AP NIT Colleges : ఏపీ నిట్‌లో విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు.. ఈ కార్యక్రమాలతోనే..
తాడేపల్లిగూడెం: కేంద్ర విశ్వవిద్యాలయం అనే పేరు వినడమే కానీ ఈ ప్రాంతానికి వస్తుందని ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ఊహించలేదు. కేవలం వాణిజ్య కేంద్రంగా ఉన్న తాడేపల్లిగూడెం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ విభజనానంతర పరిస్థితుల్లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో తొమ్మిదేళ్ల క్రితం అంటే 2015 ఆగస్టు 20న నిట్ ఏర్పాటు చేశారు.
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. మరో ఏడాదిపాటు ఉచిత వసతి
వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో అద్దె భవనంలో ప్రారంభమైన ఏపీ నిట్ ప్రత్యేక క్యాంపస్ ఏర్పాటు చేసుకుని, సొంత భవనాలను నిర్మించుకుని తరగతులు నిర్వహించుకునే స్థాయికి వచ్చింది. దశల వారీగా విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా అధునాతన భవనాలు, ఆహ్లాదకర వాతావరణం నిట్‌లో సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఏపీ నిట్ అంచెలంచెలుగా ఎదుగుతూ దేశంలోని 31 నిట్‌లకు గట్టి పోటీనిస్తోంది. బాలారిష్టాలను అధిగమిస్తూ శరవేగంగా ముందుకెళుతున్న ఏపీ నిట్ ఆరో స్నాతకోత్సవాన్ని శనివారం నిర్వహించనున్నారు.
1946 మందికి ఉద్యోగాలు
విద్యార్థులు కూడా కాలేజీల ఎంపికలో ఏపీ నిట్‌కు ప్రాధాన్యతనిస్తున్నారు. ఇక్కడ చేరడమే కాదు భారీ వేతనాలతో ఉద్యోగాలు పొందుతున్నారు. ఇప్పటి వరకు ఏపీ నిట్ నుంచి విద్య పూర్తి చేసుకుని 2650 మంది విద్యార్థులు బయటకు వెళ్లారు. వీరిలో 1946 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. అత్యధిక సాలుసరి వేతనం రూ. 44.1 లక్షలుగా ఉంది.
ISRO College: ఇస్రో కళాశాలలో సారపాక విద్యార్థికి సీటు
వేగంగా అభివృద్ధి పనులు
నిట్ ఏర్పాటైన తర్వాత వన్–ఎ పనుల కింద అవసరమైన భవనాలను గతంలో రూ.206 కోట్లతో నిర్మించారు. వన్–బి పనుల కింద రూ. 210 కోట్ల అంచనాతో ప్రారంభించిన పనులు, భవనాలు పూర్తయ్యాయి. ఈ విద్యాసంవత్సరంలో రూ.428 కోట్ల నిధులతో రెండో దశ పనులను చేయనున్నారు.
భారీ ప్రాజెక్టులు
నిట్‌లో పనిచేస్తున్న ఫ్యాకల్టీ సభ్యులు దేశంలో వివిధ అంశాలకు సంబంధించి మంచి ప్రాజెక్టులను చేజిక్కించుకున్నారు. స్పాన్సర్డ్ ప్రాజెక్టుల కింద రూ.15 కోట్ల విలువైన ప్రాజెక్టులను దక్కించుకున్నారు.
KaiRankonda Madhusudan: ట్రిపుల్ ఐటీ అధ్యాపకుడికి యంగ్ సైంటిస్ట్ అవార్డు
బడా కంపెనీలతో ఎంఓయూలు
దేశంలో, ప్రపంచంలో పేరున్న సంస్థలతో ఏపీ నిట్ ఎంఓయూలు కుదుర్చుకుంది. ఐఐఎం, ఐఐటీ, ఎన్‌హెచ్‌ఏఐ, లింక్డ్ ఇన్, తైవాన్ యూనివర్సిటీలతో సుమారు 21కి పైగా ఎంఓయూలు కుదుర్చుకుంది.
స్టడీ ఇన్ ఇండియా
స్టడీ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఉగాండా, ఇథియోపియా వంటి దేశాల విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. 2020–21 సంవత్సరంలో దక్షిణ భారతదేశంలో ఉత్తమ విద్యాసంస్థగా అవార్డు వచ్చింది. నిర్మాణాల విషయంలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అవార్డును దక్కించుకుంది. సొంతంగా 30 వేల యూనిట్ల సౌర విద్యుత్‌ను తయారు చేసుకునే స్థాయికి చేరింది. రూ.428 కోట్ల నిధులు వస్తే విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నారు. గేట్ ర్యాంకులు సాధించడంలో ఏపీ నిట్ విద్యార్థులు ప్రతిభ చూపుతున్నారు. ఆలిండియా గేట్ మొదటి ర్యాంకును ఏపీ నిట్ విద్యార్థి సాధించడం విశేషం. ఏటా వంద మంది నిట్ విద్యార్థులకు గేట్ ర్యాంకులు వస్తున్నాయి.
వసతుల కల్పనకు కృషి
ఏపీ నిట్ విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నాం. ట్రైనింగ్ ప్లేస్‌మెంట్ సెల్ ద్వారా విద్యార్థులకు మంచి ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తున్నాం.
– దినేష్ శంకరరెడ్డి, రిజిస్ట్రార్
Tags
- AP NIT
- Students Future
- quality education
- Job Opportunity
- Training placement cell
- National Institute of Technology AP
- Study in India
- engineering colleges
- students education
- NIT Admissions
- Education News
- AP NIT Development
- Sakshi Education News
- Tadepalligudem NIT establishment
- NIT Tadepalligudem history
- Andhra Pradesh education institutions
- NIT Andhra Pradesh post-partition
- NIT Andhra Pradesh development
- National Institute of Technology Tadepalligudem
- NIT in commercial center
- SakshiEducationUpdates