Skip to main content

School Holidays: మార్చి 8, 9, 10తేదీలలో వరుసగా మూడు రోజులు పాఠశాలలకు సెలవు.. కార‌ణం ఇదే..

తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ స్కూళ్లకు, కాలేజీలకు వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించారు.
Mahashivratri Public Holiday Declaration   Telangana and Andhra Pradesh School Holiday Announcement  three days holiday for schools and colleges    Education Department Statement on Holiday Announcement

మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా పబ్లిక్ హాలిడేను ప్రభుత్వం ప్రకటించగా.. అయితే ఆ రోజు  శుక్రవారం రావడం.. మరుసటి రోజు (మార్చి 9) రెండవ శనివారం, (మార్చి 10) ఆదివారం రావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. 

చదవండి:

ఏపీ టెన్త్ క్లాస్ - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | ముఖ్యమైన ప్రశ్నలు | గైడెన్స్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్ 

టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

మహాశివరాత్రి అంటే ఏమిటి, దాన్ని ఎందుకు జరుపుకుంటారు?

ప్రతీ చాంద్రమాన మాసం లోని 14వ రోజు లేదా అమావాస్యకు ముందు రోజుని శివరాత్రి అంటారు. పంచాంగ సంవత్సరంలో వచ్చే పన్నెండు శివరాత్రులలో ఫిబ్రవరి – మార్చ్ లలో వచ్చేదానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ రాత్రి, భూమి ఉత్తర అర్థగోళం ఎటువంటి స్థితిలో ఉంటుందంటే, మనిషిలోని శక్తి సహజంగానే ఉప్పొంగుతుంది.

మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ. ఇది శివ, పార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. హిందువుల క్యాలెండరులో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో వేసవి కాలం ముందు వచ్చే మాఘ మాసంలో వచ్చే రోజుని మహాశివరాత్రి అంటారు.

2024లో సెల‌వులు వివ‌రాలు ఇవే..

☛ 26-01-2024 (శుక్రవారం) రిపబ్లిక్ డే
☛ 08-03-2024 (శుక్రవారం) మహాశివరాత్రి
☛ 25-03-2024 (సోమవారం) హోలీ
☛ 29-03-2024 (శుక్రవారం) గుడ్ ఫ్రైడే
☛ 05-04-2024 (శుక్రవారం) (బాబు జగ్జీవన్ రామ్‌ జయంతి)
☛ 09-04-2024 (మంగళవారం) ఉగాది
☛ 11-04-2024 (గురువారం) ఈద్ ఉల్ ఫితర్
☛ 17-04-2024 (బుధవారం) శ్రీరామనవమి
☛ 17-06-2024 (సోమవారం) బక్రీద్
☛ 17-07-2024 (బుధవారం) మొహర్రం
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

Published date : 02 Mar 2024 11:18AM

Photo Stories