనకు ఆ రెండింటి మధ్య ఉన్న స్వల్ప భేదం తెలియాల్సి ఉంది.’ సభ్యులకు ఈ సమాధానం చెప్పినప్పుడు వారి నుంచి ఆధార్ వల్ల ప్రయోజనాలు, ప్రైవసీ చట్టం, ఉల్లంఘనలు మొదలైన ప్రశ్నలు రావచ్చు. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఇటీవల వార్తల్లో నిలిచిన అంశాలను లోతుగా అధ్యయనం చేసి బ్యాలెన్స్‌డ్ అభిప్రాయాలు ఏర్పరచుకోవాలి.
బయోడేటా లోతుగా..
అభ్యర్థులు తమ బయోడేటా(డీఏఎఫ్)లో పేర్కొన్న అంశాలపై ఎలాంటి ప్రశ్న ఎదురైనా చెప్పేలా సిద్ధమై వెళ్లాలి. డీఏఎఫ్‌లో పేర్కొన్న అంశాల్లో నుంచి మీరే ప్రశ్నలు సిద్ధం చేసుకొని..వాటి సమాధానాల కోసం కసరత్తు చేసి నాణ్యమైన సమాధానాలు రాసుకోవాలి. ఊహించిన ప్రశ్నలకు సిద్ధమైతే.. ఊహించని ప్రశ్నలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో సమాధానాలు చెప్పొచ్చు. అలాగే ఒకవేళ ఏదైనా ప్రశ్నకు సమాధానం తెలియకుంటే.. తెలియదని నిజాయితీగా చెప్పడం మేలు. కానీ, డీఏఎఫ్‌లో పేర్కొన్న అంశాలపై అడిగిన ప్రశ్నలకు తెలియదు అని సమాధానం చెప్పడం వల్ల మీరు డీఏఎఫ్‌లో అబద్ధాలు రాసారనే అభిప్రాయం బోర్డు సభ్యుల్లో కలుగుతుంది. అది అంతిమంగా మీ మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి డీఏఎఫ్‌లో పేర్కొన్న, వాటికి సంబంధించిన ప్రశ్నలను ప్రిపేరై వెళ్లాలి.
ఇవెంతో ప్రధానం..
- బోర్డు సభ్యులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలు చెప్పకూడదు. మీ వయసు కంటే ఎక్కువగా బోర్డులోని వారికి పబ్లిక్ లైఫ్ అనుభవం ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు ఒక్క అబద్ధం చెప్పినా ఇట్టే పసిగట్టగలరు.
- ఓపెన్ మైండ్‌తో, స్పష్టమైన అభిప్రాయాలతో ఇంటర్వ్యూకు వెళ్లండి. మీ గురించి ప్యానెల్‌కు ఏం చెప్పాలనుకున్నారో స్పష్టత తెచ్చుకోవాలి. అకడమిక్ ప్రాజెక్టులుగానీ, వృత్తి జీవితంలో సాధించిన విజయాల గురించి నేరుగా చెప్పమని అడగకపోయినా మీరే ఆ అవకాశాన్ని సొంతంగా కల్పించుకోవాలి. మాక్‌టెస్టుల్లో భాగంగా దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఉదాహరణకు ‘మంచి నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి’ అనే ప్రశ్న అడిగినప్పుడు.. పుస్తకాల్లో ఉన్నవాటిని ఉదహరించకుండా.. మీ కాలేజీలో విజయవంతంగా చేసిన ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. దాన్ని సమర్థంగా పూర్తిచేయడానికి దోహదపడిన విలక్షణతలు ఏంటో వివరించాలి.
భాష సరళంగా..
అభ్యర్థులు ఇంటర్వ్యూలో సరళమైన పదాల్లో సమాధానాలు చెప్పాలి. ఉదాహరణకు లింగవివక్ష మీద సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు.. మహిళా సాధికారత, సమ్మిళిత వృద్ధి, భాగస్వామ్య విధానం.. వంటి పదాలు కాకుండా... ‘అమ్మాయిలకు మంచి విద్య అందించడం.. మహిళా భద్రతకు విధానాలు పటిష్టం చేయడం.. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకూ.. రాజకీయాల్లో మహిళలను ప్రోత్సాహించడం.. మహిళల స్వయం సహాయక బృందాలకు పెద్ద ఎత్తున మద్ధతు తెలపడం వంటి చర్యల వల్ల లింగ వివక్షలేని సమాజాన్ని నిర్మించవచ్చు’ అని సులువుగా సమాధానాలు చెప్పాలి. వీటిల్లో నుంచి సబ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది.
సివిల్స్‌కు ఎందుకు?!
సివిల్ సర్వీసులోకి ఎందుకు రావాలనుకుంటున్నారు..? అనే ప్రశ్న ఎదురైనప్పుడు.. ఉద్యోగంలో వైవిధ్యం, పనిలో సంతృప్తి, ప్రజాసేవ, సవాళ్లతో కూడిన ఉద్యోగం వంటి అలవాటుపడిన పదబంధాలు కాకుండా.. మీ లైఫ్ స్టోరీ, నమ్మకాలు, కోర్ వాల్యూస్ గురించి చెప్పాలి. నిజాయితీగా చెప్పే సమాధానాలతో సభ్యుల మన్ననలు పొందవచ్చు. ఇప్పటికే సివిల్స్ సర్వీసులకు ఎంపికైన వారైతే .. సర్వీసులో చూసిన సానుకూల అంశాలను వివరించాలి. నెగిటివ్‌గా మాట్లాడకూడదు.
బెస్ట్ ఇచ్చామా అన్నదే ముఖ్యం..
మీకున్న సమయాన్ని బట్టి కనీసం 4-5 మాక్ ఇంటర్వ్యూలకు హాజరవ్వాలి. వీటిలో వచ్చే ఫీడ్‌బ్యాక్ సరిగా లేకుంటే మరోసారి హాజరవ్వచ్చు. వేర్వేరు మాక్‌టెస్టుల్లో భిన్నమైన ఫీడ్‌బ్యాక్ వస్తే తికమక పడకుండా.. మీకు విశ్వాసం గల సరైన దాన్ని అనుసరించండి. అంతిమంగా సివిల్స్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మన గురించి మనం పూర్తిగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలానే అత్యున్నత మేధోసంపత్తి వర్గాలతో సంభాషించే చక్కటి అవకాశం యూపీఎస్సీ ఇంటర్వ్యూ ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కొన్నిసార్లు మార్కుల విషయంలో మనం ఊహించిన ఫలితాలు రాకపోవచ్చు. మార్కుల గురించి ఎక్కువ ఆలోచించకుండా మన బెస్ట్ ఇచ్చామా లేదా అన్నదే ముఖ్యం!!
Published date : 09 Feb 2019 11:46AM