Online Course: విదేశీ చదువు కోసం సువర్ణ అవకాశం..!
అనంతపురం: విదేశాలకు వెళ్లి చదువుకోలేని పేద, మధ్య తరగతి విద్యార్థులకు జగన్ సర్కార్ సువర్ణావకాశం కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా అందించే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రముఖ ఆన్‌లైన్ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్’ తో ఒప్పందం చేసుకుంది. దీంతో ఈ సువర్ణ అవకాశం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనుబంధ పీజీ కళాశాలలతో పాటు జేఎన్‌టీయూ(ఏ) క్యాంపస్, అనుబంధ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు అందుబాటులోకి రానుంది.
Gopal T K Krishna: ఓయూ పూర్వవిద్యార్థి భారీ విరాళం
ఇప్పటికే ఎడెక్స్, ఉన్నత విద్యా శాఖ సంయుక్తంగా టీచింగ్, లెర్నింగ్ కోసం కొత్త టెక్నాలజీ , బోధన విధానాలను రూపకల్పన చేశాయి. హార్వర్డ్, ఎంఐటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కొలంబియా, న్యూయార్క్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక వర్సిటీల నుంచి వివిధ కోర్సుల్లో విద్యార్థులు సర్టిఫికేషన్లు సులువుగా పొందవచ్చు. ఈ కోర్సు పూర్తి చేయడం ద్వారా మంచి వేతనాలతో కూడిన జాతీయ, అంతర్జాతీయ ఉద్యోగాలను సాధించేందుకు దోహదం కానుంది.
Intermediate Exams 2024: రేపటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ...
27 వేల మందికి కోర్సు లబ్ధి..
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో మొత్తం 27 వేల మంది విద్యార్థులకు ఎడెక్స్ లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే విద్యార్థుల వివరాలను ఉన్నత విద్యామండలికి అధికారులు నివేదించారు. వరల్డ్ క్లాస్ వర్సిటీలు, ఇతర విద్యా సంస్థలు అందించే రెండు వేలకు పైగా ఎడెక్స్ ఆన్‌లైన్ కోర్సులను, రెగ్యులర్ కోర్సులతో పాటు ఉచితంగా అభ్యసించవచ్చు. అనంతరం ఎడెక్స్, అంతర్జాతీయ వర్సిటీల నుంచి సర్టిఫికెట్లు అందుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయాలు, సంస్థలకు చెందిన అత్యుత్తమ అధ్యాపకులతో బోధన లభిస్తుంది. శాస్త్ర, సాంకేతిక రంగాలతో పాటు సామాజిక, సాంఘిక శాస్త్రాలకు సంబంధించిన వివిధ సబ్జెక్టులను పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చారు.
TS Intermediate Exams 2024: రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు..ఈ విషయాలు మర్చిపోవద్దు
నచ్చిన వర్టికల్స్ చదువుకునేలా...
ఎడెక్స్ కోర్సుల్లో ఎక్కువ వర్టికల్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. తద్వారా విద్యార్థి నచ్చిన వర్టికల్స్ చదువుకునేలా ప్రణాళిక రూపొందించారు. విదేశాలకు వెళ్లి అక్కడ మేటి కళాశాలల్లో చదువుకోలేని ఎంతో మంది విద్యార్థులకు ఈ విధానం ద్వారా ఎంతో మేలు చేకూరనుంది. కరిక్యులమ్‌లో భాగంగా ఎడెక్స్ కోర్సులకు అంతర్జాతీయ వర్సిటీలే ఆన్‌లైన్‌లో ఎగ్జామ్స్ నిర్వహించి సర్టిఫికెట్లు అందిస్తాయి. తద్వారా ఏపీ విద్యార్థులు గ్లోబల్ స్టూడెంట్స్‌గా ఎదుగుతారు. ప్రొఫెషనల్, సంప్రదాయ డిగ్రీ విద్యలో లోటుపాట్లను సరిచేసి స్కిల్ ఓరియంటెడ్ కోర్సులను అందించడం ద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధిలో ఎడెక్స్ ఎంతో ఉపయోగపడనుంది.
రూ.30 వేల విలువైన కోర్సు ఉచితంగా...
ప్రపంచంలోనే ప్రముఖ ఈ–లెర్నింగ్ ప్లాట్‌ఫాం వేదికగా ఉన్న ఎడెక్స్‌లో 180కి పైగా వరల్డ్‌క్లాస్ వర్సిటీలు రూపకల్పన చేసిన 2 వేల ఆన్‌లైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క కోర్సు చేయాలన్నా కనీసం రూ.30 వేలు ఖర్చు భరించాల్సి ఉంది. అయితే ఈ కోర్సులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఉచితంగా అందిస్తోంది. ఇందుకోసం ఏడాదికి రూ.50 కోట్లు ఖర్చు చేస్తోంది. డిగ్రీ సెమిస్టర్‌లో ఆరు సబ్జెక్టులు ఉంటే ఒకటి ఎడెక్స్ కోర్సుతో భర్తీ చేస్తారు. అంతర్జాతీయ వర్సిటీలతో కలిసి విద్యార్థి అసైన్‌మెంట్స్, ప్రతిభ ఆధారంగా ఎడెక్స్ సంస్థ సర్టిఫికెట్ అందిస్తుంది. రాత పరీక్షను ఎడెక్స్ రూపొందించిన ప్రశ్నాపత్రంతో వర్సిటీలే నిర్వహిస్తాయి. క్రెడిట్స్‌ను కూడా వర్సిటీలే ఇస్తాయి. ఆసక్తి గల విద్యార్థులు ఒకటి కంటే ఎక్కువ కోర్సులు చేయవచ్చు. వాటిని వాల్యు యాడెడ్ కోర్సులుగా పరిగణించి సర్టిఫికెట్ ఇస్తారు.
Open Degree Exams: నేటి నుంచి అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ పరీక్షలు
ఎడెక్స్ కోర్సు ఇలా...
డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ విద్యార్థులు తప్పనిసరిగా ఎడెక్స్ కోర్సులు అభ్యసించేలా కరిక్యులమ్‌లో ఓ భాగంగా మార్చేశారు. డిగ్రీ, పీజీ స్థాయిలో రెండు, నాలుగో సెమిస్టర్, ఇంజినీరింగ్ స్థాయిలో రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్‌లో ప్రతి విద్యార్థి వర్సిటీ లేదా కళాశాల ఎంపిక చేసిన ఎడెక్స్ కోర్సులను పూర్తి చేయాల్సి ఉంటుంది. విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా ఎడెక్స్ అందించే అంతర్జాతీయ కోర్సులను అభ్యసించేందుకు అవకాశం ఉంది. ఈ ఆన్‌లైన్ కోర్సులను విద్యార్థులకు వీలున్న సమయంలో పూర్తి చేసే వెసులుబాటు ఉంది. వారానికి నాలుగు గంటల పాటు క్లాసులు ఉంటాయి. ప్రతి విద్యార్థి ప్రత్యేక లాగిన్ ద్వారా మొబైల్ యాప్‌లో పాఠాలు వినవచ్చు. సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఆన్‌లైన్ సపోర్టింగ్ సిస్టమ్‌లో మెంటార్లు అందుబాటులో ఉంటారు.
TET: ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలి
సువర్ణ అధ్యాయం
ఆంధ్రప్రదేశ్ ఉన్నత చదువుల చరిత్రలో ఇదోక సువర్ణ అధ్యాయం. ప్రపంచంతో పోటీ పడేలా మన విద్యార్థులు మెరుగైన ఉద్యోగాలు సాధించాలి. నాణ్యమైన విద్య ద్వారానే ఇది సాధ్యం. అందుకు విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలి. అప్పుడే మన విద్యార్థులకు మెరుగైన అవకాశాలు వస్తాయి. ఎడెక్స్ ప్రోగ్రాం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుంది. బయట రూ.35వేల నుంచి 40 వేలు వెచ్చించాల్సిన కోర్సులు ఉచితంగానే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది.
– ప్రొఫెసర్ కె.హుస్సేన్‌రెడ్డి, వీసీ, ఎస్కేయూ
Tags
- foreign education
- opportunity for students
- Schools
- Online courses
- certificate courses
- students education
- AP government
- ADEX organization
- courses to study abroad
- Education News
- anantapur news
- Study Abroad
- Higher education program
- Edex partnership
- Online learning
- Study opportunities
- sakshieducation updates