Ambedkar Open University: దూరవిద్య ప్రవేశాలకు ఈ నెల 9 వరకు గడువు
Sakshi Education
తెలంగాణ లోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ.. డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసిందని ఓపెన్ యూనివర్సిటీ కౌన్సిలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దునుకు వేలాద్రి పేర్కొన్నారు.
ప్రవేశాల కోసం సెప్టెంబర్ 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సెప్టెంబర్ 5న ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలకు వర్సిటీ రీజనల్ సెంటర్లు, అధ్యయన కేంద్రాల్లో నేరుగా లేదా 99598 50497 నంబరులో సంప్రదించొచ్చని సూచించారు.
Published date : 06 Sep 2021 06:23PM