Engineering Students: ప్లేస్మెంట్ ఉద్యోగాలు సాధించిన ఇంజనీరింగ్ విద్యార్థులు
నూజివీడు: స్థానిక ట్రిపుల్‌ఐటీలో మెటీరియల్ అండ్ మెటలర్జికల్ ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల్లో 25 మంది విద్యార్థులు కోర్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్లు పొందారు. ఈ బ్రాంచిలో మొత్తం 55 మంది విద్యార్థులు ఉండగా పలు కంపెనీలు నిర్వహించిన ప్లేస్‌మెంట్‌లలో దాదాపు 50 శాతం మంది విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌తో కూడిన ప్లేస్‌మెంట్‌లను సాధించడం విశేషం.
Foreign Education: విదేశీ విద్యపై అవగాహన సదస్సు
శ్రీకాళహస్తి వద్ద ఉన్న ఆటోమొబైల్ విడి భాగాల తయారీ కంపెనీ రాక్‌మన్ నలుగురు విద్యార్థులను ఎంపిక చేసుకుంది. వీరికి ఏడాదికి రూ.4 లక్షలను వార్షిక వేతనంగా చెల్లించనుంది. అలాగే రూ.3 లక్షల వార్షిక వేతనంతో కుశలవ ఇంటర్నేషనల్ కంపెనీ ఏడుగురిని ఎంపిక చేసింది. మిగిలిన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు స్టైఫండ్‌ను అందించనున్నట్లు డైరెక్టర్ ఆచార్య ఎం.చంద్రశేఖర్ తెలిపారు.
School Holidays: 8, 9, 10తేదీలలో వరుసగా మూడు రోజులు పాఠశాలలకు సెలవు.. కారణం ఇదే..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మెరుగైన ప్రతిభతో మరిన్ని ప్లేస్‌మెంట్లు పొందాలన్నారు. అనంతరం విద్యార్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌వోడీ డీ మధుసూదనరావు, అధ్యాపకులు ఎ.వీరశ్రీను తదితరులు పాల్గొన్నారు.