TS PGECET 2021 Results: టీఎస్ పీజీఈసెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని పీజీఈసెట్ కార్యాలయంలో సెప్టెంబర్ 6న మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ ఫలితాలను ప్రకటించారు. అర్హత సాధించిన అభ్యర్థులు ర్యాంకు కార్డులను ఆన్‌లైన్‌లో డౌన్ లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు.
టీఎస్ పీజీఈసెట్–2021 ఫలితాల కోసం క్లిక్ చేయండి
టీఎస్ పీజీఈసెట్ ద్వారా 2021–22 విద్యాసంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని కళాశాలల్లో పీజీ కోర్సులైన ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫార్మసీ(ఎంఈ/ ఎంటెక్/ ఎంఫార్మా/ ఎంఆర్క్)తోపాటు ఫార్మ్–డి కోర్సులోనూ ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరఫున ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆగస్టు 11 నుంచి 14వ తేదీ వరకు పీజీఈసెట్‌ను నిర్వహించింది. ఆన్‌లైన్ (సీబీటీ) విధానంలో జరిగిన ఈ పరీక్షలను హైదరాబాద్‌తో పాటు వరంగల్‌లోని మొత్తం 14 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 23,187 మంది అభ్యర్థుల్లో 18,274 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 16,582 మంది అంటే 90.74 శాతం అర్హత సాధించారు.