AP NIT: ఏపీ నిట్‌తో ఈ సంస్థ ఒప్పందం
అమెరికాకు చెందిన ఆన్ లైన్ సర్వీస్ కంపెనీ ఇండియా బ్రాంచితో ఈ ఒప్పందం కుదిరిందన్నారు. వర్చువల్‌గా జరిగిన ఈ ఒప్పంద వివరాలను డైరెక్టర్ తెలియజేశారు. ఆధునిక క్లౌడ్ కంప్యూటింగ్‌తో పరిశోధనలు, ఆలోచనలు పంచుకోవం, బంధాలను బలోపేతం చేయడానికి ఈ ఒప్పందం దోహదపడుతుందన్నారు. పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి నిట్ విద్యాసంస్థలోని పరిశోధకులు కృషి చేస్తున్నారన్నారు. లింక్డ్‌ఇన్ తో తొలిసారిగా 2020లో ఎంవోయూ చేసుకుని ప్రాజెక్టు దక్కించుకున్నామని, మళ్లీ తాజాగా మరో ఎంవోయూ కుదుర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. కొత్త ప్రాజెక్టుకు సీఎస్‌ఈ విభాగానికి చెందిన సహాయ ఆచార్యులు డాక్టర్ కార్తీక్ శేషాద్రి ప్రధాన పరిశోధకునిగా, డాక్టర్ నగేష్ భట్టు సమన్వయ పరిశోధకునిగా వ్యవహరిస్తారన్నారు. లింక్డ్‌ఇన్ బిజినెస్ సిస్టమ్స్ ప్రోగ్రామ్ డైరెక్టర్ సత్తివల్లి నాగకృష్ణ, లింక్డ్‌ఇన్ డేటా ఏఐ ప్లాట్‌ఫాం డైరెక్టర్ చిదంబరన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
చదవండి: