Foreign Education: విదేశీ విద్యపై అవగాహన సదస్సు
ఈ కార్యక్రమంలో ఎడ్యు టు ఎక్సెల్ సంస్థ ప్రతినిధి రాకేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ మొదలైన దేశాల్లోని ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యా అవకాశాలను విద్యార్థులకు వివరించారు. తమ సంస్థ ఇరవై ఏళ్లుగా ఎంతోమంది విద్యార్థులకు మార్గనిర్దేశనం చేసిందన్నారు. మరో ప్రతినిధి ప్రమోద్ మాట్లాడుతూ.. ఆయా విదేశీ విశ్వ విద్యాలయాల్లో ఉపకార వేతనాల గూర్చి వివరించారు.
చదవండి: US Student Visa New Rules: దరఖాస్తులో ఈ కొత్త నిబంధనలు తెలుసుకోకపోతే... వీసా ఫీ కూడా వెనక్కి రాదు!!
విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు జీవన నైపుణ్యాలు పెంపొందించుకొని, విదేశీ విద్యా అవకాశాలను అందిపుచ్చుకుని, ప్రపంచస్థా యి నాణ్యతా ప్రమాణాలను అలవర్చుకుని జీ వితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో టీఎస్‌కేసీ సమన్వయకర్త డాక్టర్ సీహెచ్. మారుతి, స్టాఫ్ క్లబ్ సెక్రటరీ ఆడెపు శ్రీనివాస్, అధ్యాపకులు పాల్గొన్నారు.