AP NIT Achieves 3 Certificates : మూడు ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ను దక్కించుకున్న ఏపీ నిట్..
తాడేపల్లిగూడెం: ఏపీ నిట్‌కు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్‌ఓ) సర్టిఫికెట్లు మూడు వచ్చినట్టు నిట్ అధికారులు సోమవారం చెప్పారు. ప్రభుత్వ విద్యాసంస్థలు, పరిశ్రమల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ ప్రమాణాలు, ఉన్నత సదుపాయాలు, మౌలిక వసతులను పరిశీలించి ఐఎస్‌ఓ ధ్రువీకరణ పత్రాలను అందజేస్తారు. దీనిలో భాగంగా ఇటీవల ఐఎస్‌ఓ ప్రతినిధులు తాడేపల్లిగూడెం నిట్‌లోని గెస్ట్‌హౌస్, భవనాలు, ప్రయోగశాలలు, యంత్రాల పనితీరు, ఇంజినీరింగ్ విభాగాలు, ఇతర సదుపాయాలను పరిశీలించారు. రికార్డుల నిర్వహణ, బోధన, బోధనేతర సిబ్బంది వివరాలు, విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు.
No Education Funds : పాఠశాల అభివృద్ధికి నిధులు లేక ప్రధానోపాధ్యాయులే స్వయంగా..!
2015లో ఏర్పడి తక్కువ సమయంలోనే మంచి వృద్ధిని సాధించి ఇతర జాతీయ విద్యాసంస్ధలతో పాటు పోటీపడటం అభినందనీయమని ప్రశంసిస్తూ ఏపీ నిట్‌కు మూడు ఐఎస్‌ఓ సర్టిఫికెట్లు ఇచ్చారు. క్వాలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ గుడ్ ఆఫ్ అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్, ఐఎస్‌ఓ 9001, ఎన్విరాన్‌మెంటల్ గ్రీన్ ఆడిట్ సర్టిఫికెట్ 14001, ఎనర్జీ మేనేజ్‌మెంట్ సర్టిఫికెట్ 50001 వచ్చాయి. ఇన్‌చార్జి డైరెక్టర్ బీఎస్ మూర్తి, రిజిస్ట్రార్ దినేష్ శంకరరెడ్డి ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ఐఎస్‌ఓ గుర్తింపు కోసం సహకారం అందించిన వారికి అభినందనలు తెలిపారు.