KaiRankonda Madhusudan: ట్రిపుల్ ఐటీ అధ్యాపకుడికి యంగ్ సైంటిస్ట్ అవార్డు
Sakshi Education
బాసర: బాసరలోని ట్రిపుల్ ఐటీల బయాలజీ డిపార్ట్‌మెంట్ సీనియర్ అధ్యాపకుడు కైరంకొండ మధుసూదన్ యంగ్ సైంటిస్ట్ అవార్డు అందుకున్నారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ సైన్స్ అకాడమీ సంస్థ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో ప్రొఫెసర్ సీహెచ మోహన్‌వు, తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ టీఏఎస్ అధ్యక్షుడు, సీసీఎంబీ మాజీ డైరెక్టర్, ప్రొఫెసర్ ఎస్.సత్యనారాయణ, తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జనరల్ సెక్రెటరీ, ఓయూ మాజీ వీసీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
చదవండి: IIIT Hyderabad: 77 ఏళ్ల వయసులో పీజీ పూర్తి..లేటు వయసులో.. కాలేజీ బాట!
ట్రిపుల్ ఐటీ అధ్యాపకుడు యంగ్ సైంటిస్టు అవార్డు అందుకోవడంపై యూనివర్సిటీ ఇచ్‌చార్జి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ అభినందించారు. సైన్స్ రంగంలో కృషి చేసినందుకుగాను మధుసూదన్‌కు అవార్డు రావడం హర్షణీయమని పేర్కొన్నారు. ఫలప్రదమైన పరిశోధనారంగంలో రాణించాలని ఆకాంక్షించారు. మధుసూదన్‌ను ఉద్యోగులు, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.
Published date : 17 Aug 2024 11:34AM