పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని AP NITలో 2022–23 విద్యా సంవత్సరానికి గాను ఎంటెక్ ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇచ్చారు.
ఏపీ నిట్‌లో ఎంటెక్ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ
గేట్‌లో అర్హత పొందిన వారు ఎంటెక్‌లో సీటు పొందడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. సీట్ల భర్తీ ప్రక్రియను Centralized Counseling for MTech (CCMT) పర్యవేక్షిస్తుంది. నిట్ జైపూర్ ఆధ్వర్యంలో ప్రక్రియ జరుగుతుంది. జూలై రెండు, మూడు వారాల్లో కోర్సుకు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు తెలియజేస్తారు. జూలై నెలాఖరుకి ప్రక్రియ పూర్తయి ఆగస్ట్‌లో ఎంపికైన అభ్యర్థులు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సీసీఎంటీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ సీట్లు భర్తీ అవుతాయని నిట్ అధికారులు తెలిపారు.