AP NIT: ఏపీ నిట్‌లో ఎంబీఏకు నోటిఫికేషన్..సీట్లు వివరాలు..
Sakshi Education
ఏపీలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో 2022–24 విద్యాసంవత్సరం నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (ఎంబీఏ) కోర్సును నూతనంగా ప్రారంభించనున్నారు.
ఏపీ నిట్‌లో ఎంబీఏకు నోటిఫికేషన్..సీట్లు వివరాలు..
అక్టోబర్ 1న దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 60 సీట్లు ఉండగా, దరఖాస్తులు సమర్పించేందుకు ఆఖరు తేదీ ఈనెల 30గా నిర్ణయించారు. 2021–23 విద్యా సంవత్సరంలోనే ఎంబీఏ ప్రారంభించేందుకు ఇంతకుముందే నోటిఫికేషన్ ఇచ్చినా కోవిడ్ నేపథ్యంలో ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు. అప్పట్లో దరఖాస్తుల స్వీకరణకు జూన్ 28 చివరి తేదీగా ప్రకటించిన అధికారులు.. విద్యార్థుల నుంచి స్పందన లేకపోవడంతో 2022–24 విద్యాసంవత్సరానికి గాను తాజా నోటిఫికేషన్ ఇచ్చారు. స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ మేనేజ్‌మెంట్ (ఎస్‌హెచ్‌ఎం) స్కీమ్ కింద ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నారు. ఆన్ లైన్ లో దరఖాస్తులను పంపించాలి. 6.5 శాతం సీజీపీఏ కలిగినవారు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో 6 శాతం సీజీపీఏ ఉన్నవారు దరఖాస్తులు పంపవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.